iDreamPost

IPL ఫ్రాంచైజీలపై గుజరాత్ టైటాన్స్ CEO సీరియస్.. తప్పు చేస్తున్నారంటూ..!

  • Author singhj Published - 11:39 AM, Fri - 8 December 23

కొన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీలు వ్యవహరిస్తున్న తీరు సరికాదంటూ గుజరాత్ టైటాన్స్ సీఈవో సీరియస్ అయ్యారు. వాళ్లు తప్పు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

కొన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీలు వ్యవహరిస్తున్న తీరు సరికాదంటూ గుజరాత్ టైటాన్స్ సీఈవో సీరియస్ అయ్యారు. వాళ్లు తప్పు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

  • Author singhj Published - 11:39 AM, Fri - 8 December 23
IPL ఫ్రాంచైజీలపై గుజరాత్ టైటాన్స్ CEO సీరియస్.. తప్పు చేస్తున్నారంటూ..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్-2024) నెక్స్ట్ సీజన్ మొదలవ్వడానికి ఇంకా కొంత సమయం ఉంది. కానీ ఇప్పుడీ లీగ్ వార్తల్లో ఒకటిగా నిలుస్తోంది. దీనికి కారణం రీసెంట్​గా ముగిసిన ప్లేయర్ల రిటెన్షన్ ప్రక్రియ ఒకటైతే.. మరో కారణం త్వరలో జరగనున్న మినీ వేలం. ఇటీవల జరిగిన ఆటగాళ్ల రిటెన్షన్​లో అనూహ్యంగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను దక్కించుకుంది ముంబై ఇండియన్స్. స్టార్​ ఆల్​రౌండర్​ గుజరాత్​కు గుడ్​ బై చెబుతాడని ముందు నుంచి గాసిప్స్ వినిపించాయి. అయితే అతడు ఎందుకు వెళ్లిపోవాలని ఫిక్స్ అయ్యాడు? గుజరాత్ కూడా అతడ్ని ఎందుకు వదులుకోవాలని అనుకుంటోంది? అనేది ఎవరికీ అర్థం కాలేదు. సోషల్ మీడియాలో వైరల్​గా మారిన ఈ గాసిప్స్ నిజమై.. హార్దిక్ ముంబైకి మారిపోయాడు. సొంతగూటికి వెళ్లిపోవాలని కోరుకోవడం వల్లే అతడ్ని వదిలేశామని గుజరాత్ టైటాన్స్ వర్గాలు తర్వాత క్లారిటీ ఇచ్చాయి.

హార్దిక్ పాండ్యా వెళ్లిపోవడంతో గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ కెప్టెన్సీ పగ్గాలను యంగ్ ఓపెనర్ శుబ్​మన్ గిల్​కు అప్పజెప్పింది. గత రెండు సీజన్లలోనూ టీమ్ తరఫున దుమ్మురేపుతూ, అద్భుతంగా పెర్ఫార్మ్ చేసినందుకు నాయకత్వ బాధ్యతలను అతడికి అప్పజెప్పినట్లు తెలుస్తోంది. అయితే కేన్ విలియమ్సన్, మహ్మద్ షమి, డేవిడ్ మిల్లర్ లాంటి ఎక్స్​పీరియెన్స్​డ్ ప్లేయర్లు టీమ్​లో ఉన్నా గిల్​ను కెప్టెన్‌ చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ముఖ్యంగా కెప్టెన్సీలో ఎంతో అనుభవం ఉన్న కేన్ మామను సారథిగా నియమించకుండా గుజరాత్ తప్పు చేసిందనే కామెంట్లు వినిపించాయి. ఇదిలా ఉంటే.. హార్దిక్ పాండ్యా బాటలో మరో స్టార్ ప్లేయర్ కూడా నడవనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్ కప్​లో టీమిండియా తరఫున దుమ్మురేపిన స్టార్ పేసర్ మహ్మద్ షమి ఐపీఎల్​లో గుజరాత్​కు ఆడుతున్న సంగతి తెలిసిందే. అలాంటి షమీని ఎరగేసుకుపోవడానికి కొన్ని ఫ్రాంచైజీలు ప్రయత్నిస్తున్నాయని టాక్.

షమీని ట్రేడ్ చేసుకునేందుకు ఓ ఫ్రాంచైజీ విపరీతంగా ప్రయత్నించిందట. ఈ విషయాన్ని స్వయంగా గుజరాత్ టైటాన్స్ సీఈవో కల్నల్ అర్విందర్ సింగ్ తెలిపారు. గుజరాత్​ మేనేజ్​మెంట్​ను నేరుగా సంప్రదించకుండా సపోర్ట్ స్టాఫ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారని అన్నారు. ఇలా అప్రోచ్ కావడం కరెక్ట్ కాదని ఆయన సీరియస్ అయ్యారు. బీసీసీఐ గవర్నింగ్ కౌన్సిల్ పెట్టిన రూల్స్​ను కొన్ని ఫ్రాంచైజీలు తుంగలో తొక్కుతున్నాయని ఫైర్ అయ్యారు అర్విందర్ సింగ్. ఆ ఫ్రాంచైజీలు తప్పు చేస్తున్నాయని.. ఇది సరికాదని చెప్పుకొచ్చారు. సపోర్ట్​ స్టాఫ్​తో కాకుండా డైరెక్ట్​గా తమను సంప్రదిస్తే డీల్ గురించి మాట్లాడేవాళ్లమని ఆయన పేర్కొన్నారు. అయితే ఆ ఫ్రాంచైజీల పేర్లను మాత్రం ఆయన రివీల్ చేయలేదు. అర్విందర్ సింగ్​కు కొందరు నెటిజన్స్ మద్దతు తెలుపుతున్నారు. ఎవ్వరైనా సరే రూల్స్ పాటించాల్సిందేనని అంటున్నారు. మరి.. ఐపీఎల్ ఫ్రాంచైజీలు వ్యవహరిస్తున్న తీరు తప్పంటూ గుజరాత్ టైటాన్స్ సీఈవో అర్విందర్ చేసిన విమర్శలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Tripti Dimri: ఆ టీమిండియా క్రికెటర్ అంటే చచ్చేంత ఇష్టం అంటున్న ‘యానిమల్’ బ్యూటీ!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి