SNP
SNP
ఆసియా కప్ గెలుపు తర్వాత టీమిండియా ఆటగాళ్లు ఎంతో ఉల్లాసంగా కనిపించారు. మ్యాచ్ తర్వాత గ్రౌండ్‌లో నవ్వులు, సంబురాలతో భారత క్రికెటర్ల ముఖాలు కళకళలాడాయి. ఈ క్రమంలో టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్.. ఏకంగా విరాట్ కోహ్లీనే ఇమిటేట్ చేశాడు. కోహ్లీ వాకింగ్ స్టైల్‌ను కోహ్లీ ముందే ఇమిటేట్ చేసి నవ్వులు పూయించాడు. అయితే.. తన వాకింగ్ స్టైల్‌ను ఇషాన్ కిషన్ సరిగా చేయలేదని, నేను మరీ ఇలా నడుస్తునా అంటూ కోహ్లీ ఇషాన్ చేసిన ఇమిటేషన్‌ను ఇంకా దారుణంగా ఇమిటేట్ చేసి ఇషాన్ పరువుతీశాడు.
ఇదంతా కెమెరా కంటికి చిక్కడంతో సోషల్ మీడియాలో వీడియో తెగ వైరల్ అవుతుంది. హార్దిక్ పాండ్యా, శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మతో పాటు కోహ్లీ కూడా ఉండగా.. ఇషాన్ ఈ సాహసానికి ఒడిగట్టాడు. సాధారణంగా కోహ్లీనే అందర్ని ఇమిటేట్ చేస్తుంటాడు. జస్ప్రీత్ బుమ్రా, హర్భజన్ సింగ్ బౌలింగ్ యాక్షన్‌లను కోహ్లీ గతంలో ఇమిటేట్ చేసిన వీడియోలు ఇప్పటికీ నవ్వు తెప్పిస్తుంటాయి. కానీ, కోహ్లీని ఇప్పుడు ఇషాన్ ఇమిటేట్ చేయడం హైలెట్‌గా మారింది. అయితే.. దాన్ని కోహ్లీ ఒప్పుకోలేదు. తాను అలా ఏం నడవను అంటూ ఇషాన్ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడంటూ.. అతన్నే ఇమిటేట్ చేశాడు.
ఆటగాళ్లు ఇలా ఎంతో ఫన్నీగా.. సీనియర్, జూనియర్ అంటూ తారతమ్యాలు లేకుండా కలిసి ఉండటంపై క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టీమ్‌లో ఇలాంటి మంచి వాతావరణం ఉంటే.. అది ఆటలోనూ రిఫ్లెక్ట్ అవుతుందని అంటున్నారు. కోహ్లీ గ్రౌండ్‌లో ఎంత అగ్రెసివ్‌గా ఉంటాడో.. అదే రేంజ్‌లో ఫన్సీ థింక్స్ కూడా చేస్తుంటాడు. ఏది ఏమైనా.. ఆసియా కప్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన కనబర్చింది. ముఖ్యంగా ఫైనల్‌లో అయితే.. మన హైదరాబాదీ కుర్రాడు మొహమ్మద్ సిరాజ్ అయితే 6 వికెట్లతో దుమ్మురేపాడు. పైగా ఒకే ఓవర్‌లో ఏకంగా 4 వికెట్లు పడగొట్టాడు. మరి టీమిండియా ఆసియా కప్ గెలవడంతో పాటు.. మ్యాచ్ తర్వాత కోహ్లీ-ఇషాన్ మధ్య జరిగిన ఫన్సీ ఇన్సిడెంట్ గురించి మా అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Ishan Kishan mimics Virat Kohli’s walk. (Rohit Juglan).
Virat Kohli counters it later! pic.twitter.com/1UWc7aaNsP
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 17, 2023
ఇదీ చదవండి: 23 ఏళ్ళ భారత్ పగ తీర్చిన సిరాజ్! అప్పట్లో మన పరువు తీశారు!