iDreamPost
android-app
ios-app

IPLలో సంచలన మార్పులు.. కావ్యా మారన్ దెబ్బకు దిగొచ్చిన BCCI!

  • Published Aug 02, 2024 | 11:40 AM Updated Updated Aug 02, 2024 | 11:40 AM

ఇండియన్ ప్రీమియర్​ లీగ్​లో సంచలన మార్పులకు భారత క్రికెట్ బోర్డు సిద్ధమైందని తెలుస్తోంది. అయితే ఇన్నాళ్లూ లేనిది అనూహ్యంగా మార్పులు జరగడానికి ఫుల్ క్రెడిట్ సన్​రైజర్స్ కో-ఓనర్ కావ్యా మారన్​కే ఇవ్వాలని ఎక్స్​పర్ట్స్ అంటున్నారు.

ఇండియన్ ప్రీమియర్​ లీగ్​లో సంచలన మార్పులకు భారత క్రికెట్ బోర్డు సిద్ధమైందని తెలుస్తోంది. అయితే ఇన్నాళ్లూ లేనిది అనూహ్యంగా మార్పులు జరగడానికి ఫుల్ క్రెడిట్ సన్​రైజర్స్ కో-ఓనర్ కావ్యా మారన్​కే ఇవ్వాలని ఎక్స్​పర్ట్స్ అంటున్నారు.

  • Published Aug 02, 2024 | 11:40 AMUpdated Aug 02, 2024 | 11:40 AM
IPLలో సంచలన మార్పులు.. కావ్యా మారన్ దెబ్బకు దిగొచ్చిన BCCI!

ఇండియన్ ప్రీమియర్​ లీగ్​లో సంచలన మార్పులకు భారత క్రికెట్ బోర్డు సిద్ధమైందని తెలుస్తోంది. అయితే ఇన్నాళ్లూ లేనిది అనూహ్యంగా మార్పులు జరగడానికి ఫుల్ క్రెడిట్ సన్​రైజర్స్ కో-ఓనర్ కావ్యా మారన్​కే ఇవ్వాలని ఎక్స్​పర్ట్స్ అంటున్నారు. ఈ ఏడాది ఆఖర్లో మెగా ఆక్షన్​ నిర్వహించనున్న నేపథ్యంలో రీసెంట్​గా అన్ని ఫ్రాంచైజీల ఓనర్స్​తో బీసీసీఐ సమావేశమైన సంగతి తెలిసిందే. ఇందులో శాలరీ పర్స్, ప్లేయర్ల రిటెన్షన్, ఆర్టీఎంతో పాటు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్​ లాంటి వాటిపై సుదీర్ఘ చర్చ జరిగిందని తెలిసింది. అయితే ఈ పాయింట్లతో పాటు సన్​రైజర్స్ కో-ఓనర్ కావ్యా మారన్ లేవనెత్తిన ఫారెన్ ప్లేయర్ల బ్యాన్​ మీద కూడా వాడివేడిగా డిస్కషన్స్ నడిచాయని సమాచారం.

ఆక్షన్​లో టీమ్స్​కు ఎంపికైన తర్వాత కావాలని గాయం సాకు చూపి లీగ్​లో ఆడకుండా తప్పించుకునే విదేశీ ఆటగాళ్ల మీద నిషేధం విధించాలని కావ్యా మారన్ పట్టుబట్టారట. వేలంలో తక్కువ ధర వచ్చిందనే కోపంతో కొందరు ఆటగాళ్లు ఇంజ్యురీ కాకపోయినా అయ్యిందనే సాకుతో ఐపీఎల్​కు అందుబాటులో లేకుండా పోతున్నారు. ఇంకొందరు ఆడటం ఇష్టం లేక ఇంటర్నేషనల్ కమిట్​మెంట్స్ లేదా ఫ్యామిలీ అర్జెన్సీని సాకుగా చూపి జట్లను మధ్యలోనే వదిలేసి వెళ్తున్నారు. దీని వల్ల టీమ్స్​ మీద తీవ్ర ప్రభావం పడుతోందని బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లారట కావ్యా మారన్. అలా వెళ్లిపోయే ఆటగాళ్లను రీప్లేస్​మెంట్ చేయలేక తాము తంటాలు పడుతున్నామని.. ఇలాంటి ప్లేయర్లపై నిషేధం విధించాలని ఆమె డిమాండ్ చేశారని సమాచారం. కావ్య డిమాండ్లకు బోర్డు దిగొచ్చిందట. ఇక మీదట ఆక్షన్​లో ఎంపికైన ఆటగాళ్లు.. టీమ్​ను వదిలేసి వెళ్లిపోతే రెండేళ్లు బ్యాన్ విధించాలని బీసీసీఐ డిసైడ్ అయిందని వినికిడి.

ఆక్షన్​లో అమ్ముడుబోయిన ఆటగాళ్లు ఇక మీదట తప్పనిసరిగా ఆయా టీమ్స్​లో ఆడేలా బీసీసీఐ నడుం బిగించిందని సమాచారం. ఇలా ఫ్రాంచైజీలను ఇబ్బంది పెట్టే ఆటగాళ్ల మీద 2 ఏళ్ల పాటు బ్యాన్ వేయాలని డిసైడ్ అయిందట. అయితే నిజంగానే ప్లేయర్లకు ఇంజ్యురీ అయినా లేదా ఫ్యామిలీ కమిట్​మెంట్స్ ఉన్నా, ఇంటర్నేషనల్ సిరీస్​లు ఆడాలని వాళ్ల బోర్డుల నుంచి పిలుపు వచ్చినా తామే పంపిస్తామని.. కానీ ఏ కారణం లేకపోయినా డుమ్మా కొట్టాలని చూస్తే వేటు వేయాల్సిందేనని బోర్డు నిర్ణయించిందట. ఈ సమస్యని బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లడమే గాక ధైర్యంగా పోరాడినందుకు ఎస్​ఆర్​హెచ్​ కో-ఓనర్ కావ్యా మారన్​ను అందరూ మెచ్చుకుంటున్నారు. అసలు క్రెడిట్ ఆమెకే ఇవ్వాలని.. ఎలాంటి భయం లేకుండా బోర్డుతో ఆమె ఫైట్ చేశారని అంటున్నారు ఎక్స్​పర్ట్స్. అయితే ఫారెన్ ప్లేయర్ల బ్యాన్​పై బీసీసీఐ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు ఏదీ చెప్పలేం. మరి.. ఏదో ఒక సాకుతో టీమ్స్​ను వదిలి వెళ్లే ఆటగాళ్లపై బ్యాన్ విధించాలనే నిర్ణయం మంచిదేనా? మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.