iDreamPost
android-app
ios-app

తప్పు తెలుసుకున్న ఇషాన్ కిషన్.. బీసీసీఐ వార్నింగ్​తో..!

  • Published Feb 27, 2024 | 10:00 PM Updated Updated Feb 27, 2024 | 10:00 PM

టీమిండియా యంగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ తన తప్పును తెలుసుకున్నాడు. భారత క్రికెట్ బోర్డు కన్నెర్ర చేయడంతో అతడు దిగిరాక తప్పలేదు.

టీమిండియా యంగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ తన తప్పును తెలుసుకున్నాడు. భారత క్రికెట్ బోర్డు కన్నెర్ర చేయడంతో అతడు దిగిరాక తప్పలేదు.

  • Published Feb 27, 2024 | 10:00 PMUpdated Feb 27, 2024 | 10:00 PM
తప్పు తెలుసుకున్న ఇషాన్ కిషన్.. బీసీసీఐ వార్నింగ్​తో..!

భారత యంగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ పేరు ఈ మధ్య వార్తల్లో బాగా వినిపిస్తోంది. అయితే ఆటతీరుతో కాదు ఓ వివాదం వల్ల అతడి పేరు న్యూస్​లో ఎక్కువగా వస్తోంది. టీమిండియా హెడ్ కోచ్​ రాహుల్ ద్రవిడ్ మాటను బేఖాతరు చేయడం.. రంజీల్లో ఆడమని సూచించినా ఇషాన్ పెడచెవిన పెట్టడం తెలిసిందే. రంజీలు కాదని ఐపీఎల్-2024 ప్రిపరేషన్స్​లో బిజీ అయిపోవడంతో ఇషాన్​కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇషాన్ అయినా సరే.. ఇంకెవరైనా సరే ఫస్ట్ క్లాస్ క్రికెట్​లో ఆడాల్సిందేనని బీసీసీఐ సెక్రటరీ జై షా హుకుం జారీ చేశారు. దీంతో తప్పు తెలుసుకున్న కిషన్.. మళ్లీ గ్రౌండ్​లోకి దిగాడు. స్థానిక డీవై పాటిల్ టీ20 టోర్నమెంట్​లో ఆడుతున్నాడు. కానీ ఏం లాభం.. చాన్నాళ్ల తర్వాత ఆడిన ఫస్ట్ మ్యాచ్​లోనే ఈ టీమిండియా పాకెట్ డైనమైట్ తుస్సుమన్నాడు.

బీసీసీఐ కన్నెర్ర చేయడంతో దిగొచ్చిన ఇషాన్.. డీవై పాటిల్ టోర్నీలో బరిలోకి దిగాడు. అయితే రీంట్రీలో మాత్రం అతడు ఊహించినంతగా ఆకట్టుకోలేకపోయాడు. డీవై పాటిల్ టోర్నీలో ఆర్బీఐ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇషాన్.. రూట్ మొబైల్ లిమిటెడ్ టీమ్​తో మంగళవారం జరిగిన మ్యాచ్​లో తేలిపోయాడు. మ్యాచ్​లో మంచి స్టార్ట్ రావడంతో ఊపు మీద కనిపించాడతను. 11 బంతుల్లో 19 పరుగులు చేసిన ఇషాన్.. భారీ ఇన్నింగ్స్​ ఆడటం పక్కా అని అంతా అనుకున్నారు. కానీ మాక్స్​వెల్ స్వామినాథన్ బౌలింగ్​లో ఈజీ క్యాచ్ ఇచ్చి పెవిలియన్​కు చేరుకున్నాడు. బ్యాటింగ్​లో స్థాయికి తగ్గట్లుగా ప్రదర్శన చేయని ఇషాన్.. వికెట్ కీపింగ్​లో ఫర్వాలేదనిపించాడు. ఈ మ్యాచ్​లో ఇద్దర్ని ఔట్ చేయడంలో అతడు భాగమయ్యాడు.

సుమిత్ క్యాచ్ పట్టిన ఇషాన్ కిషన్.. సయన్ మోండల్​ను స్టంపౌట్ చేసి ఆకట్టుకున్నాడు. ఇక, ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన రూట్ లిమిటెడ్ టీమ్ 20 ఓవర్లలో 193 పరుగులు చేసింది. భారీ టార్గెట్​ను అందుకునేందుకు బరిలోకి దిగిన ఇషాన్ టీమ్ ఆర్బీఐ 16.3 ఓవర్లలో 103 పరుగులకు చాప చుట్టేసింది. ఇక, ఇషాన్ కిషన్ భారత్ తరఫున చివరగా 2023, నవంబర్​లో ఆస్ట్రేలియాపై మ్యాచ్​ ఆడాడు. ఆ తర్వాత సౌతాఫ్రికా టూర్​కు సెలక్ట్ అయినా పర్సనల్ రీజన్స్ సాకుగా చూపి సిరీస్ మధ్యలోని ఇంటికి తిరిగొచ్చేశాడు. ఆ తర్వాత రంజీల్లో ఆడి ఫామ్ నిరూపించుకోమని కోచ్ ద్రవిడ్, బీసీసీఐ సూచించినా వినలేదు. ఇషాన్ తీరుతో సీరియస్​గా ఉన్న బోర్డు అతడి కాంట్రాక్ట్​ను రద్దు చేయాలని యోచిస్తున్నట్లు క్రికెట్ వర్గాల సమాచారం. మరి.. రీఎంట్రీలో ఇషాన్ ఫ్లాప్ అవడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: బీసీసీఐ దెబ్బకు దిగొచ్చిన అయ్యర్! వేరే దారి లేకపోవడంతో..