Somesekhar
టీమిండియా మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ బీసీసీఐకి కీలక సూచనలు చేశాడు. అయితే అతడు చేసిన సూచనలు ఆచరణలో పెడితే బ్యాటర్లకు కష్టాలు తప్పవు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
టీమిండియా మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ బీసీసీఐకి కీలక సూచనలు చేశాడు. అయితే అతడు చేసిన సూచనలు ఆచరణలో పెడితే బ్యాటర్లకు కష్టాలు తప్పవు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
Somesekhar
‘నభూతో నభవిష్యతి’ అన్న తీరుగా సాగుతోంది ఐపీఎల్ 2024 సీజన్. కొన్ని మ్యాచ్ లు సప్పగా సాగుతున్నప్పటికీ.. వాటిని మరిపించే రేంజ్ లో ఇంకొన్ని మ్యాచ్ లు ప్రేక్షకులకు కిక్కిస్తున్నాయి. ఈ సీజన్ లో పరుగుల సునామీ సృష్టిస్తున్నారు బ్యాటర్లు. అలవోకగా 250 ప్లస్ రన్స్ ను బాదుతూ.. బౌలర్లకు పీడకలను మిగుల్చుతున్నారు. మరీ ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ సృష్టిస్తున్న విధ్వంసం ఊహలకు, మాటలకు అందనిది అంటే అతిశయోక్తికాదు. అంతలా SRH బ్యాటర్లు బౌలర్లను బెంబేలెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే ఐపీఎల్ లో కొన్ని రూల్స్ మార్చాలని కొందరు ప్లేయర్లు, మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను వెళ్లిబుచ్చుతున్నారు. తాజాగా టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ బీసీసీఐకి కీలక సూచన చేశాడు.
ఐపీఎల్ లో పరుగుల వరద పారిస్తూ.. రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ ముందుకుసాగుతున్నారు బ్యాటర్లు. బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతుంటే.. ప్రేక్షకపాత్ర వహించడం బౌలర్ల వంతుగా నిలుస్తోంది. ఈ క్రమంలోనే బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని కాపాడాల్సిన బాధ్యత బీసీసీఐపై ఉందని కీలక వ్యాఖ్యలు చేయడంతో పాటుగా పలు సూచనలు కూడా చేశాడు. “రూల్స్ ప్రకారమే క్రికెట్ బ్యాట్స్ తయ్యారు చేస్తున్నారు. దాని గురించి నేను ఏమీ మాట్లడను. అయితే బౌండరీల విషయంలో మాత్రం బీసీసీఐకి నేను ఓ సూచన చేస్తున్నాను. ప్రతి గ్రౌండ్ లో బౌండరీల దూరం పెంచాలని ఎప్పటి నుంచో చెబుతున్నాను. కానీ దానిపై మేనేజ్ మెంట్ పెద్దగా ఆసక్తిచూపించడం లేదు. ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్ ను గమనిస్తే.. సిక్సర్ కు క్యాచ్ కు తేడా తెలియడం లేదు. బిజినెస్ ప్రకటనల బోర్డులను కొద్దిగా వెనక్కి జరపాలి. కనీసం 2-3 మీటర్ల వరకు బౌండరీ పరిధిని పెంచాలి. ఇలా చేయకపోతే.. బౌలర్లకు తీవ్ర నష్టం జరగడం ఖాయం” అని చెప్పుకొచ్చాడు ఈ భారత దిగ్గజం.
క్రికెట్ మ్యాచ్ లో ఎప్పుడైనా బౌలర్లకు, బ్యాటర్లకు మధ్య భీకరయుద్ధం జరిగితేనే ఆ మ్యాచ్ ప్రేక్షకులకు కిక్కిస్తుందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఇక ప్రతి మ్యాచ్ లో బ్యాటర్లు రెచ్చిపోయి ఫోర్లు, సిక్సర్లు బాదితే ఒకానొక టైమ్ లో ప్రేక్షకులకు బోర్ కొడుతుందని తెలిపాడు. కాగా.. గత కొన్ని రోజులకు టీ20 క్రికెట్ లో బ్యాటర్ల హవానే కొనసాగుతోందని గవాస్కర్ పేర్కొన్నాడు. ప్లేయర్లకు కోచ్ లు కూడా వచ్చిన బాల్ ను వచ్చినట్లు స్టాండ్స్ లోకి పంపించమని చెబుతున్నట్లున్నారని వ్యాఖ్యానించాడు. ఆటగాళ్లు క్రీజ్ లోకి అడుగుపెట్టగానే హిట్టింగ్ ఆడితే.. తొలుత చూసేందుకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత కిక్కు రావడం లేదని ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశాడు. మరి టీమిండియా దిగ్గజం సూచించిన సూచనలు బీసీసీఐ చెవిన పెడుతుందా? లేదా? అన్నది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. అయితే బౌండరీల దూరం పెంచితే బ్యాటర్లకు కష్టాలు తప్పవని మరికొందరు పేర్కొంటున్నారు. మరి గవాస్కర్ సూచనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.