Nidhan
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు గుడ్ న్యూస్. కింగ్ కోహ్లీ కోసం ఎదురు చూస్తున్న వారు ఇక రిలాక్స్ అయిపోయిండి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు గుడ్ న్యూస్. కింగ్ కోహ్లీ కోసం ఎదురు చూస్తున్న వారు ఇక రిలాక్స్ అయిపోయిండి.
Nidhan
ఆ టీమ్ ప్లేయర్లు, ఈ టీమ్ ప్లేయర్లు .. ఇలా అందరూ వచ్చేశారు. వాళ్లు అభిమానించే జట్టులోని ఆటగాళ్లు కూడా ఇప్పటికే టీమ్‌తో కలిశారు. కానీ తాము ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే, ఇష్టపడే, ఆరాధ్య క్రికెటర్ మాత్రం ఎంతకీ రావడం లేదు. కొడుకు పుట్టడంతో లండన్‌లో ఉన్న ఆ స్టార్ ఎప్పుడు టీమ్‌తో జాయిన్ అవుతాడా? అని అభిమానులు ఎదురు చూడసాగారు. ఎంతకీ రాకపోవడంతో ఆలస్యం అవడంతో అతడు సీజన్‌లోని ఆరంభ మ్యాచులకు దూరమవుతాడంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. దీంతో వారు మరింత ఆందోళన చెందారు. అయితే ఫ్యాన్స్ ఎదురు చూపులకు ఫుల్స్టాప్ పెట్టాడా క్రికెటర్. మనం మాట్లాడుకుంటోంది మరెవరి గురించో కాదు.. ఆర్సీబీ అభిమానులు, వాళ్ల ఆరాధ్య క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించే. అవును, ఎట్టకేలకు ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. కోహ్లీ దాదాపు రెండు నెలల తర్వాత స్వదేశంలోకి అడుగుపెట్టాడు.
సతీమణి అనుష్క శర్మ డెలివరీ కారణంగా ఇన్నాళ్లూ లండన్‌లో ఉండిపోయిన విరాట్ బెంగళూరుకు చేరుకున్నాడు. ఈ మేరకు కోహ్లీ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తున్న ఫొటోలను ఐపీఎల్ బ్రాడ్‌కాస్టర్స్ ట్విట్టర్లో షేర్ చేశాయి. తాజాగా ఆర్సీబీ క్యాంపులో చేరాడు కింగ్. ఇందులో భాగంగా అతడు ఫీల్డింగ్ చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ నెల 19వ తేదీన చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఆర్సీబీ అన్‌బాక్స్ ఈవెంట్లో విరాట్ కూడా పాల్గొననున్నాడు. అన్ని పుకార్లకు ఫుల్స్టాప్ పెడుతూ కోహ్లీ బెంగళూరుకు చేరుకోవడం, ప్రాక్టీస్‌లో బిజీ అయిపోవడంతో అతడి అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. కోహ్లీ ఈజ్ బ్యాక్ అని అంటున్నారు. ఇక ప్రత్యర్థులకు దబిడిదిబిడేనని కామెంట్స్ చేస్తున్నారు.
ఇక, ఈ సీజన్లో బెంగళూరు టీమ్ కాంబినేషన్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. బౌలింగ్ పరంగా వీక్‌గా కనిపిస్తున్నా బ్యాటింగ్ మాత్రం దుర్బేధ్యంగా ఉంది. టీమ్‌లో మంచి బ్యాటర్లు ఉన్నారు. అయితే ఎలాగైనా ట్రోఫీ నెగ్గాలన్న కసిలో ఉన్న ఆర్సీబీ మేనేజ్మెంట్.. ఏకంగా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ పొజిషన్‌ను మార్చేసిందని వినికిడి. గత సీజన్లో కెప్టెన్ డుప్లెసిస్‌తో కలసి ఓపెనింగ్ చేశాడు కింగ్. కానీ ఈసారి మాత్రం అతడు వన్ డౌన్లో బ్యాటింగ్ చేస్తాడని క్రికెట్ వర్గాల సమాచారం. కోహ్లీ ప్లేసులో స్టార్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ ఓపెనర్‌గా దిగుతాడని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఆర్సీబీ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. కాబట్టి కోహ్లీ బ్యాటింగ్ పొజిషన్ ఏంటనేది చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే సీజన్ ఆరంభ మ్యాచ్‌లో తేలనుంది. మరి.. కోహ్లీని తిరిగి యాక్షన్‌లో చూసేందుకు మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి.
Virat Kohli at the Chinnaswamy Stadium.
– The GOAT has started the preparations. 🐐pic.twitter.com/0ndx4EwlMF
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 18, 2024
Daddy’s Home and he is ready to reign again! 👑
Virat Kohli checked in to Namma Bengaluru, and we can’t keep calm. Happy #Homecoming, @imVkohli! ❤🔥🏡#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 pic.twitter.com/KLWKz788wx
— Royal Challengers Bangalore (@RCBTweets) March 18, 2024