Somesekhar
ఓటమి బాధలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ కు భారీ గుడ్ న్యూస్ అందింది. గాయం కారణంగా తొలి మ్యాచ్ కు దూరమైన స్పీడ్ బౌలర్ రెండో మ్యాచ్ కోసం జట్టులో చేరాడు. ఆ మెరుపు బౌలర్ ఎవరంటే?
ఓటమి బాధలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ కు భారీ గుడ్ న్యూస్ అందింది. గాయం కారణంగా తొలి మ్యాచ్ కు దూరమైన స్పీడ్ బౌలర్ రెండో మ్యాచ్ కోసం జట్టులో చేరాడు. ఆ మెరుపు బౌలర్ ఎవరంటే?
Somesekhar
ఐపీఎల్ 2024 సీజన్ ను ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమితో ఆరంభించింది. ఈనెల 23న పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో 4 వికెట్లతో పరాజయం పాలైంది. ఓటమి బాధలో ఉన్న ఢిల్లీకి అదిరిపోయే శుభవార్త అందింది. గాయం కారణంగా తొలి మ్యాచ్ కు దూరమైన స్పీడ్ బౌలర్ రెండో మ్యాచ్ కోసం జట్టులో చేరాడు. అందుకు సంబంధించిన వీడియోను డీసీ మేనేజ్ మెంట్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వెల్లడించింది. మరి ఆ మెరుపు బౌలర్ ఎవరు? తెలుసుకుందాం పదండి.
ఓటమి బాధలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ కు భారీ గుడ్ న్యూస్ అందింది. గాయం కారణంగా పంజాబ్ తో మ్యాచ్ కు దూరమైన స్టార్ బౌలర్ ఎన్రిచ్ నోర్జే జట్టులో చేరాడు. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతులు సంధించడంలో మేటి నోర్జే. అతడి రాకతో ఢిల్లీ బౌలింగ్ దళం స్ట్రాంగ్ గా మారనుంది. 30 ఏళ్ల ఈ సౌతాఫ్రికా బౌలర్ ఇప్పటి వరకు 40 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడి 53 వికెట్లు తీశాడు. జైపూర్ వేదికగా ఈనెల 28న రాజస్తాన్ రాయల్స్ తో జరిగే మ్యాచ్ కు అతడు అందుబాటులో ఉంటాడు. ఈ మ్యాచ్ లోనైనా గెలిచి.. ఈ సీజన్ లో బోణీకొట్టాలని చూస్తోంది ఢిల్లీ క్యాపిటల్స్. కారు ప్రమాదం నుంచి బయటపడిన కెప్టెన్ రిషబ్ పంత్ ఇంకా ఫామ్ లోకి రాలేదు. గత మ్యాచ్ లో బౌలర్లు పూర్తిగా విఫలమైయ్యారు. దారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. మరి నోర్జే రాకతోనైనా డీసీ విజయం సాధిస్తుందో? లేదో? చూడాలి.
Everything moved a little 𝘕𝘖𝘙𝘛𝘑𝘌 today 😉🤯
Welcome 🔙, 𝟏𝟓𝟔.𝟐 𝐤𝐩𝐡 🔥#YehHaiNayiDilli pic.twitter.com/me5uirhY30
— Delhi Capitals (@DelhiCapitals) March 25, 2024
ఇదికూడా చదవండి: CSK vs GT: చెన్నై vs గుజరాత్.. గెలుపు ఎవరిదంటే? ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..!