SNP
SNP
టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ టెస్టుల్లో తన తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశారు. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ స్థానంలో బ్యాటింగ్‌కు ముందుగా వచ్చిన ఇషాన్.. వచ్చిన ఛాన్స్‌ను అద్భుతంగా వాడుకుంటూ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. దాంతో పాటే 17 ఏళ్ల భారీ రికార్డును బద్దలుకొట్టాడు. ఆ రికార్డను 2006లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నమోదు చేశాడు. ధోని.. టీమిండియా కెప్టెన్‌గా, బ్యాటర్‌గా, వికెట్ కీపర్‌గా మోస్ట్ సక్సెస్‌ఫుల్ ప్లేయర్ అనే విషయం తెలిసిందే. సింగిల్ హ్యాండ్‌గా ఎన్నో మ్యాచ్‌లు గెలిపించాడు. అయితే తన కెరీర్ ఆరంభంలో ధోని చాలా అగ్రెసివ్‌గా బ్యాటింగ్ చేసేవాడు. హెలికాప్టర్ షాట్లను టెస్ట్ క్రికెట్‌లోనూ ఆడుతూ.. ప్రేక్షకులను ఎంటటైన్ చేసేవాడు.
ఆ క్రమంలోనే 2006లో పాకిస్థాన్‌తో జరిగిన టెస్టులో ధోని 34 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేసి సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన వికెట్ కీపర్‌గా ధోని రికార్డు నెలకొల్పాడు. ధోని రికార్డును తాజాగా ఇషాన్ బ్రేక్ చేశాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఇషాన్ 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో ధోని 34 బంతుల హాఫ్ సెంచరీ రికార్డ్ బ్రేక్ అయింది. అయితే.. టీమిండియా వికెట్ కీపర్ టెస్టుల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన రికార్డు మాత్రం రిషభ్ పంత్ ఖాతాలో ఉంది. పంత్.. 2022లో శ్రీలంకపై 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి అగ్రస్థానంలో ఉన్నాడు. మొత్తంగా టెస్టుల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన జాబితా పంత్ ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా.. ఇషాన్ కిషన్ ఐదో స్థానంలో ఉన్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగుల చేసింది. విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగగా.. రోహిత్, జడేజా, అశ్విన్ హాఫ్ సెంచరీలు చేశారు. ఇక వెస్టిండీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్‌ను టీమిండియా బౌలర్లు 255 పరుగులకే ఆలౌట్ చేశారు. సిరాజ్ 5 వికెట్లతో సత్తా చాటాడు. రెండో ఇన్నింగ్స్ ఆడేందుకు బరిలోకి దిగిన టీమిండియా 24 ఓవర్లలోనే కేవలం 2 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీలతో రాణించారు. భారీ టార్గెట్‌తో రెండో ఇన్నింగ్స్ ఆడేందుకు వచ్చిన వెస్టిండీస్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. ఐదో రోజు మరో 8 వికెట్లు పడగొడితే టీమిండియా సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేస్తుంది. వెస్టిండీస్ చేతిలో ఉన్న 8 వికెట్లతో మరో 289 పరుగులు చేయగలిగితే సిరీస్‌ను 1-1తో సమం చేస్తుంది. ప్రస్తుతం భారత బౌలర్లు ఉన్న ఫామ్ దృష్ట్యా అది సాధ్యం కాకపోవచ్చు. మరి ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్, ధోని రికార్డును బద్దలు కొట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Ishan Kishan reached his maiden Test half century with a six.
What a moment, just 33 balls! pic.twitter.com/qKgXA8bJ5X
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 23, 2023
ఇదీ చదవండి: వివాదాస్పదంగా మారిన హర్మన్‌ప్రీత్ ప్రవర్తన! ఇలా చేయడం కరెక్టేనా?