iDreamPost

ఆ కుర్రాడ్ని అలా అంటావా? డుప్లెసిస్‌పై రైనా ఆగ్రహం! రోహిత్‌ని చూసి నేర్చుకో అంటూ!

  • Published Apr 22, 2024 | 2:19 PMUpdated Apr 22, 2024 | 2:19 PM

Suresh Raina, Faf Du Plessis: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌పై టీమిండియా మాజీ క్రికెటర్‌ సురేష్‌ రైనా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ముందు నువ్వు సరిగ్గా ఆడు అంటూ.. ఎందుకు విమర్శించాడో ఇప్పుడు చూద్దం..

Suresh Raina, Faf Du Plessis: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌పై టీమిండియా మాజీ క్రికెటర్‌ సురేష్‌ రైనా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ముందు నువ్వు సరిగ్గా ఆడు అంటూ.. ఎందుకు విమర్శించాడో ఇప్పుడు చూద్దం..

  • Published Apr 22, 2024 | 2:19 PMUpdated Apr 22, 2024 | 2:19 PM
ఆ కుర్రాడ్ని అలా అంటావా? డుప్లెసిస్‌పై రైనా ఆగ్రహం! రోహిత్‌ని చూసి  నేర్చుకో అంటూ!

టీమిండియా మాజీ క్రికెటర్‌ సురేష్‌ రైనా.. ఆర్సీబీ కెప్లెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఆర్సీబీ వరుస ఓటములతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఆదివారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా ఓటమి పాలైంది. అయితే.. రైనా మాట్లాడింది మాత్రం ఆర్సీబీ వర్సెస్‌ కేకేఆర్‌ మ్యాచ్‌ గురించి కాదు. ఆర్సీబీ వర్సెస్‌ ఆర్‌ఆర్‌ మ్యాచ్‌ గురించి. ఆ మ్యాచ్‌లో కూడా ఆర్సీబీ ఓటమి పాలైంది. జైపూర్‌లోని సవాయ్‌ మాన్‌సింగ్‌ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ తొలుత బ్యాటింగ్‌ చేసి.. 183 పరుగుల భారీ స్కోర్‌ చేసినా కూడా ఆర్సీబీ ఓటమి పాలైంది. ఆ మ్యాచ్‌లో ఓటమిపై డుప్లెసిస్‌ మాట్లాడుతూ.. ఆర్సీబీలోని ఓ యువ క్రికెటర్‌ మయాంక్‌ డాగర్‌పై విమర్శలు చేస్తాడు.

ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో ప్లేవర్‌ ప్లే చివరి ఓవర్‌ వేసిన మయాంక్‌ డాగర్‌ ఏకంగా 20 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ ఓవర్‌తోనే మ్యాచ్‌ ముమెంటమ్‌ మొత్తం రాజస్థాన్‌ వైపు మారిపోయిందని, డుప్లెసిస్‌ మ్యాచ్‌ తర్వాత చెబుతాడు. ఈ విషయంపై స్పందించిన సురేష్‌ రైనా.. డుప్లెసిస్‌పై విమర్శలు గుప్పించాడు. ఓ యువ క్రికెటర్‌ గురించి ప్రెస్‌ ముందు ఈ విధంగా మాట్లాడాతావా? అతను యువ క్రికెటర్‌, నీ మాటలు అతనిపై ఎంత ప్రభావం చూపుతాయో తెలుసా? అంటూ మండిపడ్డాడు. డుప్లెసిస్‌తో కలిసి చెన్నై సూపర్‌ కింగ్స్‌లో తాను చాలా కాలం క్రికెట్‌ ఆడాడని, అతను తనకు మంచి మిత్రుడని, కానీ, డుప్లెసిస్‌ ఇలా మాట్లాడటం మాత్రం సరైంది కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

అసలు ముందు డుప్లెసిస్‌ ఫామ్‌లో లేడని, అతను ముందు బ్యాట్‌తో రాణించి ఆ తర్వాత ఓటమి భారాన్ని ఇతరులపై తోసేయాలని అన్నాడు. ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా ఉన్న రోహిత్‌ శర్మ ఇలా యువ క్రికెటర్ల గురించి మాట్లాడటం ఎప్పుడైనా చూశావా? అంటూ ప్రశ్నించాడు. అంటే ఈ విషయంలో రోహిత్‌ శర్మను చూసి డుప్లెసిస్‌ నేర్చుకోవాలని రైనా ఉద్దేశంలా ఉంది. అలాగే ఆర్సీబీ ఆటగాళ్లు ఎక్కువ పార్టీలు చేసుకుంటా ఉంటారని, అందుకే వారి పరిస్థితి ఇలా ఉందంటూ కూడా రైనా కామెంట్స్‌ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే.. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించి.. 7 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. దీంతో.. ఆ జట్టు ప్లే ఆఫ్స్‌కు దాదాపు దూరం అయినట్లే.. మరి ఈ నేపథ్యంలో సురేష్‌ రైనా లాంటి దిగ్గజ క్రికెటర్‌ డుప్లెసిస్‌ గురించి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి