iDreamPost
android-app
ios-app

ఇది కదా మ్యాచ్ అంటే.. RCB vs SRH మ్యాచ్ లో ఎన్ని రికార్డులు క్రియేట్ అయ్యాయో తెలుసా?

  • Published Apr 16, 2024 | 9:53 AM Updated Updated Apr 16, 2024 | 9:53 AM

RCB vs SRH: ఆర్సీబీ వర్సెస్ సన్ రైజర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో పలు రికార్డులు బద్దలైయ్యాయి, సరికొత్త రికార్డులు క్రియేట్ అయ్యాయి. మరి ఆ రికార్డులు ఏంటో తెలుసుకుందాం పదండి.

RCB vs SRH: ఆర్సీబీ వర్సెస్ సన్ రైజర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో పలు రికార్డులు బద్దలైయ్యాయి, సరికొత్త రికార్డులు క్రియేట్ అయ్యాయి. మరి ఆ రికార్డులు ఏంటో తెలుసుకుందాం పదండి.

ఇది కదా మ్యాచ్ అంటే.. RCB vs SRH మ్యాచ్ లో ఎన్ని రికార్డులు క్రియేట్ అయ్యాయో తెలుసా?

ఐపీఎల్ 2024 సీజన్ లో ప్రేక్షకులకు అసలైన కిక్కిచ్చాయి సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్స్. తాజాగా చిన్న స్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఇరు జట్లు పరుగుల వరదపారించాయి. దీంతో బౌలర్లు బలైయ్యారు. బ్యాటర్ల వీరవిహారం ముందు రెండు జట్ల బౌలర్లు ప్రేక్షకపాత్ర వహించక తప్పలేదు. ఇక రికార్డు స్థాయిలో పలు రికార్డులు బ్రేక్ అవ్వడంతో పాటుగా సరికొత్త రికార్డులు పుట్టుకొచ్చాయి. ఈ మ్యాచ్ లో ఎన్ని రికార్డులు క్రియేట్ అయ్యాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఈ ఐపీఎల్ సీజన్ లో దుమ్మురేపుతోంది. తనదైన టీమ్ బ్యాటింగ్ తో రికార్డులు బద్దలు కొట్టడమే కాకుండా.. విజయాలు సాధిస్తూ టైటిల్ ఫేవరెట్ గా దూసుకెళ్తోంది. తాజాగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో తన రికార్డును తానే బ్రేక్ చేసి, సరికొత్త చరిత్రను సృష్టించింది. ప్రేక్షకులకు మస్త్ మజాను పంచిన ఈ మ్యాచ్ లో పదుల సంఖ్యలో రికార్డులు క్రియేట్ అయ్యాయి. అవేంటో చూద్దాం..

RCB vs SRH మ్యాచ్ లో క్రియేట్ అయిన రికార్డులు

    • ఐపీఎల్ చరిత్రలోనే కాక టీ20 హిస్టరీలో రెండు జట్ల స్కోర్ 549 కావడం చరిత్రలో ఇదే తొలిసారి.
    • ఈ సీజన్ లో అత్యంత వేగంగా(39 బంతుల్లో) సెంచరీ చేసిన బ్యాటర్ గా ట్రావిస్ హెడ్ నిలిచాడు.
    • అదీకాక ఈ మ్యాచ్ లో 22, 23, 24 బంతుల్లో బ్యాటర్లు ఫిఫ్టిలు సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పారు.
    • ఇక ఓడిపోయిన ఆర్సీబీ చేసిన 262 పరుగులు ఐపీఎల్ హిస్టరీలో ఛేజింగ్ లో కొట్టిన అత్యధిక రన్స్ గా నిలిచాయి.
    • ఈ మ్యాచ్ లో టోటల్ గా 38 సిక్సులు నమోదు అయ్యాయి. ఐపీఎల్ హిస్టరీలోనే కాక.. ఓ టీ20 మ్యాచ్ లో మోస్ట్ సిక్సెస్ రికార్డు క్రియేట్ అయ్యింది.