iDreamPost
android-app
ios-app

IPLపై BCCI సంచలన నిర్ణయం! ఇక రోహిత్ రూ.30 కోట్లు దాటే ఛాన్స్!

  • Published Jul 25, 2024 | 6:47 PM Updated Updated Jul 25, 2024 | 6:54 PM

ఐపీఎల్ విషయంలో భారత క్రికెట్ బోర్డు తీసుకున్న సంచలన నిర్ణయం రోహిత్ శర్మకు బిగ్ ప్లస్ కానుందని తెలుస్తోంది. దెబ్బకు హిట్​మ్యాన్​ రూ.30 కోట్లను దాటడం ఖాయంగా కనిపిస్తోంది.

ఐపీఎల్ విషయంలో భారత క్రికెట్ బోర్డు తీసుకున్న సంచలన నిర్ణయం రోహిత్ శర్మకు బిగ్ ప్లస్ కానుందని తెలుస్తోంది. దెబ్బకు హిట్​మ్యాన్​ రూ.30 కోట్లను దాటడం ఖాయంగా కనిపిస్తోంది.

  • Published Jul 25, 2024 | 6:47 PMUpdated Jul 25, 2024 | 6:54 PM
IPLపై BCCI సంచలన నిర్ణయం! ఇక రోహిత్ రూ.30 కోట్లు దాటే ఛాన్స్!

భారత క్రికెట్​లో ఇప్పుడు ఎక్కువగా ఐపీఎల్ గురించే డిస్కషన్స్ నడుస్తున్నాయి. నెక్స్ట్ సీజన్​కు ఇంకా చాలా టైమ్ ఉంది. మెగా ఆక్షన్ కూడా ఈ ఏడాది ఆఖర్లో జరుగుతుంది. కానీ త్వరలో శాలరీ క్యాప్​తో పాటు రిటెన్షన్స్ క్లారిటీ రానుంది. ఈ విషయాలను తేల్చేందుకు అన్ని ఫ్రాంచైజీలతో బీసీసీఐ ఈ నెలాఖరులో సమావేశం కానుంది. దీంతో అందరూ ఇటు వైపు ఫోకస్ చేస్తున్నారు. మెగా ఆక్షన్​కు ముందే పలు ఐపీఎల్ జట్లు తమ కోచ్​లను మార్చడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ క్యాపిటల్స్ తమ కోచ్ రికీ పాంటింగ్​ను సాగనంపింది. గుజరాత్ టైటాన్స్​ను ఆశిష్ నెహ్రా వీడటం దాదాపుగా ఖాయంగా మారింది. పంజాబ్ కింగ్స్​కు కూడా కొత్త కోచ్ వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి.

కోచ్​ల మార్పుతో పాటు ఆటగాళ్ల బదిలీలు, ఏ స్టార్ ఏ టీమ్​కు మారుతున్నాడనే అంశాల మీద కూడా గట్టిగా డిస్కషన్ నడుస్తోంది. ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ చెన్నై సూపర్ కింగ్స్​కు వెళ్తాడని వినిపిస్తోంది. ఇవన్నీ ఒకెత్తయితే ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు సంబంధించిన ఓ విషయం బాగా హైలైట్ అవుతోంది. బీసీసీఐ సంచలన నిర్ణయంతో హిట్​మ్యాన్ పంట పండటం ఖాయమనే టాక్ నడుస్తోంది. ఈసారి మెగా ఆక్షన్​లో రోహిత్ ఏకంగా రూ.30 కోట్ల ధరకు అమ్ముడుబోవడం గ్యారెంటీగా కనిపిస్తోంది. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్​కు సంబంధించి టీమ్స్ శాలరీ క్యాప్​ను రూ.90 కోట్ల నుంచి ఏకంగా రూ.140 కోట్ల వరకు పెంచుతారని క్రికెట్ వర్గాల సమాచారం. అదే జరిగితే రోహిత్ ఈజీగా 30 కోట్ల మార్క్​ను టచ్ చేయడం పక్కా అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ముంబై ఇండియన్స్ నుంచి రోహిత్​తో పాటు సూర్యకుమార్ యాదవ్, జస్​ప్రీత్ బుమ్రా బయటకు రావడం ఖాయమని ఊహాగానాలు వస్తున్నాయి. అటు పంత్​ను డీసీ రిలీజ్ చేయడం గ్యారెంటీ అని అంటున్నారు. బీసీసీఐ శాలరీ పర్స్​ను పెంచితే ఈ స్టార్లంతా వేలంలో కనీసం రూ.30 నుంచి రూ.35 కోట్ల ధర పలికే ఛాన్స్ ఉందని ఎక్స్​పర్ట్స్ అంటున్నారు. రోహిత్ కోసం భారీ డిమాండ్ ఉన్న నేపథ్యంలో అతడు మరింత ఎక్కువ ధరకు అమ్ముడుపోయినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. శాలరీ క్యాప్​ పెరిగితే రోహిత్​తో పాటు పంత్, బుమ్రా లాంటి స్టార్ల కోసం వేలంలో ఫ్రాంచైజీలు ఎగబడి ఖర్చు చేస్తాయి. కాబట్టి ఈసారి ఆక్షన్​లో పాత రికార్డులన్నీ బద్దలవడం పక్కా అని నిఫుణులు చెబుతున్నారు. మరి.. మెగా ఆక్షన్​లో రోహిత్ ధర రూ.30 కోట్లు దాటుతుందని మీరు భావిస్తే కామెంట్ చేయండి.