iDreamPost

CSK vs GT: చెన్నై vs గుజరాత్.. గెలుపు ఎవరిదంటే? ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..!

  • Published Mar 25, 2024 | 8:05 PMUpdated Mar 25, 2024 | 8:05 PM

ఫస్ట్ మ్యాచ్​లో గెలిచి ఫుల్​ జోష్​లో ఉన్నాయి సీఎస్​కే, జీటీ. ఈ రెండు టీమ్స్ మధ్య మంగళవారం మ్యాచ్ జరగబోతోంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్​లో ఇరు జట్ల ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనున్నాయో ఇప్పుడు చూద్దాం..

ఫస్ట్ మ్యాచ్​లో గెలిచి ఫుల్​ జోష్​లో ఉన్నాయి సీఎస్​కే, జీటీ. ఈ రెండు టీమ్స్ మధ్య మంగళవారం మ్యాచ్ జరగబోతోంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్​లో ఇరు జట్ల ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనున్నాయో ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 25, 2024 | 8:05 PMUpdated Mar 25, 2024 | 8:05 PM
CSK vs GT: చెన్నై vs గుజరాత్.. గెలుపు ఎవరిదంటే? ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..!

ఐపీఎల్-2024లో మరో ఇంట్రెస్టింగ్​ మ్యాచ్​కు సర్వం సిద్ధమైంది. గతేడాది ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రన్నరప్ గుజరాత్ టైటాన్స్​ మరోసారి తలపడేందుకు రెడీ అవుతున్నాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. సీఎస్​కే-జీటీ తాము ఆడిన తొలి మ్యాచుల్లో విజయం సాధించాయి. ఫస్ట్ మ్యాచ్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును చెన్నై చిత్తు చేయగా.. ఉత్కంఠ పోరులో ముంబై ఇండియన్స్​ను గుజరాత్ ఓడించింది. మంచి జోష్​లో ఉన్న టీమ్స్ మధ్య మ్యాచ్ కానుండటంతో చెన్నై-జీటీ పోరుపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్​లో ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండదనుంది? ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు తెలుసుకుందాం..

చెన్నై సూపర్ కింగ్స్

కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని సీఎస్​కే చాలా బలంగా కనిపిస్తోంది. బౌలింగ్​తో పాటు బ్యాటింగ్​లో ఆ టీమ్ సూపర్ స్ట్రాంగ్​గా ఉంది. నయా కెప్టెన్​ రుతురాజ్​కు సాయం చేసేందుకు మాస్టర్ మైండ్ ఎంఎస్ ధోని టీమ్​లో ఉండటం ఆ జట్టుకు బిగ్ ప్లస్. రుతు, ధోనీతో పాటు రచిన్ రవీంద్ర, అజింక్యా రహానె, శివమ్ దూబె, డారిల్ మిచెల్, రవీంద్ర జడేజాతో బ్యాటింగ్ యూనిట్ బలంగా ఉంది. ముస్తాఫిజుర్ రెహ్మాన్, దీపక్ చాహర్, జడేజా, మహీష్ తీక్షణతో బౌలింగ్ యూనిట్ కూడా బాగుంది. ఫస్ట్ మ్యాచ్​లో ముస్తాఫిజుర్ 4 వికెట్లతో దుమ్మురేపాడు. రచిన్, దూబె, జడ్డూ బ్యాటింగ్​లో సత్తా చాటారు. సొంత మైదానంలో మ్యాచ్ జరుగుతుండటం సీఎస్​కే కలిసొచ్చే అంశం. అయితే ముస్తాఫిజుర్ మినహా మిగిలిన బౌలర్లు రాణించకపోవడం, వికెట్లు తీయకపోవడం, రన్స్ కూడా భారీగా ఇచ్చుకోవడం మైనస్​గా మారింది.

గుజరాత్ టైటాన్స్

కెప్టెన్ హార్దిక్ పాండ్యా టీమ్​ను వదిలేసి వెళ్లడం, స్టార్ పేసర్ మహ్మద్ షమి గాయంతో దూరమవడంతో ఈ సీజన్​లో గుజరాత్ ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది. కొత్త కెప్టెన్ శుబ్​మన్ గిల్ టీమ్​ను ఎలా నడిపిస్తాడో కూడా చూడాలని అంతా ఎదురు చూశారు. అయితే ముంబై ఇండియన్స్​తో ఫస్ట్ మ్యాచ్​లో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది జీటీ. 6 పరుగుల తేడాతో అనూహ్యంగా విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్​లో బ్యాటింగ్​లో సాయి సుదర్శన్ (45) ఒక్కడే రాణించాడు. బౌలింగ్​లో మాత్రం అజ్మతుల్లా ఒమర్జాయి, ఉమేశ్ యాదవ్, స్పెన్సర్ జాన్సన్, మోహిత్ శర్మ చెరో 2 వికెట్లతో అదరగొట్టారు. బౌలర్లు రాణించడం, నెహ్రా కోచింగ్ వల్లే ఈ మ్యాచ్​లో నెగ్గింది గుజరాత్.

కెప్టెన్ శుబ్​మన్ గిల్​తో పాటు సాహా, ఒమర్జాయి, మిల్లర్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా రూపంలో మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. వీళ్లందరూ రాణిస్తే టీమ్​కు తిరుగుండదు. జట్టు ఎంత బలంగా ఉందనే దాని కంటే కూడా నెహ్రా లాంటి సూపర్ కోచ్ ఉండటం జీటీకి అతిపెద్ద బలమని చెప్పాలి. అయితే చెన్నైతో తలపడాలంటే ఇది మాత్రమే సరిపోదు. బ్యాటర్లు కూడా రఫ్ఫాడించాలి. గిల్ బాధ్యత తీసుకొని బ్యాటింగ్ చేయాలి. అలాగే మిడిలార్డర్ బ్యాటర్లు కూడా సత్తా చాటాలి. జీటీ బ్యాటింగ్​లో చాలా వీక్​గా కనిపిస్తోంది. క్వాలిటీ ప్లేయర్స్ ఉన్నా ఫస్ట్ మ్యాచ్​లో స్థాయికి తగ్గట్లు ఆడలేదు. మంచి స్టార్ట్స్ దొరికాక అనవసర షాట్లతో వికెట్లు పారేసుకున్నారు. ఇదే ఆ టీమ్​కు పెద్ద మైనస్​.

ప్రిడిక్షన్:

ఇరు జట్ల బలాబలాలు పరిశీలించిన తర్వాత.. ఈ మ్యాచ్​లో చెన్నై విక్టరీ కొట్టే ఛాన్స్ ఉంది. ఈ రెండు టీమ్స్ మధ్య ఇప్పటిదాకా 5 మ్యాచులు జరిగాయి. వీటిల్లో సీఎస్​కే 2సార్లు, జీటీ 3సార్లు నెగ్గాయి. కానీ ఐపీఎల్-2023 ఫైనల్​లో చెన్నై నెగ్గింది. ఈ సీజన్ మొదటి మ్యాచ్​లో గెలిచి రుతురాజ్ సేన ఫుల్ జోష్​లో ఉంది. రేపటి మ్యాచ్ సీఎస్​కే సొంతగడ్డపై జరుగుతోంది. దీంతో ఆ టీమ్ తమ బలానికి తగ్గట్లు ఆడితే గెలుపు ఖాయం.

ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా)

చెన్నై సూపర్ కింగ్స్:
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానె, డారిల్ మిచెల్, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), దీపక్ చాహర్, తీక్షణ, ముస్తాఫిజుర్ రెహ్మాన్, తుషార్ దేశ్​పాండే.

గుజరాత్ టైటాన్స్:
శుబ్​మన్ గిల్ (కెప్టెన్), వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయి, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ఉమేశ్ యాదవ్, సాయి కిషోర్, స్పెన్సర్ జాన్సన్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి