iDreamPost

Dinesh Karthik: దినేశ్ కార్తిక్ థండర్ ఇన్నింగ్స్.. టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు ఖాయం?

తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లో దినేశ్ కార్తిక్ సృష్టించిన విధ్వంసం చూస్తే.. టీ20 వరల్డ్ కప్ 2024 జట్టులో చోటు ఖాయంగా కనిపిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లో దినేశ్ కార్తిక్ సృష్టించిన విధ్వంసం చూస్తే.. టీ20 వరల్డ్ కప్ 2024 జట్టులో చోటు ఖాయంగా కనిపిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Dinesh Karthik: దినేశ్ కార్తిక్ థండర్ ఇన్నింగ్స్.. టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు ఖాయం?

IPL 2024.. ప్రస్తుతం ఈ టోర్నీలో ఆడుతున్న అన్ని జట్ల లక్ష్యం ఒక్కటే, టైటిల్ సాధించడం. అయితే పైకి ఈ సీజన్ టైటిల్ సాధించడమే కనిపిస్తున్నా.. ఆటగాళ్ల టార్గెట్ మాత్రం వేరే ఉంది. అదే టీ20 వరల్డ్ కప్. జూన్ లో ప్రారంభం కానున్న ఈ మెగాటోర్నీ కోసం ఇప్పటి నుంచే ప్లేయర్లు, పాల్గొనే టీమ్స్ మాస్టర్ ప్లాన్స్ రెడీ చేసుకుంటున్నాయి. ఇక ఆటగాళ్లు ఐపీఎల్ లో అద్భుతంగా రాణించి.. నేరుగా టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు సంపాదించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలనే 38 ఏళ్ల లేటు వయసులో తుఫాన్ ఇన్సింగ్స్ లతో చెలరేగుతున్నాడు టీమిండియా వెటరన్ బ్యాటర్ దినేశ్ కార్తిక్. తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లో అతడి విధ్వంసం చూస్తే.. పొట్టి వరల్డ్ కప్ జట్టులో చోటు ఖాయంగా కనిపిస్తోంది.

దినేశ్ కార్తిక్.. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో మారుమోగుతున్న పేరు. తాజాగా సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో అద్వితీయమైన బ్యాటింగ్ తో అలరించాడు. డీకే క్రీజ్ లో ఉన్నంత సేపు ఆర్సీబీ గెలుస్తుందని అందరూ భావించారు. కొండంత లక్ష్యం ముందు ఉన్నప్పటికీ.. ఒకవైపు మిగతా బ్యాటర్లు రాణించకపోయినా మెుక్కవోని దీక్షతో బ్యాటింగ్ చేశాడు. సన్ రైజర్స్ బౌలింగ్ ను ఊచకోత కోస్తూ.. కేవలం 35 బంతుల్లోనే 5 ఫోర్లు, 7 సిక్సులతో 83 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ఓడిపోయినప్పటికీ.. దినేశ్ కార్తిక్ ఇన్నింగ్స్ మాత్రం ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ నిలిచి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మ్యాచ్ ఓడినా, డీకే మనసులు గెలిచాడని ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.

ఇదిలా ఉండగా.. తుఫాన్ బ్యాటింగ్ తో డీకే టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు ఖాయం చేసుకున్నాడని క్రీడాపండితులు అభిప్రాయపడుతున్నారు. ఈ సీజన్ లో అవకాశం వచ్చినప్పుడల్లా తన ఫినిషర్ పాత్రను సమర్థవంతగా నిర్వహిస్తున్నాడు దినేశ్ కార్తిక్. ఈ సీజన్ లో ఇప్పటి వరకు 7 మ్యాచ్ లు ఆడి 226 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ కంటే ముందు ముంబైతో జరిగిన మ్యాచ్ లో సైతం మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆ మ్యాచ్ లో కేవలం 23 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్సులతో 53 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. మిడిలార్డర్ బ్యాటింగ్ రావడమే కష్టం, ఒకవేళ వచ్చినా.. ఎక్కువ ఓవర్లు ఉండవు. దీంతో వేగంగా పరుగులు చేయాల్సి ఉంటుంది. ఆ పనిని డీకే చాలా సింపుల్ గా చేస్తున్నాడు. దీంతో టీ20 వరల్డ్ కప్ జట్టులోకి అతడు రావడం పక్కా అని అందరూ భావిస్తున్నారు.

అదీకాక ప్రస్తుతం డీకే వయసు 38 సంవత్సరాలు అతడు నెక్ట్స్ వరల్డ్ కప్ ఆడే అవకాశం లేదు. ప్రస్తుత ఫామ్ తో పాటుగా గౌరవంగా ప్రపంచ కప్ జట్టులో చోటు కల్పించాలని బీసీసీఐ సైతం భావిస్తోందని తెలుస్తోంది. పైగా టీమిండియాకు ధోని తర్వాత మళ్లీ అలాంటి ఫినిషర్ గా డీకే మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఇన్ని సానుకూల అంశాలు ఉన్నాయి కాబట్టే.. ఈసారి టీ20 వరల్డ్ కప్ లో డీకేకు ప్లేస్ కన్ఫామ్ అంటున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు, క్రీడాపండితులు. మరి డీకేని పొట్టి ప్రపంచ కప్ లోకి తీసుకుంటే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి