iDreamPost
android-app
ios-app

Ishan Kishan: ఇషాన్​కు ఇంకో ఆప్షన్ లేదు.. వార్నింగ్ ఇచ్చిన BCCI సెక్రటరీ!

  • Published Feb 15, 2024 | 2:05 PM Updated Updated Feb 15, 2024 | 2:05 PM

భారత యంగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్​కు బీసీసీఐ సెక్రటరీ జై షా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అతడికి మరో ఆప్షన్ లేదన్నారు. ఇంకా షా ఏమన్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

భారత యంగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్​కు బీసీసీఐ సెక్రటరీ జై షా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అతడికి మరో ఆప్షన్ లేదన్నారు. ఇంకా షా ఏమన్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Feb 15, 2024 | 2:05 PMUpdated Feb 15, 2024 | 2:05 PM
Ishan Kishan: ఇషాన్​కు ఇంకో ఆప్షన్ లేదు.. వార్నింగ్ ఇచ్చిన BCCI సెక్రటరీ!

టీమిండియా యంగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్​ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. అయితే తన ఆటతీరుతో కాదు.. ఒక వివాదంలో అతడి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. భారత జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సూచనలను ఇషాన్ లెక్కచేయలేదని.. సెలక్టర్లకు అతడికి మధ్య చెడిందనే వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. దీనికి అతడు రంజీ ట్రోఫీలో ఆడకపోవడమే కారణంగా చెబుతున్నారు. మానసిక సమస్యలతో సౌతాఫ్రికా టూర్ మధ్యలోనే భారత జట్టును వీడాడు ఇషాన్. అయితే ట్రీట్​మెంట్ చేయించుకోవడం లేదా రెస్ట్ తీసుకోవాల్సింది పోయి బయట ఫ్రెండ్స్​తో పార్టీలు చేసుకున్నట్లు ఆ మధ్య న్యూస్ వచ్చింది. ఇక్కడి నుంచి అతడికి టీమ్ మేనేజ్​మెంట్​కు మధ్య ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందని వినికిడి. తిరిగి టీమిండియాలోకి రావాలంటే డొమెస్టిక్ క్రికెట్ ఆడే రావాలని ద్రవిడ్ సూచించినా అతడు పట్టించుకోకపోవడం వివాదానికి కారణమని తెలుస్తోంది. తాజాగా ఈ కాంట్రవర్సీపై బీసీసీఐ సెక్రటరీ జై షా రియాక్ట్ అయ్యారు.

భారత జట్టు ఆడే సిరీస్​ల్లో చోటు దక్కని ప్లేయర్లు వెళ్లి డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని జై షా స్పష్టం చేశారు. యువ ఆటగాళ్లు ఎప్పుడూ ఫిట్​గా ఉండేందుకు ఆ టోర్నీలు ఎంతో దోహదపడతాయని తేల్చిచెప్పారు. టీమిండియాకు దూరమైన వారు, సిరీస్​ల్లో చోటు దక్కని ఆటగాళ్లు తప్పకుండా దేశవాళీల్లో ఆడాలని ఆటగాళ్లకు స్వయంగా తానే శుక్రవారం లేఖ రాయనున్నట్లు జై షా పేర్కొన్నారు. ‘డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని కెప్టెన్, కోచ్ చెబితే ఎవ్వరైనా తప్పకుండా వినాలి. వాళ్లు వెళ్లి దేశవాళీ క్రికెట్ టోర్నీల్లో భాగమవ్వాలి. నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్న ప్రతి క్రికెటర్​కు కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయి. ఇంజ్యురీ అయిన ప్లేయర్లను మాత్రం ఆడాలని ఒత్తిడి తీసుకురాం. భారత జట్టులోకి తిరిగి రావాలంటే ఫిట్​గా ఉండాల్సిందే. బీసీసీఐతో కాంట్రాక్ట్​లో ఉన్న క్రికెటర్లందరికీ ఈ రూల్స్ వర్తిస్తాయి’ అని జై షా వెల్లడించారు.

రూల్స్ విషయంలో ప్రత్యేకంగా ఇషాన్ కిషన్ పేరును తీసుకురావడం కరెక్ట్ కాదన్నారు జై షా. ఈ యంగ్​స్టర్​కు కూడా డొమెస్టిక్ క్రికెట్​లో ఆడాలనే నిబంధన తప్పకుండా వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఎవరికీ మినహాయింపు లేదని.. బీసీసీఐతో ఒప్పందం ఉన్న ప్రతి ప్లేయర్ దేశవాళ్లీలో ఆడాల్సిందేనని క్లారిటీ ఇచ్చారు జై షా. కాగా, భారత జట్టుకు దూరంగా ఉన్న ఇషాన్​ను రంజీల్లో ఆడాలని ద్రవిడ్ సూచించాడట. అయితే కోచ్ మాటల్ని పట్టించుకోని యంగ్ బ్యాటర్ వెళ్లి రిలయన్స్ గ్రౌండ్​లో పాండ్యా బ్రదర్స్​తో ప్రాక్టీస్​ చేయడం చర్చనీయాంశంగా మారింది. త్వరలో ఐపీఎల్​ స్టార్ట్ కానుండటంతో ముంబై ఇండియన్స్ యాజమాన్యానికి చెందిన మైదానంలో సాధన చేశాడు. ఈ ఫొటోలు బయటకు రావడంతో బీసీసీఐ సీరియస్ అయింది. ఈ క్రమంలోనే తాజాగా జై షా రూల్స్ ప్రస్తావన తీసుకొచ్చారు. ఇషాన్​కు ఇంకో ఆప్షన్ లేదని.. డొమెస్టిక్ క్రికెట్​ ఆడాల్సిందేనని స్పష్టం చేశారు. మరి.. ఇషాన్ కిషన్ వివాదంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: IPL 2024 సీజన్ కు సంబంధించి బిగ్ అప్డేట్.. ఆ వార్తలన్నింటికీ చెక్!