iDreamPost

ఉలిక్కిపడ్డ ఆసీస్ క్రికెట్.. ఫిల్ హ్యూస్ తరహాలో తలకు బాల్ తగలడంతో..!

  • Published Mar 04, 2024 | 9:38 AMUpdated Mar 04, 2024 | 9:38 AM

క్రికెట్ ఆస్ట్రేలియా మరోమారు ఉలిక్కిపడింది. దివంగత క్రికెటర్ ఫిల్ హ్యూస్ తరహాలో మరో ఘటన చోటుచేసుకోవడంతో షాక్​కు గురైంది.

క్రికెట్ ఆస్ట్రేలియా మరోమారు ఉలిక్కిపడింది. దివంగత క్రికెటర్ ఫిల్ హ్యూస్ తరహాలో మరో ఘటన చోటుచేసుకోవడంతో షాక్​కు గురైంది.

  • Published Mar 04, 2024 | 9:38 AMUpdated Mar 04, 2024 | 9:38 AM
ఉలిక్కిపడ్డ ఆసీస్ క్రికెట్.. ఫిల్ హ్యూస్ తరహాలో తలకు బాల్ తగలడంతో..!

క్రికెట్​ ఫీల్డ్​లో గాయాలు అనేవి చాలా కామన్. ముఖ్యంగా బ్యాటర్లకు, ఫీల్డర్లకు ఇవి సర్వసాధారణం. బాల్​ను పట్టుకోబోయి ఫీల్డర్లు కిందపడి లేదా పరస్పరం ఢీకొని గాయాలపాలైన ఘటనలు అనేకం ఉన్నాయి. ఇంక బ్యాటర్ల సంగతి తెలిసిందే. భీకరమైన పేస్ బౌలర్లు ఎదురైనప్పుడు వాళ్లు ఎంతో టెక్నిక్​తో ఆడాలి. బాల్​ ఏమాత్రం మిస్సయినా గాయాలబారిన పడే ఛాన్స్ ఉంది. ఇలా ఓ రాకాసి బౌన్సర్​కు ఒక క్రికెటర్ ప్రాణాలు కూడా కోల్పోయాడు. అతడే ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ ఫిల్ హ్యూస్. వరుసగా అద్భుతమైన ఇన్నింగ్స్​లు ఆడుతూ.. ఫ్యూచర్​ స్టార్​గా పేరు తెచ్చుకున్నాడు హ్యూస్. అయితే ఓ డొమెస్టిక్ మ్యాచ్​లో ఆడుతూ రాకాసి బౌన్సర్​ తలకు తగలడంతో క్రీజులోనే కన్నుమూశాడు. ఇది క్రికెట్ ప్రపంచం మొత్తాన్ని కుదిపేసింది. అలాంటి తరహాలో మరో కంగారూ ఆటగాడు తాజాగా గాయపడ్డాడు.

ఆస్ట్రేలియా క్రికెట్ మరోసారి ఉలిక్కిపడింది. బాల్ తగిలి 26 ఏళ్ల విల్ పుకోస్కీ అనే యంగ్ క్రికెటర్​కు ఇంజ్యురీ అయింది. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి హాని కూడా జరగలేదు. కానీ ఈ ఉదంతం దివంగత ఫిల్ హ్యూస్​ విషాదాన్ని గుర్తు చేసింది. 2014లో షెఫీల్డ్ షీల్డ్ టోర్నమెంట్​లో బాల్ తలకు బలంగా తాకడంతో ప్రాణాలు కోల్పోయాడు హ్యూస్. ఇప్పుడు అదే తరహాలో అదే టోర్నీలో ఇంచుమించు అలాంటి ఘటనే చోటుచేసుకోవడంతో క్రికెట్ ఆస్ట్రేలియా షాక్​కు గురైంది. పుకోస్కీకి తగిలిన గాయం తీవ్రమైనది కానప్పటికీ అతడు మ్యాచ్ మధ్యలోనే రిటైర్డ్ హర్ట్​గా వెనుదిరిగాడు. రిలే మెరిడిత్ వేసిన బాల్ పుకోస్కీ హెల్మెట్​కు గట్టిగా తాకింది. దీంతో అతడు క్రీజులో కుప్పకూలిపోయాడు. కొద్దిసేపు అతడు నొప్పితో విలవిల్లాడాడు.

పుకోస్కీ ఆసీస్ తరఫున ఓ టెస్ట్ మ్యాచ్ కూడా ఆడాడు. ఆ మ్యాచ్​లో అతడు రెండు ఇన్నింగ్స్​ల్లో కలిపి 72 పరుగులు చేశాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది. ఇక, ఆదివారం నాటి ఘటన విషయానికొస్తే.. షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా టాస్మానియా టైగర్స్-విక్టోరియా టీమ్స్ మధ్య మ్యాచ్​లో ఇది చోటుచేసుకుంది. ఈ మ్యాచ్​లో టాస్మానియా 57 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆ జట్టు విసిరిన 442 పరుగుల లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో విక్టోరియా జట్టు 384 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్​లో పుకోస్కీ అదే టీమ్​కు ఆడాడు. రాకాసి బౌన్సర్ విసిరిన మెరిడిత్ టాస్మానియాకు ప్రాతినిధ్యం వహించాడు. గాయం తర్వాత క్రీజు విదిలిన పుకోస్కీ మళ్లీ బ్యాటింగ్​కు రాలేదు.

ఇదీ చదవండి: గుజరాత్ టైటాన్స్​ ఆటగాడికి యాక్సిడెంట్.. టీమిండియాలోకి వస్తాడనుకుంటే..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి