iDreamPost
android-app
ios-app

క్రికెట్ లవర్స్ కు గుడ్ న్యూస్.. IPL 2024 సెకండ్ ఫేజ్ షెడ్యూల్ విడుదల!

  • Published Mar 25, 2024 | 7:32 PM Updated Updated Mar 25, 2024 | 7:32 PM

IPL 2024 Second Phase Schedule Released: ఐపీఎల్ 2024 సీజన్ సెకండ్ షెడ్యూల్ విడుదల అయ్యింది. షెడ్యూల్ కు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

IPL 2024 Second Phase Schedule Released: ఐపీఎల్ 2024 సీజన్ సెకండ్ షెడ్యూల్ విడుదల అయ్యింది. షెడ్యూల్ కు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

క్రికెట్ లవర్స్ కు గుడ్ న్యూస్.. IPL 2024 సెకండ్ ఫేజ్ షెడ్యూల్ విడుదల!

దేశంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ 2024 సీజన్ ను రెండు దశలుగా నిర్వహించడానికి పూనుకుంది బీసీసీఐ. అందులో భాగంగా తొలి విడతలో 21 మ్యాచ్ లకు సంబంధించి షెడ్యూల్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 7న తొలి షెడ్యూల్ మ్యాచ్ లు ముగుస్తాయి. అయితే మిగతా మ్యాచ్ లు ఎప్పుడు నిర్వహిస్తారు? వాటితో పాటుగా నాకౌట్ మ్యాచ్ ల షెడ్యూల్ ఎప్పుడు? అన్న ప్రశ్నలు ఫ్యాన్స్ లో తలెత్తాయి. తాజాగా వారి ఎదురుచూపులకు తెర దించుతూ.. ఐపీఎల్ 2024 సీజన్ సెకండ్ షెడ్యూల్ విడుదల అయ్యింది. షెడ్యూల్ కు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ఐపీఎల్ 2024 సీజన్ రెండో విడత షెడ్యూల్ ను తాజాగా విడుదల చేశారు టోర్నీ నిర్వాహకులు. తొలి సీజన్ లో 21 మ్యాచ్ లకు సంబంధించిన షెడ్యూల్ మాత్రమే విడుదల చేయగా.. ఇక ఇప్పుడు మిగతా 53 మ్యాచ్ ల షెడ్యూల్ ను ప్రకటించింది. ఏప్రిల్ 8న సెకండ్ ఫేజ్ ప్రారంభం కానుండగా.. తొలి పోరులో చెన్నై వర్సెస్ కోల్ కత్తా తలపడనున్నాయి. చెపాక్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. కాగా.. మే 19న లీగ్ దశలో చివరి మ్యాచ్ రాజస్తాన్ వర్సెస్ కేకేఆర్ మధ్య జరగబోతోంది. ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరగనుంది. ఇక మే21న నరేంద్రమోదీ స్టేడియంలో క్వాలిఫయర్-1, మే 22 అదే గ్రౌండ్ లో ఎలిమినేటర్ మ్యాచ్, మే 24న చెన్నై చెపాక్ వేదికగా క్వాలిఫయర్ 2 మ్యాచ్ జరుగుతాయి. ఇదిలా ఉండగా.. రెండో విడతలో హైదరాబాద్ లో 5 మ్యాచ్ లు జరగుతాయి. ఇక ఐపీఎల్ 2024 సెకండ్ ఫేజ్ మ్యాచ్ లో విదేశాల్లో జరుగుతాయి అన్న వార్తలకు చెక్ పడింది.

ఇదికూడా చదవండి: IPL 2024: తొలి మ్యాచ్‌లోనే కెప్టెన్‌గా గిల్‌ సూపర్‌ సక్సెస్‌! ధోనిని గుర్తుకు తెచ్చాడు