SNP
టీమిండియా ఫ్యూచర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఇషాన్ కిషన్.. కొంతకాలంగా జట్టులో లేడు. నిబంధనలు ఉల్లంఘించినందుకు అతన్ని టీమ్ నుంచి తీసేసినట్లు వార్తలు వచ్చాయి. అయినా కూడా ఇషాన్ తన తీరు మార్చుకోలేదు. అసలు ఇంతకీ ఇషాన్ ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం..
టీమిండియా ఫ్యూచర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఇషాన్ కిషన్.. కొంతకాలంగా జట్టులో లేడు. నిబంధనలు ఉల్లంఘించినందుకు అతన్ని టీమ్ నుంచి తీసేసినట్లు వార్తలు వచ్చాయి. అయినా కూడా ఇషాన్ తన తీరు మార్చుకోలేదు. అసలు ఇంతకీ ఇషాన్ ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం..
SNP
టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన తీసుకుంటున్న నిర్ణయాలు, వ్యవరిస్తున్న తీరుపై భారత క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న ఆటగాడు.. ఇలా పిచ్చి పిచ్చి పనులతో ఇందుకు తన చేతులతోనే తన కెరీర్‌ను నాశనం చేసుకుంటున్నాడో అర్థం కావడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు ఇంత ఆందోళన చెందడానికి కారణం ఏంటో చాలా మందికి తెలిసే ఉంటుంది. ప్రస్తుతం టీమిండియాలో ఉండాల్సిన ఇషాన్.. జట్టు బయట ఎందుకు ఉన్నాడో కొన్ని రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. మానసిక విశ్రాంతి కోసమంటూ టీమిండియా ఆడే మ్యాచ్‌లకు దూరమైన ఇషాన్ కిషన్.. దుబాయ్‌లో పార్టీలకు, అలాగే కౌన్ బనేగా కరోడ్ పతి షోలో పాల్గొన్నందుకు బీసీసీఐ అతనిపై ఆగ్రహంగా ఉన్న విషయం తెలిసిందే.
క్షమశిక్షణా చర్యల్లో భాగంగా ఇషాన్‌ను ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ఎంపిక చేయలేదు. అయితే.. తొలి రెండు టెస్టులు ఆడిన కేఎస్ భరత్ విఫలం అవ్వడంతో ఇషాన్ కిషన్‌ను జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్ వచ్చింది. అయితే.. చాలా రోజులుగా క్రికెట్‌కు దూరంగా ఉన్న ఇషాన్‌ను మళ్లీ జట్టులోకి తీసుకోవాలంటే.. అతను దేశవాళి క్రికెట్ ఆడి వస్తే బాగుంటుందని టీమిండియా హెడ్ కోచ్ ద్రవిడ్ పేర్కొన్నాడు. అయితే.. ఇషాన్‌ను కచ్చితంగా దేశవాళి క్రికెట్ ఆడాలని తామేమి నిబంధన పెట్టలేదని, కానీ, ఆడితే మంచిదని అన్నాడు. ఇలా జట్టులోకి మళ్లీ తీసుకునేందుకు కోచ్ ద్రవిడ్ హింట్ ఇచ్చినా.. ఇషాన్ కిషన్ అతని మాటలను పెడచెవిన పెట్టినట్లు తెలుస్తోంది.
ఎలాగో ఇంగ్లండ్‌తో మూడు టెస్ట్ ప్రారంభానికి ఇంకా వారం రోజుల సమయం ఉంది. ఈ లోపు.. ఓ రంజీ మ్యాచ్ ఆడితే.. ఇషాన్‌ను తిరిగి టీమ్‌లోకి తీసుకునే అవకాశం ఉంది. కానీ, ఇషాన్ రంజీ మ్యాచ్‌లు ఆడకుండా.. పాండ్యా బ్రదర్స్.. హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలతో కలిసి.. బరోడాలోని కిరణ్ మోరే అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. అంటే.. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో ఆడేందుకు తాను సిద్ధంగా లేనని, ఇక మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నట్లు ఇషాన్ చెప్పకనేచెప్పాడు. అంటే.. ద్రవిడ్ మాట లెక్కెచేయకుండా.. ఇషాన్ తన ఇగో చూపిస్తున్నాడంటూ క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు. ఎలాగో పాండ్యా ముంబై ఇండియన్స్ కెప్టెన్ కాబట్టి, ఇషాన్ కూడా అదే టీమ్ కనుక.. అతనితో కలిసి ఐపీఎల్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. అంటే దేశం కంటే ఐపీఎల్ ఎక్కువ అయిపోయిందా ఇషాన్‌కు అంటూ కొంతమంది అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా పిచ్చి పిచ్చి పనులు చేస్తే అసలుకే మోసం వచ్చి.. కెరీర్ నాశనం అయ్యే అవకాశం ఉందంటూ హెచ్చరిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Ishan Kishan has been practicing at the kiran more academy in Baroda for the last few weeks with the Pandya brothers🏏(Cricbuzz) pic.twitter.com/UvPuf7vs2g
— CricketGully (@thecricketgully) February 7, 2024