iDreamPost
android-app
ios-app

ఈ IPLలో టాప్‌ 5 బౌలర్లు! పేర్లు చూస్తే బ్యాటర్లు వణకాల్సిందే!

  • Published Mar 20, 2024 | 3:38 PMUpdated Mar 20, 2024 | 3:38 PM

ఈసారి ఐపీఎల్​లో తమ బౌలింగ్​తో అపోజిషన్ టీమ్స్​ను షేక్ చేసేందుకు స్టార్ బౌలర్లు రెడీ అవుతున్నారు. వాళ్ల పేర్లు చెబితే బ్యాటర్లు వణకాల్సిందే. మరి.. ఆ టాప్-5 డేంజరస్ బౌలర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం..

ఈసారి ఐపీఎల్​లో తమ బౌలింగ్​తో అపోజిషన్ టీమ్స్​ను షేక్ చేసేందుకు స్టార్ బౌలర్లు రెడీ అవుతున్నారు. వాళ్ల పేర్లు చెబితే బ్యాటర్లు వణకాల్సిందే. మరి.. ఆ టాప్-5 డేంజరస్ బౌలర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 20, 2024 | 3:38 PMUpdated Mar 20, 2024 | 3:38 PM
ఈ IPLలో టాప్‌ 5 బౌలర్లు! పేర్లు చూస్తే బ్యాటర్లు వణకాల్సిందే!

క్రికెట్ అంటే అందరూ బ్యాటర్స్ గేమ్ అనుకుంటారు. కానీ బ్యాటర్లతో పాటు బౌలర్లకు కూడా ఇక్కడ అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. ఫేమ్, క్రేజ్ దృష్ట్యా బ్యాటర్లు ముందంజలో ఉండొచ్చు. కానీ మ్యాచులు గెలిపించాలంటే బ్యాటింగ్ యూనిట్​తో పాటు బౌలింగ్ యూనిట్ కూడా అంతే ముఖ్యం. అందులోనూ టీ20ల్లో ఫ్లాట్ పిచెస్​ మీద వికెట్లు పడగొట్టాలంటే నిఖార్సయిన పేసర్లు, దమ్మున్న స్పిన్నర్లు కావాలి. ఐపీఎల్ మినీ ఆక్షన్​లో బౌలర్ల వేల్యూ ఏంటో అందరమూ చూశాం. స్పీడ్​స్టర్లు ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ అందరికంటే ఎక్కువ ధరకు అమ్ముడుబోయారు. ఈ నేపథ్యంలో ఈసారి క్యాష్ రిచ్ లీగ్​లో టాప్-5 డేంజరస్ బౌలర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం..

జస్​ప్రీత్ బుమ్రా
టీమిండియా పేసుగుర్రం బుమ్రాకు ఐపీఎల్​లో అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. క్యాష్ రిచ్ లీగ్​లో ఫస్ట్ నుంచి ముంబైకి ఆడుతున్నాడీ పేసర్. ఆ టీమ్ తరఫున అద్భుతంగా రాణించడం వల్లే భారత జట్టుకు ఎంపికయ్యాడు. అలాంటి బుమ్రా ఇప్పుడు సూపర్ ఫామ్​లో ఉన్నాడు. గతేడాది స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్ నుంచి ఇటీవల ముగిసిన ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ వరకు ఫార్మాట్​తో సంబంధం లేకుండా డేంజరస్​గా బౌలింగ్ చేస్తున్నాడతను. ఈ ముంబై పేసర్ ఫామ్, ఫిట్​నెస్, వేరియేషన్స్, పేస్, ఎక్స్​పీరియెన్స్​ను బట్టి ఈసారి ప్రత్యర్థి బ్యాటర్లకు దబిడిదిబిడేనని చెప్పొచ్చు.

ట్రెంట్ బౌల్ట్
ఈసారి ఐపీఎల్​లో అత్యంత ప్రమాదకర బౌలర్ల జాబితాలో రెండో ప్లేసులో ఉన్నాడు ట్రెంట్ బౌల్ట్. ఓపెనింగ్ ఓవర్లు వేయడంలో స్పెషలిస్ట్​గా ఉన్న బౌల్ట్ మీద రాజస్థాన్ రాయల్స్ గంపెడాశలు పెట్టుకుంది. ఎంతో అనుభవం ఉన్న బౌల్ట్ క్వాలిటీ పేస్​తో బ్యాటర్లను కట్టిపడేస్తాడు. ఒకవేళ పిచ్​లో కాస్త మూమెంట్ ఉన్నా స్వింగ్​తో ప్రత్యర్థి బ్యాటింగ్ యూనిట్​ను కకావికలం చేయగలడు. అయితే డెత్ ఓవర్లలో అతడు ఎలా బౌలింగ్ చేస్తాడనేది కీలకం కానుంది.

ప్యాట్ కమిన్స్
ఐపీఎల్ నయా సీజన్​లో మోస్ట్ డేంజరస్ బౌలర్లలో సన్​రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా ఉన్నాడు. కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్​, మంచి పేస్​తో బౌలింగ్ చేసే కమిన్స్.. బ్యాటర్ల వీక్​నెస్ మీద దెబ్బకొట్టడంలో ఆరితేరాడు. పిచ్​ను బట్టి తన లెంగ్త్ అడ్జస్ట్ చేసుకుంటూ బ్యాటర్లను తప్పు చేసేలా ఉసిగొల్పడంలో అతడు ఎక్స్​పర్ట్. ఎస్​ఆర్​హెచ్​ కెప్టెన్​ కూడా అయినా కమిన్స్ రాణించడం మీదే జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.

మిచెల్ స్టార్క్
బౌలర్స్ టు వాచ్ లిస్టులో మరో ఆసీస్ పేసర్ ఉన్నాడు. అతడే మిచెల్ స్టార్క్. కోల్​కతా నైట్ రైడర్స్ తరఫున బరిలోకి దిగనున్న స్టార్క్ మీద ఫ్రాంచైజీ భారీ ఎక్స్​పెక్టేషన్స్ పెట్టుకుంది. పేస్, స్వింగ్​తో బ్యాటర్లను కట్టిపడేసే స్టార్క్.. భారత పిచ్​లపై మ్యాజిక్ చేయగలడా అనేది చూడాలి. ఒకవేళ అతడు రాణిస్తే గనుక కేకేఆర్​ను ఆపడం కష్టమే. తన మీద ఫ్రాంచైజీ పెట్టిన ధరకు స్టార్క్ ఎంతమేరకు న్యాయం చేస్తాడో చూడాలి.

కుల్దీప్ యాదవ్
టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఈసారి డేంజరస్​గా కనిపిస్తున్నాడు. గత 15 నెలల్లో ఇంటర్నేషనల్ క్రికెట్​లో అతడు తన బౌలింగ్​తో సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. వన్డే వరల్డ్ కప్​-2023లో టాప్ బ్యాటర్లకు కూడా ఓ రేంజ్​లో పోయించాడు కుల్దీప్. ఇటీవల జరిగిన ఇంగ్లండ్ టెస్టు సిరీస్​లో కూడా తన స్పిన్ మ్యాజిక్​తో అందర్నీ ఆకట్టుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్​కు ఆడుతున్న కుల్దీప్.. ఈసారి ఎన్ని సంచనాలు సృష్టిస్తాడో చూడాలి. అతడు సక్సెస్ అయితే ఢిల్లీ టీమ్​కు బిగ్ ప్లస్ అవుతుంది. చైనామన్ బౌలర్ అయిన కుల్దీప్​ను ఆడాలంటే బ్యాటర్లకు శక్తికి మించిన పని అని చెప్పక తప్పదు. మరి.. ఈ ఐదుగురు ప్రమాదకర బౌలర్లను ఐపీఎల్​లో చూసేందుకు మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: ఈసారి IPLలో ఈ అన్​క్యాప్డ్ ప్లేయర్ల మీదే ఫోకస్.. టీమిండియాకు ఆడే సత్తా ఉన్నోళ్లు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి