iDreamPost
android-app
ios-app

ఎస్​ఏ20 లీగ్​లో వరుసగా 2 టైటిల్స్.. అయినా మార్​క్రమ్​ బదులు కమిన్స్​కు కెప్టెన్సీ!

  • Published Mar 04, 2024 | 4:33 PM Updated Updated Mar 04, 2024 | 4:33 PM

సన్​రైజర్స్ హైదరాబాద్ అనుకున్నదే చేసింది. ఐపీఎల్-2024కు ముందు టీమ్ కెప్టెన్​ను మార్చింది. అయితే దీని వెనుక పలు కారణాలు కనిపిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

సన్​రైజర్స్ హైదరాబాద్ అనుకున్నదే చేసింది. ఐపీఎల్-2024కు ముందు టీమ్ కెప్టెన్​ను మార్చింది. అయితే దీని వెనుక పలు కారణాలు కనిపిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 04, 2024 | 4:33 PMUpdated Mar 04, 2024 | 4:33 PM
ఎస్​ఏ20 లీగ్​లో వరుసగా 2 టైటిల్స్.. అయినా మార్​క్రమ్​ బదులు కమిన్స్​కు కెప్టెన్సీ!

ఎయిడెన్ మార్​క్రమ్​ గురించి పరిచయం అక్కర్లేదు. సౌతాఫ్రికా తరఫున ఇంటర్నేషనల్ క్రికెట్​లో అదరగొడుతున్న ఈ స్టార్ బ్యాటర్.. లీగ్స్​లోనూ దుమ్మురేపుతున్నాడు. ఐపీఎల్​లో ఎస్​ఆర్​హెచ్​కు ఆడుతున్న మార్​క్రమ్.. స్వదేశంలో జరిగే ఎస్​ఏ20లో సన్​రైజర్స్ ఈస్టర్న్ కేప్​ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్​లో బాగా ఆడుతుండటంతో అతడ్ని టీమ్​కు కెప్టెన్​గా నియమించింది ఎస్​ఆర్​హెచ్​ యాజమాన్యం. అటు ఎస్​ఏ20లోనూ ఈస్టర్న్ కేప్​ నాయకత్వ బాధ్యతల్ని అతడికే అప్పజెప్పింది. ఎస్​ఏ20 లీగ్​లో సన్​రైజర్స్​ను వరుసగా రెండుసార్లు ఛాంపియన్​గా నిలిపాడు మార్​క్రమ్. అయినా ఐపీఎల్-2024కు ముందు అతడికి షాక్ ఇచ్చింది ఎస్​ఆర్​హెచ్. ​మార్​క్రమ్​ను తీసేసి రూ.20.5 కోట్లు పెట్టి కొన్న పాట్ కమిన్స్​ను కొత్త కెప్టెన్​గా నియమించింది. ఈ నేపథ్యంలో అసలు సన్​రైజర్స్ హైదరాబాద్ జట్టు సారథ్య మార్పునకు గల 5 కారణాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం..

1. మార్​క్రమ్ ఫెయిల్యూర్
ఇంటర్నేషనల్ క్రికెట్​లో దుమ్మురేపుతుండటంతో గతేడాది టీమ్​కు కెప్టెన్​గా ఎయిడెన్ మార్​క్రమ్​ను నియమించింది సన్​రైజర్స్. కానీ అతడు దారుణంగా ఫెయిలయ్యాడు. అటు బ్యాటర్​గానే గాక ఇటు సారథిగానూ జట్టును ముందుండి లీడ్ చేయడంలో విఫలమయ్యాడు. ఐపీఎల్-2023లో మార్​క్రమ్ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. టీమ్​ కూడా వరుస పరాజయాలతో పాయింట్స్ టేబుల్​లో ఆఖరి స్థానంలో నిలిచింది.

2. పసలేని సారథ్యం
గత ఐపీఎల్​లో బ్యాట్​తో ఫెయిలయ్యాడు సరే.. కెప్టెన్​గా ఆకట్టుకున్నాడా అంటే అందులోనూ మార్​క్రమ్ విఫలమయ్యాడు. టీమ్ కాంబినేషన్ విషయంలో క్లారిటీ లేకపోవడం, పదే పదే అనవసర మార్పులు చేయడం జట్టు లయను దెబ్బతీసింది. ఆటగాళ్లపై భరోసా ఉంచి రాణిస్తారనే నమ్మకాన్ని కల్పించలేకపోయాడు. తాను బాగా బ్యాటింగ్ చేసి ఇతరుల్లో రాణించాలనే స్ఫూర్తిని నింపుతాడనుకుంటే అందులోనూ విఫలమయ్యాడు. టీమ్​లోని ప్లేయర్లు అందర్నీ ఒక్కతాటి పైకి తీసుకొచ్చి జట్టులా ఆడించలేకపోయాడు. తమ స్థానాలకు ఢోకా లేదనే నమ్మకాన్ని ఆటగాళ్లలో కల్పించలేకపోయాడు.

3. కమిన్స్ సక్సెస్
ఇంటర్నేషనల్ క్రికెట్​లో ఓ బౌలర్​గా, కెప్టెన్​గా పాట్ కమిన్స్ సూపర్ సక్సెస్ అవుతున్నాడు. ఒక ఏడాది గ్యాప్​లో ఆస్ట్రేలియాకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్​షిప్, వన్డే వరల్డ్​ కప్​ లాంటి మెగా టైటిల్స్ అందించాడు. అందుబాటులో ఉన్న ఆప్షన్స్​ను సరిగ్గా వాడుకుంటూ టీమ్​ను విజయాల బాట పట్టించడంలో కమిన్స్ ఆరితేరాడు. దీంతో కెప్టెన్సీకి కమిన్స్​ను మించినోడు లేడని ఎస్​ఆర్​హెచ్​ యాజమాన్యం డిసైడ్ అయింది.

4. రాత మారుతుందనే ఆశ
గత కొన్నేళ్లుగా సన్​రైజర్స్ టీమ్ వైఫల్యాల బాటలో నడుస్తోంది. కప్ సంగతి అటుంచితే కనీసం ప్లేఆఫ్స్​కు కూడా చేరుకోవడం లేదు. పాయింట్స్ టేబుల్​లో అట్టడుగున నిలుస్తుండటంతో మేనేజ్​మెంట్​కు ఏం చేయాలో పాలుపోవడం లేదు. అందుకే కోచింగ్, కెప్టెన్సీ విషయంలో మార్పులు చేస్తూ పోతోంది. ఈ క్రమంలోనే రూ.20.5 కోట్ల భారీ ధర పెట్టి కొనుక్కున్న కమిన్స్​కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. అతడైనా జట్టు తలరాత మారుస్తాడని ఆశిస్తోంది.

5. నో ఆప్షన్
గత కొన్ని సీజన్లుగా అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరుస్తోంది ఎస్​ఆర్​హెచ్. ఈ సీజన్​లో కూడా చెత్తాట ఆడితే టీమ్ గ్రాఫ్ మరింత పడిపోయే ప్రమాదం ఉంది. మార్​క్రమ్ కెప్టెన్​గా విఫలమయ్యాడు. టీమ్​కు ఇంకో ఆప్షన్ లేకపోవడం, అందుబాటులో సారథ్యంలో సూపర్ సక్సెస్ అయిన కమిన్స్ ఉండటం, ఇంకో ఆప్షన్ కూడా లేకపోవడంతోనే ఫ్రాంచైజీ ఈ మార్పు తప్పనిసరి అని భావించినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఈ సీజన్​లోనైనా జట్టు గాడిలో పడాలి. బాగా పెర్ఫార్మ్ చేయాలి. వరుస విజయాలతో అభిమానుల్లో ఆశలు నింపాలి. అప్పుడే కమిన్స్​ను తీసుకొచ్చిన దానికి, కెప్టెన్సీ ఇచ్చిన దానికి ఫలితం ఉంటుంది. మరి.. సన్​రైజర్స్ కెప్టెన్సీ మార్పుపై మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఉలిక్కిపడ్డ ఆసీస్ క్రికెట్.. ఫిల్ హ్యూస్ తరహాలో తలకు బాల్ తగలడంతో..!