ఆసీస్ తో జరిగిన రెండు మ్యాచ్ ల్లోనూ ఇషాన్ కిషన్ బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలతో చెలరేగాడు. ఇప్పుడు మూడో మ్యాచ్ కోసం సిద్దమవుతున్నాడు. ఈ క్రమంలోనే తన సక్సెస్ సీక్రెట్ ను రివీల్ చేశాడు.
ఆసీస్ తో జరిగిన రెండు మ్యాచ్ ల్లోనూ ఇషాన్ కిషన్ బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలతో చెలరేగాడు. ఇప్పుడు మూడో మ్యాచ్ కోసం సిద్దమవుతున్నాడు. ఈ క్రమంలోనే తన సక్సెస్ సీక్రెట్ ను రివీల్ చేశాడు.
ప్రతీ వ్యక్తి సక్సెస్ వెనక ఎవరో ఒకరు ఉంటారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. సందర్భం వచ్చినప్పుడు వారిని ప్రపంచానికి పరిచయం చేస్తుంటారు. తాజాగా తన సక్సెస్ సీక్రెట్ ను రివీల్ చేశాడు టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్ లో భారత యంగ్ ప్లేయర్లు రెచ్చిపోతున్నారు. ఆసీస్ బౌలర్లను దంచికొడుతూ.. జట్టు విజయాలకు దోహదపడుతున్నారు. తొలి మ్యాచ్ లో కొండంత భారీ లక్షాన్ని ఛేదించిన ఉడుకు రక్తం.. అదే జోరును రెండో మ్యాచ్ లోనూ చూపించింది. అయితే ఈ రెండు మ్యాచ్ ల్లోనూ ఇషాన్ కిషన్ బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలతో చెలరేగాడు. ఇప్పుడు మూడో మ్యాచ్ కోసం సిద్దమవుతున్నాడు. ఈ క్రమంలోనే తన విజయాలకు కారణాలను వెల్లడించాడు.
ఇషాన్ కిషన్.. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్ లో దుమ్మురేపుతున్నాడు. వరుసగా రెండు మ్యాచ్ ల్లోనూ అద్భుత ఆటతీరు కనబరిచి బ్యాక్ టు బ్యాక్ అర్ధశతకాలు నమోదు చేశాడు. తొలి మ్యాచ్ లో ఛేజింగ్ లో 58 రన్స్, రెండో మ్యాచ్ లో 52 పరుగులు చేసి సత్తా చాటాడు. ఇక మూడో మ్యాచ్ కోసం సిద్దమవుతున్నాడు ఈ యువ బ్యాటర్. ఈ క్రమంలోనే తాను ఇలా ఆడటానికి కారణాలను వెల్లడించాడు. తన సక్సెస్ సీక్రెట్ ను రివీల్ చేశాడు.
“నా విజయానికి కారణం ట్రైనర్, డైటీషియనే. వీరిద్దరు నా బాడీని కరెక్ట్ గా ఉండేలా చూస్తాడు. నెక్ట్స్ మ్యాచ్ లకు అందుబాటులో ఉండే విధంగా వారు నా శరీరాన్ని కాపాడుతూ వస్తున్నారు. అయితే నేను వారికి చాలా డబ్బులు చెల్లిస్తున్నాను. వీటితో పాటుగా బౌలర్లు వేసిన బాల్స్ కు అనుగుణంగా షాట్లు కొడుతూ.. వస్తున్నాను. ఇదే నాకు ఫలితాన్ని ఇస్తోంది” అంటూ ఇషాన్ చెప్పుకొచ్చాడు. లైన్ అండ్ లెంగ్త్ బాల్ ను గౌరవించడం, లైన్ తప్పిన బాల్ ను దంచికొట్టడం చేస్తున్నానని తెలిపాడు ఈ యువ బ్యాటర్. ఇక కీలకమైన మూడో మ్యాచ్ గుహవాటి వేదికగా మంగళవారం (నవంబర్ 28)న జరగనుంది. మరి ఇషాన్ కిషన్ సక్సెస్ సీక్రెట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.