iDreamPost
android-app
ios-app

Gautam Gambhir: లంకతో T20 సిరీస్.. ఫస్ట్ అసైన్​మెంట్​లో గంభీర్ సాధించాల్సినవి ఇవే..!

  • Published Jul 25, 2024 | 5:59 PMUpdated Jul 25, 2024 | 5:59 PM

టీమిండియా కొత్త కోచ్ గౌతం గంభీర్ ఫస్ట్ అసైన్​మెంట్​కు రెడీ అవుతున్నాడు. లంక సిరీస్​తో కోచ్​గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు గౌతీ.

టీమిండియా కొత్త కోచ్ గౌతం గంభీర్ ఫస్ట్ అసైన్​మెంట్​కు రెడీ అవుతున్నాడు. లంక సిరీస్​తో కోచ్​గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు గౌతీ.

  • Published Jul 25, 2024 | 5:59 PMUpdated Jul 25, 2024 | 5:59 PM
Gautam Gambhir: లంకతో T20 సిరీస్.. ఫస్ట్ అసైన్​మెంట్​లో గంభీర్ సాధించాల్సినవి ఇవే..!

టీమిండియా కొత్త కోచ్ గంభీర్ ఫస్ట్ అసైన్​మెంట్​కు సిద్ధమవుతున్నాడు. శ్రీలంకతో టీ20 సిరీస్​కు అతడు రెడీ అవుతున్నాడు. లెజెండ్ రాహుల్ ద్రవిడ్ నుంచి కోచింగ్ బాధ్యతలు స్వీకరించిన గౌతీకి ఇదే ఫస్ట్ సిరీస్ కానుంది. కుర్రాళ్లతో నిండిన జట్టును నయా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముందుండి లీడ్ చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో దారుణంగా ఆడుతోంది కాబట్టి శ్రీలంకను తక్కువ అంచనా వేయడానికి లేదు. సిరీస్ వాళ్ల సొంత గడ్డ మీద జరుగుతోంది. ఒక్క బంతిలో రిజల్ట్ మారిపోయే ఫార్మాట్ కాబట్టి లైట్ తీసుకోవడానికి లేదు. చిన్న పామును కూడా పెద్ద కర్రతో కొట్టాలనే సామెత ఉండనే ఉంది. ఈ సిరీస్​తో కోచ్ గౌతీ సాధించాల్సిన లక్ష్యాలు 5 ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఇటీవల కాలంలో టీమిండియాకు టీ20ల్లో ఎదురేలేదు. ఓటమి అనేదే లేకుండా దూసుకెళ్తోంది. పొట్టి ప్రపంచ కప్​లో వరుస విజయాలతో ఫైనల్​కు దూసుకొచ్చిన మెన్ ఇన్ బ్లూ.. టైటిల్ ఫైట్​లో సౌతాఫ్రికాను చిత్తు చేసి కప్పు సొంతం చేసుకుంది. మెగాటోర్నీకి ముందు జరిగిన ఇతర టీ20 సిరీస్​ల్లోనూ భారత్ హవా నడిచింది. కాబట్టి కొత్త కోచ్ గంభీర్ ఈ విన్నింగ్ స్ట్రీక్​ను మెయింటెయిన్ చేయాల్సి ఉంటుంది. టీమ్​లో ఎక్కువ మంది యంగ్​స్టర్స్ ఉన్నారు. కాబట్టి వాళ్లకు గెలుపు రుచి చూపిస్తే మరింత చెలరేగి ఆడతారు. ఈ సిరీస్​ను క్లీన్​స్వీప్ చేయడం గౌతీ ముందున్న మరో లక్ష్యం. వైట్​వాష్ చేస్తే ర్యాంకుల పరంగా జట్టుకు పెద్దగా ప్లస్ కాకపోయినా.. కోచ్​గా ఫస్ట్ సిరీస్​తోనే గంభీర్​పై ఉన్న ప్రెజర్ తగ్గుతుంది.

ఈ సిరీస్​ కోచ్​ గంభీర్​తో పాటు కెప్టెన్ సూర్యకు కూడా సవాల్ విసురుతోంది. పర్మినెంట్ కెప్టెన్సీ పోస్ట్ దక్కింది కాబట్టి అతడిపై అంచనాలు, ఒత్తిడి భారీగా ఉంటాయి. అందుకే ఇతర ప్లేయర్లతో పాటు మిస్టర్ 360ని బ్యాకప్ చేస్తూ అండగా నిలవాలి గంభీర్. అతడి మీద ఉన్న ప్రెజర్​ను తాను తీసుకోవడం బెటర్. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, జస్​ప్రీత్ బుమ్రా లాంటి సీనియర్లు లేకుండా దిగుతున్నందున టీమ్ కాంబినేషన్​ను పర్ఫెక్ట్​గా సెట్ చేయడం కొత్త కోచ్ ముందున్న మరో టార్గెట్. అందుబాటులో ఉన్న వనరులతో సరైన బ్యాలెన్స్​తో జట్టును బరిలోకి దింపాలి. అదే సమయంలో కొత్త కుర్రాళ్లకు ఛాన్సులు ఇస్తూ బెంచ్ స్ట్రెంగ్త్​ను మరింత బలోపేతం చేసుకోవడంపై గంభీర్ ఫోకస్ పెట్టాలి. ఇవన్నీ నెరవేరితే అతడికి కోచ్​గా మైలేజ్ పెరగడమే గాక భారత క్రికెట్​కు కూడా ఎంతో లాభం చేకూరుతుందని ఎక్స్​పర్ట్స్ సూచిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి