iDreamPost
android-app
ios-app

Ishan Kishan-Tim David: గ్రౌండ్ లో కొట్టుకున్న ఇషాన్ కిషన్, టిమ్ డేవిడ్.. వీడియో వైరల్!

  • Published May 17, 2024 | 12:04 PM Updated Updated May 17, 2024 | 12:04 PM

ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్లు ఇషాన్ కిషన్, టిమ్ డేవిడ్ లు గ్రౌండ్ లోనే కొట్టుకున్నారు. సహచర ప్లేయర్లు చూస్తుండగానే కుస్తీ పట్లు పట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే?

ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్లు ఇషాన్ కిషన్, టిమ్ డేవిడ్ లు గ్రౌండ్ లోనే కొట్టుకున్నారు. సహచర ప్లేయర్లు చూస్తుండగానే కుస్తీ పట్లు పట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే?

  • Published May 17, 2024 | 12:04 PMUpdated May 17, 2024 | 12:04 PM
Ishan Kishan-Tim David: గ్రౌండ్ లో కొట్టుకున్న ఇషాన్ కిషన్, టిమ్ డేవిడ్.. వీడియో వైరల్!

ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్స్ అయిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో దారుణ ప్రదర్శనతో తన ప్రయాణం ముగించింది. 13 మ్యాచ్ ల్లో 4 విజయాలు సాధించి.. ఈ టోర్నీ నుంచి నిష్క్రమించిన తొలి టీమ్ గా అప్రతిష్టమూటగట్టుకుంది. ఇక ఈ లీగ్ లో ఒకే ఒక్క మ్యాచ్ ఆడాల్సి ఉంది ముంబై. వాంఖడే వేదికగా నేడు(మే 17) లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడబోతోంది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు ఇషాన్ కిషన్-టిమ్ డేవిడ్ లు గ్రౌండ్ లో కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అసలేం జరిగిందంటే?

ముంబై ఇండియన్స్ ఈ ఐపీఎల్ సీజన్ లో తన చివరి మ్యాచ్ ఆడబోతోంది. లక్నోతో వాంఖడే వేదికగా ఈ పోరు జరగనుంది. ఇక ఇందుకోసం ఇరు జట్లు ఇప్పటికే అక్కడికి చేరుకుని ప్రాక్టీస్ మెుదలుపెట్టాయి. ఈ క్రమంలో ఇరు జట్ల ఆటగాళ్లు గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ సమయంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ముంబై వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ఇషాన్ కిషన్, ఆ జట్టు మరో ప్లేయర్ టిమ్ డేవిడ్ లు గ్రౌండ్ లో పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ఇద్దరు కాసేపు కుస్తీ పట్టారు. ఆ కొట్టుకోవడం చూస్తే.. నిజంగానే కోపంగా ఇద్దరు కొట్టుకుంటున్నారని అనుకుంటాం. అంతలా ఇద్దరు రెజ్లింగ్ పట్టు పట్టుకున్నారు.

ఇక ఈ వీడియోను ముంబై ఇండియన్స్ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది క్యాజువల్ రెజ్లింగ్ అని, మీరు ఇంటి దగ్గర దీన్ని ట్రై చేయకండి అని ఆ వీడియోకు వార్నింగ్ క్యాప్షన్ కూడా పెట్టింది. ఈ ఫైటింగ్ లో ఇషాన్ కిషన్ టిమ్ డేవిడ్ ను కింద పడేయాలని చాలా ప్రయత్నించి విఫలం అయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక తన ఫామ్ ఎలాఉన్నా ఇషాన్ కిషన్ మాత్రం గ్రౌండ్ లో ఎంతో ఫన్నీగా ఉంటాడన్న విషయం మనందరికి తెలిసిందే.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcasibomJojobetcasibomjojobetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabet