ఐపీఎల్ మినీ వేలంలో ఒక బ్యాటర్ కోసం ఎస్ఆర్హెచ్ ఎన్ని కోట్లయినా ఖర్చు పెడుతుందన్నాడు మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్.
ఐపీఎల్ మినీ వేలంలో ఒక బ్యాటర్ కోసం ఎస్ఆర్హెచ్ ఎన్ని కోట్లయినా ఖర్చు పెడుతుందన్నాడు మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్.
రీసెంట్గా ముగిసిన 5 టీ20ల సిరీస్‌లో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా.. నెక్స్ట్ సౌతాఫ్రికాతో సిరీస్‌కు సిద్ధమైపోయింది. ఇప్పటికే భారత జట్టు సఫారీ గడ్డపై ల్యాండ్ అయిపోయింది. అయితే ఈ సిరీస్ కంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ పైనే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఆసక్తి చూపుతున్నారు. ఐపీఎల్-2024 మొదలవ్వడానికి ఇంకా చాలా టైమ్ ఉంది. కానీ మెగా లీగ్‌కు సంబంధించిన మినీ వేలం త్వరలో జరగనుంది. దీంతో ఈసారి ఆక్షన్‌లో ఏయే ప్లేయర్లను ఏయే ఫ్రాంచైజీలు దక్కించుకుంటాయి? అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. రీసెంట్గా ఆటగాళ్ల రిటెన్షన్ కూడా ముగిసిన సంగతి తెలసిందే. దీంతో క్రికెటర్ల ట్రేడింగ్ విండోకు డిసెంబర్ 12వ తేదీన తెరపడనుంది. ఇప్పటికే ఫ్రాంచైజీలు తమకు కావాల్సిన ప్లేయర్లను రిటైన్ చేసుకున్నాయి. అలాగే తమకు భారంగా మారిన వారిని వదులుకున్నాయి. తద్వారా వేలానికి ముందు కొంత డబ్బులను కూడా సమకూర్చుకున్నాయి.
మినీ ఆక్షన్ కోసం ఇప్పటికే ఐపీఎల్ ఫ్రాంచైజీలు అన్నీ తమ ప్రణాళికల్ని రెడీ చేసుకుంటున్నాయి. టీమ్ కాంబినేషన్లో సెట్ అయ్యే ప్లేయర్లు, తమ అవసరాలకు తగ్గట్లు ఆడగలిగే వారిపై ఓ కన్నేశాయి. ఎలాగైనా వారిని దక్కించుకునేందుకు ప్రయత్నించనున్నాయి. ఈసారి కొందరు స్టార్ ఆటగాళ్లు ఆక్షన్‌లో పాల్గొననుండటంతో వాళ్ల కోసం ఫ్రాంచైజీల మధ్య భారీ పోటీ తప్పేలా లేదు. ఈ నేపథ్యంలో మినీ వేలంపై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. వన్డే వరల్డ్ కప్‌లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన న్యూజిలాండ్ ఓపెనర్ రచిన్ రవీంద్ర కోసం భారీ పోటీ తప్పదని అన్నాడు. అతడి కోసం చాలా ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశం ఉందన్నాడు. మరీ ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ రచిన్ కోసం పెద్ద మొత్తంలో డబ్బుల్ని ఖర్చు చేసేలా కనిపిస్తోందని పఠాన్ అన్నాడు. ఎస్ఆర్హెచ్ టీమ్ కొన్ని విషయాల్లో బాగుందని.. కానీ ఆ జట్టులో వికెట్లు తీయగల సత్తా ఉన్న స్నిన్నర్ల కొరత ఉందన్నాడు పఠాన్.
క్వాలిటీ స్పిన్‌తో వికెట్లు తీస్తూ బ్యాటింగ్‌లో కూడా సత్తా చాటే ఆటగాడు ఎస్ఆర్హెచ్లో లేడన్నాడు పఠాన్. గతంలో ఆదిల్ రషీద్ రూపంలో ఒక స్పిన్ ఆల్‌రౌండర్‌ను తీసుకున్నప్పటికీ ఆ సమస్యను తీర్చలేకపోవడంతో అతడ్ని ఫ్రాంచైజీ వదులుకుందున్నాడు. టీమ్‌లోకి ఇప్పటికే మయాంక్ మార్కండేయ లాంటి బెటర్ స్పిన్నర్ ఉన్నాడని.. కానీ అతడి కంటే మరింత మెరుగ్గా బౌలింగ్ చేసే ప్లేయర్ సన్‌రైజర్స్‌కు అవసరమని పఠాన్ తెలిపాడు. వాషింగ్టన్ సుందర్, మార్కో యాన్సెన్ రూపంలో స్పిన్, పేస్ ఆల్‌రౌండర్స్ ఆక్షన్‌లో ఉన్నారని చెప్పాడు. అయితే వీళ్ల కంటే కూడా రచిన్ రవీంద్రను తీసుకుంటే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ విభాగం మరింత బలోపేతం అవుతుందన్నాడు. రచిన్ వస్తే సన్‌రైజర్స్ ఓపెనింగ్ సమస్య కూడా తీరుతుందన్నాడు పఠాన్. ఒక్క ప్లేయర్‌తో ఇన్ని సమస్యలు తీరే ఛాన్స్ ఉంది కాబట్టే అతడి కోసం ఎస్ఆర్హెచ్ ఎన్ని కోట్లు అయినా పెడుతుందని పేర్కొన్నాడు. మరి.. రచిన్ రవీంద్ర ఎస్ఆర్హెచ్లోకి వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: IPL ఫ్రాంచైజీలపై గుజరాత్ టైటాన్స్ CEO సీరియస్.. తప్పు చేస్తున్నారంటూ..!
Will SRH go for Rachin Ravindra in the upcoming auction? 🤔🏏#IrfanPathan #RachinRavindra #SRH #iplauction2024 #Insidesport #CricketTwitter pic.twitter.com/Wp46ukLyQH
— InsideSport (@InsideSportIND) December 7, 2023