iDreamPost
android-app
ios-app

IPL కోసం ఎదురుచూస్తున్నారా? ఇది పక్కా గుడ్ న్యూస్!

  • Published Mar 16, 2024 | 5:10 PM Updated Updated Mar 16, 2024 | 5:10 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సెకండ్ ఫేజ్ విదేశాల్లో నిర్వహిస్తారని వార్తలు వస్తున్నాయి. దీని మీద తాజాగా టోర్నీ ఛైర్మన్ అరుణ్​ ధుమాల్ క్లారిటీ ఇచ్చారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సెకండ్ ఫేజ్ విదేశాల్లో నిర్వహిస్తారని వార్తలు వస్తున్నాయి. దీని మీద తాజాగా టోర్నీ ఛైర్మన్ అరుణ్​ ధుమాల్ క్లారిటీ ఇచ్చారు.

  • Published Mar 16, 2024 | 5:10 PMUpdated Mar 16, 2024 | 5:10 PM
IPL కోసం ఎదురుచూస్తున్నారా? ఇది పక్కా గుడ్ న్యూస్!

భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఐపీఎల్-2024 మీద పడింది. ఇన్నాళ్లూ టెస్ట్ క్రికెట్ మజా ఏంటో చూసిన ఆడియెన్స్.. ఇప్పుడు ధనాధన్ క్రికెట్​ జాతరను ఎంజాయ్ చేయనున్నారు. క్యాష్ రిచ్ లీగ్ నయా సీజన్ స్టార్ట్ అయ్యేందుకు ఇంకో వారం రోజుల టైమ్ కూడా లేదు. మార్చి 22వ తేదీన ఈ టోర్నీ ప్రారంభం కానుంది. ఫస్ట్ మ్యాచ్​లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్​తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనుంది. ఏప్రిల్ 7న జరిగే మ్యాచులతో తొలి దశ ముగుస్తుంది. లీగ్ నిర్వాహకులు ఫస్ట్ ఫేజ్​ షెడ్యూల్​ను మాత్రమే అనౌన్స్ చేశారు. కేవలం 21 మ్యాచుల నిర్వహణ గురించి మాత్రమే క్లారిటీ ఇచ్చారు. దీంతో టోర్నీ సెకండ్ ఫేజ్ ఎప్పుడు? ఎక్కడ? నిర్వహిస్తారనేది ఇంట్రెస్టింగ్​గా మారింది. దీని మీద తాజాగా ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్​ ధుమాల్ రియాక్ట్ అయ్యారు.

దేశంలో పార్లమెంట్, పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఐపీఎల్ సెకండ్ ఫేజ్ షెడ్యూల్​ ఇంకా కొలిక్కి రాలేదు. ఎలక్షన్ కమిషన్ ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత దీనిపై కొంత స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఈలోపు ఐపీఎల్ సెకండ్ ఫేజ్​పై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. మిగతా మ్యాచులు విదేశాల్లో నిర్వహిస్తారని.. ఐపీఎల్ దేశం దాటి పోక తప్పదనేది ఆ వార్తల సారాంశం. ఈ నేపథ్యంలో దీని మీద ఐపీఎల్ ఛైర్మన్ ధుమాల్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వ సంస్థలతో చర్చలు జరుపుతున్నామని ఎన్నికల తేదీలను ప్రకటించాక ఐపీఎల్ రెండో దశపై తుది నిర్ణయం తీసుకుంటామని ధుమాల్ చెప్పారు. తొలి దశలాగే రెండో దశ మ్యాచులు కూడా భారత్​లోనే జరుగుతాయని ఆశిస్తున్నామని ఆయన తెలిపారు. విదేశాలకు టోర్నీని తరలించే ఛాన్సులు లేవని.. సాధ్యమైనంతగా ఇండియాలోనే మ్యాచులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.

కాగా, ఐపీఎల్ సెకండ్ ఫేజ్​కు సంబంధించి వైరల్ అవుతున్న రూమర్స్​ ప్రకారం దుబాయ్​కు టోర్నీని షిఫ్ట్ చేస్తారట. దుబాయ్​ వేదికగా మిగిలిన మ్యాచులను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని వినికిడి. ఇందులో భాగంగానే ఆటగాళ్ల నుంచి పాస్​పోర్ట్​లను కూడా తీసుకున్నారట. కొన్ని ఫ్రాంచైజీలు తమ ప్లేయర్ల పాస్​పోర్ట్​లను సేకరించడం స్టార్ట్ చేశాయని క్రికెట్ వర్గాల సమాచారం. దీని మీద బీసీసీఐ అతి త్వరలో తుది నిర్ణయం తీసుకోనుందని.. ఐపీఎల్ సెకండ్ ఫేజ్ దేశం దాటి వెళ్లడం పక్కా అని నెట్టింట గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే భారత్​లోనే రెండో దశ మ్యాచులు నిర్వహిచేందుకు ప్రయత్నిస్తున్నామని తాజాగా ఐపీఎల్ ఛైర్మన్ ధుమాల్ క్లారిటీ ఇచ్చారు. మ్యాచులు దేశం దాటిపోయే ఛాన్స్ లేదని అన్నారు. దీంతో ఇప్పటికైనా ఈ పుకార్లకు ఫుల్​స్టాప్ పడుతుందేమో చూడాలి. మరి.. ఐపీఎల్ కోసం మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.