Rohit Sharma: ఫ్లయింగ్ కిస్ తో మయాంక్ ని టీజ్ చేసిన రోహిత్! ఇది వేరే లెవల్..

సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ కు ముందు తనలో ఉన్న ఇంకో యాంగిల్ ను బయటకితీశాడు. హైదరాబాద్ ప్లేయర్ మయంక్ అగర్వాల్ ను ఓ ఆటాడుకున్నాడు రోహిత్.

సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ కు ముందు తనలో ఉన్న ఇంకో యాంగిల్ ను బయటకితీశాడు. హైదరాబాద్ ప్లేయర్ మయంక్ అగర్వాల్ ను ఓ ఆటాడుకున్నాడు రోహిత్.

ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా తొలగించిన దగ్గర నుంచి తీవ్ర అసంతృప్తికి గురైతూ వచ్చాడు రోహిత్  శర్మ. దీంతో ఈ ఐపీఎల్ లో ఎలా ఆడతాడో అని అందరూ అనుకున్నారు. ఇక అతడి ఫ్యాన్స్ అయితే ఇప్పటికీ ఆందోళన చెందుతున్నారు. కానీ కెప్టెన్సీ పోయిన తర్వాత హిట్ మ్యాన్ పూర్తిగా మారిపోయాడు. ఎంతో సరదాగా, ఫన్ పుల్ గా ఉంటూ వస్తున్నాడు. తాజాగా జరిగిన హోళి వేడుకల్లో ఈ విషయం స్పష్టంగా అర్ధమైంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ కు ముందు తనలో ఉన్న ఇంకో యాంగిల్ ను బయటకితీశాడు. హైదరాబాద్ ప్లేయర్ మయంక్ అగర్వాల్ ను ఓ ఆటాడుకున్నాడు రోహిత్.

హైదరాబాద్ వేదికగా బుధవారం(మార్చి 27) ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇక ఈ పోరు కోసం ఇప్పటికే రెండు టీమ్స్ గ్రౌండ్ కు చేరుకుని ప్రాక్టీస్ మెుదలుపెట్టాయి. ప్రాక్టీస్ లో భాగంగా SRH స్టార్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ను సరదాగా ర్యాగింగ్ చేశాడు హిట్ మ్యాన్. మయాంక్ గ్రౌండ్ కి రాగా.. అతడి వైపు చూస్తూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు రోహిత్. ఇది ఊహించని మయాంక్ నవ్వులు చిందించాడు. గ్రౌండ్ లో దాదాపుగా సీరియస్ గానే ఉంటాడు రోహిత్.

కానీ ముంబై కెప్టెన్సీ పోయినదగ్గర నుంచి చాలా సరదాగా ఉంటూ.. స్వేచ్ఛగా బ్యాటింగ్ కూడా చేస్తున్నాడు. తన సహచర క్రికెటర్లతో కామెడీలు చేస్తూన్నాడు. అయితే హిట్ మ్యాన్ ఇలా చేయడానికి కారణం ఏంటంటే? గత మ్యాచ్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ బౌలర్ హర్షిత్ రానా అగర్వాల్ ను ఔట్ చేసిన తర్వాత ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. ఇది దృష్టిలో పెట్టుకున్న రోహిత్ అతడిని చూడగానే ఇలా ఫ్లయింగ్ కిస్ ఇచ్చి టీజ్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇదిలా ఉండగా.. హర్షిత్ రానా నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించడంతో.. అతడికి మ్యాచ్ ఫీజులో 60 శాతం కోత పెట్టింది. మరి తన హాస్య చతురతతో నవ్వులు పూయిస్తూ.. మయాంక్ అగర్వాల్ ను టీజ్ చేసిన రోహిత్ శర్మపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: IPL 2024: మళ్లీ ముంబై కెప్టెన్ గా రోహిత్ శర్మ? దిగ్గజ కోచ్ ఏమన్నాడంటే?

Show comments