సంచలనం! ఇంటర్నేషనల్ T 20లో వరస్ట్ రికార్డ్ .. 7 పరుగులకే ఆలౌట్!

T20: ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఇదొక చెత్త రికార్డ్. కేవలం 7 పరుగులకే ఆల్ ఔట్ కావడం అనేది షాకింగ్ విషయం.

T20: ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఇదొక చెత్త రికార్డ్. కేవలం 7 పరుగులకే ఆల్ ఔట్ కావడం అనేది షాకింగ్ విషయం.

అసలు కేవలం 7 పరుగులకే ఆలౌట్ అవ్వటం ఏంటి స్వామి.. అది కూడా బాది పడేసే టీ20 మ్యాచ్ లో.. కనీసం 10 రన్స్ స్కోర్ కూడా సాధించకుండా ఆలౌట్ అవ్వడం ఏంటి?. ప్రస్తుతం ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ని ఇస్తుంది. ఎంత వరస్ట్ టీం అయినా కూడా కనీసం టీ20 లో అయినా బాదేస్తుంది. అసలు బ్యాట్ పట్టుకోవడం రాని వాడు ఆడినా.. అసలు క్రికెట్ అంటే ఏంటో తెలీనోళ్ళు ఆడినా కూడా.. ఇంత తక్కువ రన్స్ కి ఆల్ ఔట్ అవ్వరేమో. కానీ ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఇంత తక్కువ స్కోర్ కి టీం మొత్తం ఆల్ ఔట్ కావడం అనేది నిజంగా క్రికెట్ అభిమానులకు జీర్ణించుకోలేని వార్త. ఇదొక బుర్ర పాడయ్యే విషయం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదొక అంతర్జాతీయ సంచలన చెత్త రికార్డ్.

ప్రస్తుతం EC2026 ఆఫ్రికా సబ్ రీజియన్ క్వాలిఫైయర్ మ్యాచ్ లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పోటీల్లో భాగంగా నైజీరియా, ఐవరీ కోస్ట్ టీమ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఐవరీ కోస్ట్ నైజీరియా చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయింది. కేవలం 7 పరుగులకు అల్లకల్లోలంగా ఆ టీం ఆల్ ఔట్ అయిపోయింది. ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ లో అది కూడా T 20 ల్లో ఇంత తక్కువ స్కోర్ కి ఆల్ ఔట్ కావడం ఇదే ఫస్ట్ టైమ్. ఈ మ్యాచ్ లో మొదట నైజీరియా బీభత్సం సృష్టించిందనే చెప్పాలి. మొదట బ్యాటింగ్ కి దిగిన నైజీరియా 20 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఏకంగా 271 భారీ స్కోర్ చేసింది.

ఇక భారీ టార్గెట్ తో బరిలో దిగిన ఐవరీ కోస్ట్ టీం ఆ టార్గెట్ ని కనీసం 1 పర్సెంట్ అందుకోవడానికి కూడా తనకలాడింది. అంతటి భారీ స్కోర్ ని కొట్టడానికి గజ గజ వణికి పోయింది. కేవలం 7.3 ఓవర్లలో 7 పరుగులు మాత్రమే చేసి దారుణంగా కుప్ప కూలిపోయింది. ఛేజింగ్ లో వరుసగా ఆరుగురు ప్లేయర్లు డక్ అవుట్ అయ్యారు. ముగ్గురు మాత్రం తలో ఒక రన్ తీశారు. వీరిలో ఓపెనర్ మొహ్మద్ మాత్రం అందరి కంటే ఎక్కువగా 4 పరుగులు చేశాడు. ఇంత చెత్త రికార్డు గతంలో మంగోలియా పేరు మీద ఉండేది. గతంలో మంగోలియా సింగపూర్ తో ఆడిన మ్యాచ్ లో 10 రన్స్ చేసింది. ఇక ఆ చెత్త రికార్డుని తాజాగా ఐవరీ కోస్ట్ బద్ధలు కొట్టింది. ఇక ఈ చెత్త రికార్డ్ గురించి మీరేమి అనుకుంటున్నారో.. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments