Somesekhar
టీమిండియా టీ20 వరల్డ్ కప్ 2024 గెలుస్తుందా?అన్న ప్రశ్న ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా వినిపిస్తోంది. ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. టీమిండియా గత కొంతకాలంగా మెగాటోర్నీలు గెలవకపోవడానికి ప్రధాన కారణం ఒకటుందని చెప్పుకొచ్చారు టీమిండియా మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, ఇర్ఫాన్ పఠాన్. మరి ఆ రీజన్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
టీమిండియా టీ20 వరల్డ్ కప్ 2024 గెలుస్తుందా?అన్న ప్రశ్న ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా వినిపిస్తోంది. ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. టీమిండియా గత కొంతకాలంగా మెగాటోర్నీలు గెలవకపోవడానికి ప్రధాన కారణం ఒకటుందని చెప్పుకొచ్చారు టీమిండియా మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, ఇర్ఫాన్ పఠాన్. మరి ఆ రీజన్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
Somesekhar
టీమిండియా.. గత దశాబ్ద కాలంగా ఒక్కటంటే ఒక్కటి కూడా ఐసీసీ ట్రోఫీని గెలుచుకోలేకపోయింది. అంతమాత్రాన జట్టు బాగా ఆడట్లేదా? అంటే అదీలేదు. అద్భుతంగా రాణిస్తోంది. మేటి జట్లను మట్టికరిపిస్తూ.. ముందుకు సాగుతోంది. కానీ గత కొంత కాలంగా భారత జట్టు ప్రదర్శనను గమనిస్తున్నట్లైతే.. ఒక లోపం మాత్రం స్పష్టంగా కనిపిస్తూ వస్తోంది. ఇది లోపం అనాలో.. లేక సమస్య అనాలో అర్ధం కావట్లేదు చూసేవారికి. ఈ క్రమంలోనే టీమిండియా టీ20 వరల్డ్ కప్ 2024 గెలుస్తుందా?అన్న ప్రశ్న ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా వినిపిస్తోంది. ఈ క్వశ్చన్ కు తమ తమ ఆన్సర్స్ ను వెల్లడిస్తూ వస్తున్నారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీడా దిగ్గజాలు. ఈ నేపథ్యంలో ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. టీమిండియా గత కొంతకాలంగా మెగాటోర్నీలు గెలవకపోవడానికి ప్రధాన కారణం ఒకటుందని చెప్పుకొచ్చారు టీమిండియా మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, ఇర్ఫాన్ పఠాన్. మరి ఆ రీజన్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
వరల్డ్ కప్ 2023 ఓటమి తర్వాత టీమిండియాపై తీవ్ర ఒత్తిడి ఉందనే చెప్పాలి. ఎందుకంటే? గత 10 సంవత్సరాలుగా టీమిండియా ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా గెలవలేకపోయింది. దీంతో టీమిండియా ఫ్యాన్స్ ఈ విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వీరి అసంతృప్తిని చల్లార్చి, టీమిండియా దశాబ్ద కాలం కల తీర్చాలని భావిస్తున్నారు ఆటగాళ్లు. ఇక టీ20 వరల్డ్ కప్ 2024ను ఎలాగైనా గెలవాలన్న కసితో ఉన్నారు. ఇప్పటికే దీనిపై ఫోకస్ పెట్టి ప్రణాళికలను సైతం వేస్తూ వస్తోంది మేనేజ్ మెంట్. అందులో భాగంగానే ప్రయోగాలు చేస్తూ.. యువ క్రికెటర్లను పరీక్షిస్తోంది. ఇదిలా ఉండగా.. కీలక టోర్నీల్లో అద్భుతంగా రాణిస్తున్న టీమిండియా నాకౌట్ మ్యాచ్ లకు వచ్చేసరికి చేతులెత్తేస్తోంది.
ఈ నేపథ్యంలో ఈ పొట్టి ప్రపంచ కప్ టీమిండియా గెలుస్తుందా? అన్న ప్రశ్న ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. కాగా.. భారత జట్టు పొట్టి ప్రపంచ కప్ గెలవాలంటే ఆ ఒక్క సమస్యను అధిగమించాలని టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ తో పాటుగా మాజీ ప్లేయర్ ఇర్ఫాన్ పఠాన్ సూచించాడు. ఈ విషయంపై తాజాగా వీరిద్దరు మాట్లాడుతూ..”టీ20లకు కావాల్సింది ఫియర్ లెస్ క్రికెట్. అందుకు తగ్గట్లుగా ప్లేయర్లు వారి మైండ్ సెట్ ను రెడీ చేయాలి. ఇక టీమిండియా గత కొంతకాలంగా ఒక్క మెగాటోర్నీ కూడా గెలవలేదు. దానికి ఏకైక కారణం బలమైన బౌలింగ్ యూనిట్ లేకపోవడమే. జట్టులో స్టార్ బౌలర్లు ఉన్నాగానీ.. వారు కీలక సమయాల్లో గాయాలపాలవ్వడం, విఫలం అవ్వడం చేత భారత్ ట్రోఫీలు గెలవలేకపోతోంది. ఇటీవల జరిగిన కీలక మ్యాచ్ ల్లో ఇండియా బౌలర్లు దారుణంగా విఫలం అయ్యారు. దాన్ని వారు అధిగమించాలి” అని చెప్పుకొచ్చాడు ఇర్ఫాన్ పఠాన్.
ఇక భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. మరో సమస్యను లేవనెత్తాడు. “టీమిండియాలో సరైన ఆల్ రౌండర్ లేడని, ఉన్న వారు కూడా వారి సత్తాకు తగ్గట్లు రాణించలేకపోతున్నారు. ఆల్ రౌండర్లు తమ నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేయడంతో పాటుగా బ్యాటింగ్ చేయగలరు. ఇలాంటి ఫొట్టి ఫార్మాట్ కు ఆల్ రౌండర్స్ జట్టుకు అద్భుతంగా ఉపయోగపడతారు” అని తెలిపాడు గవాస్కర్. ఇదిలా ఉండగా.. టీమిండియాలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్ లతో పాటుగా తాజాగా జట్టులోకి వచ్చిన అద్భుతమైన యువ బౌలర్లు ఉన్నారు. ప్రస్తుతం బుమ్రా టీమిండియా బౌలింగ్ దళానికి నాయకత్వం వహిస్తున్నాడు. షమీ, సిరాజ్ లు సూపర్ గా బౌలింగ్ చేస్తున్నారు. కానీ నాకౌట్ మ్యాచ్ లకు వచ్చేసరికి భారత బౌలింగ్ చేతులెత్తేస్తోంది. ఇది జట్టుకు పెద్ద సమస్యగా మారిందని ఈ మాజీలు చెబుతున్న మాట. టీమిండియా బౌలింగ్ యూనిట్ ను మరింత స్ట్రాంగ్ గా చేసుకుంటేనే ఐసీసీ కప్పులు కొట్టగలుగుతుందని వారు చెప్పుకొచ్చారు. మరి వారి వాదనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
What should #TeamIndia do to win ICC Men’s T20 World Cup?
Our experts #SunilGavaskar & #IrfanPathan have their say 👀
Do you agree? Let us know pic.twitter.com/XOnfIer1jL
— Star Sports (@StarSportsIndia) January 11, 2024