iDreamPost

ఈసారి IPLలో ఈ అన్​క్యాప్డ్ ప్లేయర్ల మీదే ఫోకస్.. టీమిండియాకు ఆడే సత్తా ఉన్నోళ్లు!

  • Published Mar 20, 2024 | 2:44 PMUpdated Mar 20, 2024 | 2:44 PM

ఐపీఎల్​లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ప్లేయర్లతో పాటు శుబ్​మన్ గిల్, యశస్వి జైస్వాల్ లాంటి యంగ్​స్టర్స్​ ఆటను చూసేందుకు అందరూ రెడీ అయిపోయారు. అదే తరుణంలో పలువురు అన్​క్యాప్డ్ ప్లేయర్లు కూడా అందరి అటెన్షన్​ తీసుకుంటున్నారు. వాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్​లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ప్లేయర్లతో పాటు శుబ్​మన్ గిల్, యశస్వి జైస్వాల్ లాంటి యంగ్​స్టర్స్​ ఆటను చూసేందుకు అందరూ రెడీ అయిపోయారు. అదే తరుణంలో పలువురు అన్​క్యాప్డ్ ప్లేయర్లు కూడా అందరి అటెన్షన్​ తీసుకుంటున్నారు. వాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 20, 2024 | 2:44 PMUpdated Mar 20, 2024 | 2:44 PM
ఈసారి IPLలో ఈ అన్​క్యాప్డ్ ప్లేయర్ల మీదే ఫోకస్.. టీమిండియాకు ఆడే సత్తా ఉన్నోళ్లు!

ఐపీఎల్-2024కు అంతా రెడీ అయిపోయింది. మరో రెండ్రోజుల్లో క్యాష్ రిచ్ లీగ్ నయా సీజన్ మొదలవనుంది. ఆడియెన్స్​ను థ్రిల్ చేయడానికి ప్లేయర్లు అందరూ రెడీ అవుతున్నారు. తమ అద్వితీయ ఆటతీరుతో ప్రేక్షకుల మనసు దోచుకుందామని చూస్తున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి సీనియర్లతో పాటు శుబ్​మన్ గిల్, యశస్వి జైస్వాల్ లాంటి యంగ్​స్టర్స్ వరకు.. అలాగే గ్లెన్ మాక్స్​వెల్, ప్యాట్ కమిన్స్ లాంటి ఫారెన్ క్రికెటర్స్ దాకా అందరూ ఈ సీజన్​పై తమ మార్క్​ వేయాలని చూస్తున్నారు. అభిమానులు కూడా వీళ్ల గేమ్ చూసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఇంటర్నేషనల్ స్టార్స్ ఎప్పుడైనా సత్తా చూపిస్తారు. కానీ ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న అన్​క్యాప్డ్ ప్లేయర్లు ఎలా ఆడతారనేది కీలకంగా మారింది. ఈసారి నలుగురు డొమెస్టిక్ క్రికెటర్స్​ అందరి ఫోకస్​ను తమ వైపునకు తిప్పుకుంటున్నారు.

ఐపీఎల్ మినీ ఆక్షన్​లో భారీ మొత్తాలు దక్కించుకొని రికార్డులు కొల్లగొట్టారా నలుగురు కుర్రాళ్లు. వాళ్లకు ఫైనల్ ఎలెవన్​లో ఛాన్స్ వస్తుందో? రాదో? చెప్పలేం. కానీ వాళ్ల ఫామ్​ను బట్టి అవకాశం వస్తే మాత్రం ఇరగదీయడం పక్కా. ఆ నలుగురు ప్లేయర్లు ఎవరు? వాళ్ల మీద ఫ్రాంచైజీలు అంత మొత్తంలో డబ్బులు ఎందుకు వెదజల్లాయో ఇప్పుడు తెలుసుకుందాం..

సమీర్ రిజ్వీ
మినీ ఆక్షన్​లో ఓ డొమెస్టిక్ ప్లేయర్ కోసం ఏకంగా రూ.8.40 కోట్లు ఖర్చు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. 7 ఫస్ట్ క్లాస్ మ్యాచులు మాత్రమే ఆడిన అతడిలో టాలెంట్​కు ఫిదా అయిన సీఎస్​కే మేనేజ్​మెంట్ ఈ రిస్క్ చేసిందని తెలుస్తోంది. ఆ ప్లేయర్ మరెవరో కాదు.. సమీర్ రిజ్వీ. సీకే నాయుడు ట్రోపీలో ఉత్తర్​ప్రదేశ్ తరఫున సెంచరీ బాదిన రిజ్వీ.. అంకుముందు యూపీ టీ20 లీగ్​లో మరో 2 సెంచరీలు కొట్టాడు. రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు ప్లేసులో ఈ 20 ఏళ్ల కుర్ర బ్యాటర్​ను ఆడించాలనేది చెన్నై ప్లానింగ్​గా కనిపిస్తోంది.

షారుక్ ఖాన్
గుజరాత్ టైటాన్స్​ తరఫున బరిలోకి దిగుతున్న షారుక్ ఖాన్​పై చాలా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఐపీఎల్​లో ఆడిన అన్​క్యాప్డ్ ప్లేయర్ ఇతను. 2021 నుంచి 2023 వరకు పంజాబ్ కింగ్స్​కు షారుక్ ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటిదాకా 33 మ్యాచులు ఆడిన అతడు 426 రన్స్ చేశాడు. మినీ వేలానికి ముందు అతడ్ని పంజాబ్ వదులుకుంది. ఆక్షన్​లో రూ.7.60 కోట్లు పెట్టి గుజరాత్ షారుక్​ను దక్కించుకుంది. తమిళనాడు ప్రీమియర్ లీగ్​లో అదరగొట్టడం, బౌలింగ్ చేయగలగడంతో అతడ్ని భారీ ధరకు సొంతం చేసుకుంది. టీఎన్​పీఎల్​లో ఏకంగా 17 వికెట్లు పడగొట్టాడతను. బిగ్ షాట్స్ కొట్టడంలో దిట్టగా పేరు తెచ్చుకున్నాడు.

కుమార్ కుశాగ్ర
ఈసారి ఐపీఎల్​లో అందరి అటెన్షన్ తీసుకుంటున్న మరో ప్లేయర్ కుమార్ కుశాగ్ర. ఝార్ఖండ్​కు చెందిన ఈ యంగ్ బ్యాటర్.. 19 ఏళ్లకే రంజీల్లో డబుల్ సెంచరీ బాదాడు. 19 ఫస్ట్​క్లాస్ మ్యాచుల్లో 1,245 రన్స్ చేశాడు. ఇతడ్ని రూ.7.20 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. వికెట్ కీపర్, బ్యాట్స్​మన్ అయిన కుశాగ్ర.. గత సీజన్​లో నాలుగు మ్యాచులే ఆడి 33 రన్స్ చేశాడు. ఈసారి ఛాన్స్ వస్తే సత్తా చాటేందుకు అతడు సై అంటున్నాడు.

శుభమ్ దూబె
టాలెంట్ ఉన్న యంగ్​స్టర్స్​ను పసిగట్టి టీమ్​లో చేర్చడంలో అందరికంటే రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ ముందు వరుసలో ఉంటుంది. పెద్దగా ఫస్ట్ క్లాస్ ఎక్స్​పీరియెన్స్ లేని ఓ యువ బ్యాటర్​ను ఏకంగా రూ.5.80 కోట్లు పెట్టి మరీ దక్కించుకుంది రాజస్థాన్. ఆ ప్లేయర్ మరెవరో కాదు.. శుభమ్ దూబె. 3 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడి 75 పరుగులు చేసిన శుబ్​మ్​లోని ప్రతిభను రాజస్థాన్ గుర్తించింది. డొమెస్టిక్ క్రికెట్​లో అదరగొడుతున్న ఈ బ్యాటర్.. 20 మ్యాచుల్లో 485 రన్స్ చేశాడు. ఇందులో ఏకంగా 30 సిక్సులు, 26 ఫోర్లు ఉన్నాయి. బిగ్ షాట్స్ కొట్టే సామర్థ్యమే అతడ్ని ఈ స్థాయికి చేర్చింది.

రాబిన్ మింజ్
ఝార్ఖండ్​ నుంచి వచ్చిన మరో ఆణిముత్యమే రాబిన్ మింజ్. ఇతడ్ని గుజరాత్ టైటాన్స్ రూ.3.60 కోట్లు వెచ్చించి దక్కించుకుంది. అయితే కొన్ని రోజుల కింద రోడ్డు ప్రమాదానికి గురైన మింజ్.. ఈ సీజన్​లో ఆడే ఛాన్సులు తక్కువ. రాబిన్ తండ్రి మాత్రం తన కొడుకు త్వరలో కమ్​బ్యాక్ ఇస్తాడని అంటున్నారు. ఒకవేళ అతడు ఆడితే మాత్రం ప్లేయర్ టు వాచ్ లిస్టులో ఒకడిగా ఉంటాడు. మరి.. ఈ అన్​క్యాప్డ్ ప్లేయర్ల ఆటను చూసేందుకు మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: బంధం తెగిపోయింది.. అతనితో ఇక శత్రుత్వమే: రోహిత్‌ శర్మ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి