Somesekhar
ఐపీఎల్ 2024లో భాగంగా నిన్న వర్షం కారణంగా గుజరాత్ వర్సెస్ సన్ రైజర్స్ మధ్య మ్యాచ్ రద్దైన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో ఓ ఊహించని సంఘటన చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఐపీఎల్ 2024లో భాగంగా నిన్న వర్షం కారణంగా గుజరాత్ వర్సెస్ సన్ రైజర్స్ మధ్య మ్యాచ్ రద్దైన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో ఓ ఊహించని సంఘటన చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Somesekhar
ఐపీఎల్ 2024 సీజన్ లో అసాధారణ ప్రతిభతో అదరగొడుతోంది సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్. ఆరంభ మ్యాచ్ ల్లో వరుసగా రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ.. ప్రపంచ క్రికెట్ నే ఆశ్చర్యంలో ముంచెత్తింది. అయితే ఆ తర్వాత వరుసగా పరాజయాలు పలకరించడంతో.. ప్లే ఆఫ్స్ ఆశలపై ఫ్యాన్స్ ఆందోళన చెందారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. 15 పాయింట్లతో ప్లే ఆఫ్స్ కు చేరింది సన్ రైజర్స్ హైదరాబాద్. నిన్న గుజరాత్ తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో ఎవ్వరూ ఊహించని సీన్ చోటుచేసుకుంది.
ఐపీఎల్ 2024లో భాగంగా నిన్న గుజరాత్ టైటాన్స్ తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ కు దూసుకెళ్లింది. అయితే వర్షం అడ్డుపడ్డ ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ రద్దు కావడంతో.. ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటున్నారు. ఈ క్రమంలో SRH ఓనర్ కావ్య మారన్ దగ్గరికి వచ్చాడు ఆ జట్టు మాజీ కెప్టెన్, ప్రస్తుత గుజరాత్ ప్లేయర్ కేన్ విలియమ్సన్. ఆమెను ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. ఇద్దరూ అభిమానంగా పలకరించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోవైరల్ గా మారింది.
కాగా.. కేన్ విలియమ్సన్ 2021, 2022 ఐపీఎల్ సీజన్లలో సన్ రైజర్స్ టీమ్ కు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఈ సీజన్లో అటు కెప్టెన్ గా ఇటు ప్లేయర్ గా దారుణంగా విఫలం కావడంతో.. కేన్ మామను విడుదల చేసింది SRH. దాంతో 2023 ఐపీఎల్ వేలంలో గుజరాత్ టైటాన్స్ అతడిని దక్కించుకుంది. కానీ ఈ సీజన్ లో కేన్ విలియమ్సన్ 2 మ్యాచ్ లు మాత్రమే ఆడి 27 పరుగులు చేశాడు. ఇక తాజాగా ఇరు జట్ల మధ్య మ్యాచ్ కారణంగా పాత ఓనర్ ను కలుసుకోవడంతో.. కేన్ మామ ఆప్యాయంగా ఆమెను పలకరించాడు. ఈ వీడియోను సన్ రైజర్స్ హైదరాబాద్ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
— SunRisers Hyderabad (@SunRisers) May 16, 2024