iDreamPost

ఇంగ్లండ్ పై సిరీస్ విజయం.. ధృవ్ జురెల్ ఎమోషనల్ పోస్ట్!

రాంచీ టెస్ట్ హీరో ధృవ్ జురెల్ ఇంగ్లండ్ పై విజయం తర్వాత ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ ట్విట్ నెట్టింట వైరల్ గా మారింది.

రాంచీ టెస్ట్ హీరో ధృవ్ జురెల్ ఇంగ్లండ్ పై విజయం తర్వాత ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ ట్విట్ నెట్టింట వైరల్ గా మారింది.

ఇంగ్లండ్ పై సిరీస్ విజయం.. ధృవ్ జురెల్ ఎమోషనల్ పోస్ట్!

ధృవ్ జురెల్.. రాంచీ టెస్ట్ హీరో. ఇంగ్లండ్ తో జరిగిన నాలుగో టెస్ట్ లో టీమిండియా 5 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. దీంతో 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను 3-1 తేడాతో కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఇక ఈ మ్యాచ్ లో యువ వికెట్ కీపర్ ధృవ్ జురెల్ సత్తాచాటాడు. రెండు ఇన్నింగ్స్ ల్లో కూడా విలువైన పరుగులు చేసి గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఇక మ్యాచ్ అనంతరం ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు జురెల్.

కీపింగ్ నైపుణ్యాలతో పాటుగా బ్యాటింగ్ లోనూ రాణిస్తున్నాడు టీమిండియా యువ క్రికెటర్ ధృవ్ జురెల్.. ఇంగ్లండ్ తో జరిగిన మూడో టెస్ట్ ద్వారా ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు జురెల్. తొలి మ్యాచ్ లో పర్వాలేదనిపించిన ఇతడు.. రెండో మ్యాచ్ కే హీరోగా మారిపోయాడు. క్లిష్ట సమయంలో జట్టును ఆదుకుని భారత జట్టుకు సిరీస్ విజయాన్ని అందించాడు. రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ లో జట్టు కష్టాల్లో మునిగిపోయిన టైమ్ లో అద్భుతమైన బ్యాటింగ్ తో 90 పరుగులు చేశాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లో కూడా 39 రన్స్ తో నాటౌట్ గా నిలిచి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఇక తన అద్భుతమైన ఆటతీరుతో జట్టును గెలిపించిన జురెల్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

Dhruv Jurel's Emotional Post!

కాగా.. ఈ విజయంలో తాను భాగమైనందుకు భావోద్వేగానికి లోనైయ్యాడు ధృవ్ జురెల్. ట్విట్టర్ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నాడు.”రోహిత్ భయ్యా, రాహుల్ సర్.. ఈ కుర్రాడిపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు. మీ నమ్మకాన్ని నేను నిలబెట్టుకున్నాననే అనుకుంటున్నాను. ఈ విజయంతో నాలో మరింతగా ఆత్మవిశ్వాసం పెరిగింది” అంటూ వాళ్లిద్దరితో ఆత్మీయంగా కౌగిలించుకున్న ఫొటోలను పంచుకున్నాడు. కాగా.. ధృవ్ జురెల్ తండ్రి కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న విషయం మనందరికి తెలిసిందే. అందుకే ఈ మ్యాచ్ లో అర్ధశతకం చేసిన తర్వాత సైనికుడిలా సెల్యూట్ చేశాడు.

ఇదికూడా చదవండి: కుల్దీప్ లెఫ్ట్ హ్యాండ్ షేన్ వార్న్.. ఇంగ్లండ్ దిగ్గజం ఆసక్తికర కామెంట్స్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి