iDreamPost
android-app
ios-app

IPL 2024: ఐపీఎల్ కెప్టెన్స్​కు రికార్డు స్థాయిలో రెమ్యూనరేషన్స్.. ఒక్కొక్కరికి ఎంతంటే..?

  • Published Mar 05, 2024 | 3:48 PM Updated Updated Mar 05, 2024 | 3:48 PM

ఐపీఎల్ నయా సీజన్ మొదలవడానికి ఇంకా 17 రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీంతో ప్లేయర్లు అందరూ క్రమంగా ప్రాక్టీస్ మోడ్​లోకి వెళ్లిపోతున్నారు. ఈ తరుణంలో ఈ సీజన్​ ఐపీఎల్​లో కెప్టెన్స్​కు అందుతున్న రెమ్యూనరేషన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్ నయా సీజన్ మొదలవడానికి ఇంకా 17 రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీంతో ప్లేయర్లు అందరూ క్రమంగా ప్రాక్టీస్ మోడ్​లోకి వెళ్లిపోతున్నారు. ఈ తరుణంలో ఈ సీజన్​ ఐపీఎల్​లో కెప్టెన్స్​కు అందుతున్న రెమ్యూనరేషన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 05, 2024 | 3:48 PMUpdated Mar 05, 2024 | 3:48 PM
IPL 2024: ఐపీఎల్ కెప్టెన్స్​కు రికార్డు స్థాయిలో రెమ్యూనరేషన్స్.. ఒక్కొక్కరికి ఎంతంటే..?

క్రికెట్ లవర్స్​ను మరోమారు ఎంటర్​టైన్ చేసేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెడీ అవుతోంది. మార్చి 22వ తేదీ నుంచి క్యాష్ రిచ్ లీగ్ నయా సీజన్ స్టార్ట్ కానుంది. దీంతో నేషనల్ డ్యూటీకి దూరంగా ఉంటున్న కొందరు ఆటగాళ్లు ఇప్పటికే ప్రాక్టీస్​లో మునిగిపోయారు. ఇంటర్నేషనల్ క్రికెట్​తో బిజీగా ఉన్న మిగిలిన ప్లేయర్లు మరో వారం రోజుల్లో ఫ్రీ అవుతారు. దీంతో నెక్స్ట్ వీక్ అన్ని ఐపీఎల్ టీమ్స్ పూర్తిగా ప్రాక్టీస్​ మోడ్​లోకి వెళ్లడం ఖాయం. సాధన చేస్తూనే టీమ్ కాంబినేషన్, గేమ్ ప్లానింగ్ తదితర విషయాలపై ఫోకస్ చేయనున్నాయి. ఇక, ఈసారి లీగ్​లోని 10 జట్ల కెప్టెన్స్ రికార్డు స్థాయిలో రెమ్యూనరేషన్స్ అందుకుంటున్నారు. వాళ్ల జీతభత్యాలు ఎలా ఉన్నాయి? ఎవరు ఎక్కువ మొత్తంలో వేతనం అందుకుంటున్నారు? తదిరత విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఈసారి ఐపీఎల్​ కెప్టెన్స్ అందరిలోకెల్లా అత్యధిక వేతనం అందుకుంటోంది సన్​రైజర్స్ సారథి పాట్ కమిన్స్ కావడం గమనార్హం. అతడు ఈ సీజన్​లో ఆడినందుకు గానూ ఏకంగా 20.50 కోట్లు అందుకోనున్నాడు. కమిన్స్ తర్వాత అత్యధిక జీతం అందుకుంటున్న సారథిగా కేఎల్ రాహుల్ (రూ.17 కోట్లు) ఉన్నాడు. వీళ్ల తర్వాత ప్లేసుల్లో రిషబ్ పంత్ (రూ.16 కోట్లు), హార్దిక్ పాండ్యా (రూ.15 కోట్లు), సంజూ శాంసన్ (రూ.14 కోట్లు), శ్రేయస్ అయ్యర్ (రూ.12.25 కోట్లు), ఎంఎస్ ధోని (రూ.12 కోట్లు) నిలిచారు. పది కోట్ల లోపు వేతనాలు అందుకునే వారి జాబితాలో ముగ్గురు సారథులు ఉన్నారు. శిఖర్ ధవన్ (రూ.8.25 కోట్లు), శుబ్​మన్ గిల్ (రూ.8 కోట్లు), ఫాఫ్ డుప్లెసిస్ (రూ.7 కోట్లు) ఉన్నారు. అత్యధిక మొత్తం అందుకుంటున్న కెప్టెన్స్​ లిస్టులో గతేడాది సన్​రైజర్స్ ఆఖర్లో ఉండగా.. ఈసారి కమిన్స్​కు భారీ రెమ్యూనషరేషన్ ఇవ్వడంతో టాప్ ప్లేసులోకి దూసుకొచ్చింది.

ఇక, ఈసారి ఐపీఎల్​లోని చాలా జట్ల కెప్టెన్లు ఎవరో అందరికీ తెలిసిందే. గత సీజన్​లోని కొందరు సారథులు ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నారు. అయితే ఐదుగురు మాత్రం మారారు. కేఎల్ రాహుల్ (లక్నో సూపర్ జెయింట్స్), సంజూ శాంసన్ (రాజస్థాన్ రాయల్స్), ఎంఎస్ ధోని (చెన్నై సూపర్ కింగ్స్), శిఖర్ ధావన్ (పంజాబ్ కింగ్స్), ఫాఫ్​ డుప్లెసిస్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)లు ఈసారి కూడా ఆయా జట్లకు కెప్టెన్స్​గానే కొనసాగనున్నారు. అయితే మిగిలిన ఐదు జట్ల విషయంలో మాత్రం సారథ్య బాధ్యతలు ఇతరులకు అప్పజెప్పారు. సన్​రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్​గా పాట్ కమిన్స్​ను నియమించారు. గాయం నుంచి కమ్​బ్యాక్ ఇస్తున్న రిషబ్ పంత్ ఢిల్లీ సారథ్య పగ్గాలను అందుకోనున్నాడు. ఇంజ్యురీ వల్ల గత సీజన్​కు దూరంగా ఉన్న శ్రేయస్ అయ్యర్ కూడా ఈసారి కోల్​కతాను కెప్టెన్​గా ముందుండి నడిపించనున్నాడు. మరి.. ఐపీఎల్ కెప్టెన్స్ శాలరీ అంశంపై మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: క్రికెట్ లవర్స్​కు గుడ్ న్యూస్.. టీ20 ప్రపంచ కప్​ స్ట్రీమింగ్ పూర్తిగా ఉచితం!