ప్రస్తుతం టీమిండియా వెస్టిండీస్ పర్యటనలో ఉంది. టెస్ట్, వన్డే సిరీస్ ను గెలుచుకున్న భారత జట్టు టీ20లో మాత్రం తడబడింది. ఐదు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో ఇప్పటి వరకు జరిగిన మూడు టీ20 మ్యాచ్ ల్లో విండీస్ వరుసగా రెండు మ్యాచ్ లు గెలవగా.. భారత్ ఒక మ్యాచ్ లో విజయం సాధించింది. ఇక విండీస్ పర్యటనలో టీమిండియా ప్రయోగాలు చేస్తూనే ఉంది. మరికొన్ని రోజుల్లో వరల్డ్ కప్, ఆసియా కప్ లాంటి మెగా టోర్నీలు ఉండటంతో.. సీనియర్ ప్లేయర్లకు విశ్రాంతి ఇచ్చి యంగ్ ప్లేయర్ల సత్తాకు పరీక్ష పెడుతోంది మేనేజ్ మెంట్. కాగా.. కీలకమైన నాలుగో టీ20లో టీమిండియా పలు మార్పులో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శుబ్ మన్ గిల్ లపై వేటు వేసి.. అతడి స్థానంలో విధ్వంసకర ఆటగాడికి మరో ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
వెస్టిండీస్ తో జరిగిన మూడో టీ20లో అద్భుత విజయం సాధించిన టీమిండియా.. మరో కీలక పోరుకు రెడీ అయ్యింది. ఫ్లోరిడా వేదికగా శనివారం విండీస్ తో కీలకమైన నాలుగో టీ20లో తలపడనుంది. ఇక ఈ మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ ను సమం చేయాలని భావిస్తోంది టీమిండియా. అందులో భాగంగానే కొన్ని మార్పులతో బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వరుసగా మూడు మ్యాచ్ ల్లో విఫలమైన యంగ్ ఓపెనర్ శుబ్ మన్ గిల్ పై వేటు వేయాలని భావిస్తోందట జట్టు మేనేజ్ మెంట్. ఇక అతడి స్థానంలో విధ్వంసకర ఆటగాడు ఇషాన్ కిషన్ ను తిరిగి మళ్లీ జట్టులోకి తీసుకోవాలని కెప్టెన్ హార్దిక్ పాండ్యా, కోచ్ రాహుల్ ద్రవిడ్ యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే విండీస్ తో జరిగిన మూడు మ్యాచ్ ల్లో దారుణంగా విఫలం అయ్యాడు గిల్. కేవలం 19 పరుగులు మాత్రమే చేసి తన పూర్ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. దీంతో అతడికి బ్రేక్ ఇచ్చి ఇషాన్ కిషన్ కు మరో అవకాశం ఇవ్వాలని టీమిండియా మేనేజ్ మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఫ్లోరిడా పిచ్ ఫాస్ట్ బౌలర్లకు కాస్త అనుకూలంగా ఉంటుంది. ఈ క్రమంలోనే టీమిండియా స్పిన్నర్ చాహల్ స్థానంలో పేసర్ ఆవేశ్ ఖాన్ కు తుది జట్టులో స్థానం కల్పించనున్నట్లు రిపోర్టులు పేర్కొంటున్నాయి. మరి గిల్ స్థానంలో ఇషాన్ ను తీసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదికూడా చదవండి: 16 నుంచి ఆంధ్రా ప్రీమియర్ లీగ్! భారీ ధర పలికిన టీమిండియా క్రికెటర్ హనుమ విహారి