Nidhan
ఐపీఎల్ నయా సీజన్ ఆరంభానికి ముందు ఫ్రాంచైజీలకు కొత్త తలనొప్పి మొదలైంది. ఈ సమస్యను బీసీసీఐ ఎలా పరిష్కరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
ఐపీఎల్ నయా సీజన్ ఆరంభానికి ముందు ఫ్రాంచైజీలకు కొత్త తలనొప్పి మొదలైంది. ఈ సమస్యను బీసీసీఐ ఎలా పరిష్కరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
Nidhan
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ నయా సీజన్‌కు టైమ్ దగ్గర పడుతోంది. కొత్త సీజన్ మొదలవడానికి ఇంకో 10 రోజుల సమయం కూడా లేదు. దీంతో ఇప్పటికే ఆయా జట్లలో ఆడే ఆటగాళ్లు తమ ఫ్రాంచైజీలతో జాయిన్ అయ్యారు. జోరుగా ప్రాక్టీస్ చేస్తూ ఈసారి కప్పు కొట్టాలని చూస్తున్నారు. స్థానిక ఆటగాళ్లు, భారత క్రికెటర్స్‌తో పాటు ఫారెన్ ప్లేయర్స్ కూడా తమ టీమ్స్‌తో కలిశారు. దీంతో ఆయా సిటీల్లో ఐపీఎల్ సందడి మొదలైపోయింది. యాడ్స్, భారీ హోర్డింగులు పెడుతూ ఐపీఎల్ ఫీవర్‌ను మరింత పెంచుతున్నారు. ప్లేయర్లు కూడా కొత్త సీజన్ గురించి.. అలాగే తమ ప్రాక్టీస్ విశేషాలను వీడియోలు తీసి సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. అయితే ఈ తరుణంలో ఫ్రాంచైజీలకు కొత్త తలనొప్పి మొదలైంది.
ఐపీఎల్ నయా సీజన్‌కు ముందు ఫ్రాంచైజీలకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. సీజన్ ఆరంభానికి ఇంకో పది రోజుల టైమ్ కూడా లేదు. ఈ తరుణంలో పలు జట్లలో గాయాల కారణంగా కొందరు కీలక ప్లేయర్లు హఠాత్తుగా క్యాష్ రిచ్ లీగ్ నుంచి తప్పుకున్నారు. టోర్నమెంట్ స్టార్ట్ అవడానికి ముందే కీలక ఆటగాళ్లు తప్పుకోవడంతో ఆ ఫ్రాంచైజీలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఆక్షన్‌లో ఎంతో కష్టపడి వ్యూహాలు పన్ని ఆటగాళ్లను దక్కించుకుంటే తీరా సీజన్ మొదలవడానికి ముందే వాళ్లు దూరమవుతుండటం ఫ్రాంచైజీలను తీవ్రంగా కలవరపెడుతోంది. ఏదో ఒక జట్టులో ఈ సమస్య తలెత్తిందంటే లైట్ తీసుకోవచ్చు. కానీ దాదాపుగా సగం ఫ్రాంచైజీలు దీన్ని ఫేస్ చేస్తున్నాయట. దీంతో ఈ విషయాన్ని బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లాలని అన్ని ఫ్రాంచైజీలు డిసైడ్ అయ్యాయట.
టోర్నీ నుంచి హఠాత్తుగా దూరమవుతున్న ప్లేయర్ల సమస్య గురించి బీసీసీఐ పెద్దల్ని కలసి చర్చించాలని ఫ్రాంచైజీలు నిర్ణయించుకున్నాయని సమాచారం. అనుకోకుండా దూరమైన ప్లేయర్ల స్థానంలో కొత్త వారిని తీసుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని బోర్డును జట్లు కోరనున్నాయని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. అలాగే టోర్నీ ఆరంభానికి ముందే వెళ్లిపోకుండా ఆపాలని రిక్వెస్ట్ చేయనున్నాయట. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీలు ఎదుర్కొంటున్న సమస్యను బీసీసీఐ ఎలా పరిష్కరిస్తుందో చూడాలి. కాగా, పర్సనల్ రీజన్స్ వల్ల ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఈ సీజన్‌కు దూరమయ్యాడు. ఢిల్లీ ప్రాక్టీస్ క్యాంప్‌లో అతడు ఇంతవరకు జాయిన్ కాలేదు. సరిగ్గా ఇదే కారణంతో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్ జేసన్ రాయ్ కూడా ఈ సీజన్లో ఆడట్లేదు. ఇలా కొందరు ప్లేయర్లు వ్యక్తిగత కారణాలు చూపి, మరికొందరు గాయం వల్ల దూరమవుతుండటంతో ఫ్రాంచైజీలు తలలు పట్టుకుంటున్నాయి. మరి.. ఐపీఎల్ నయా సీజన్‌కు ముందు జట్లకు వచ్చిన సమస్య మీద మీ ఒపీనియన్‌ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
IPL franchises are considering to address the issue to BCCI about unexpected and sudden pullouts of players which disturb their auction planning. [Cricbuzz] pic.twitter.com/QlE3OQ9CXd
— Johns. (@CricCrazyJohns) March 13, 2024
ఇదీ చదవండి: కాళ్ళు తీసేసే స్థితి నుండి.. రీ-ఎంట్రీ వరకు! పంత్ గ్రేటెస్ట్ కమ్ బ్యాక్ స్టోరీ!