iDreamPost
android-app
ios-app

ధోని సక్సెస్ వెనుక ఇంట్రెస్టింగ్ స్టోరీ.. అసలు నిజం చెప్పిన సచిన్!

  • Published Mar 23, 2024 | 3:33 PM Updated Updated Mar 23, 2024 | 3:33 PM

లెజెండ్ ఎంఎస్ ధోని సక్సెస్ వెనుక ఉన్న ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీని బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ రివీల్ చేశాడు. మాహీ ఈ రేంజ్​కు చేరుకోవడానికి గల కారణాలు తెలియజేశాడు.

లెజెండ్ ఎంఎస్ ధోని సక్సెస్ వెనుక ఉన్న ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీని బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ రివీల్ చేశాడు. మాహీ ఈ రేంజ్​కు చేరుకోవడానికి గల కారణాలు తెలియజేశాడు.

  • Published Mar 23, 2024 | 3:33 PMUpdated Mar 23, 2024 | 3:33 PM
ధోని సక్సెస్ వెనుక ఇంట్రెస్టింగ్ స్టోరీ.. అసలు నిజం చెప్పిన సచిన్!

ఎంఎస్ ధోని.. క్రికెట్ హిస్టరీలో బెస్ట్ కెప్టెన్లలో ఒకడు. టీమిండియాకు సారథ్యం అందించిన వారిలో అతడ్ని మించినోళ్లు లేరు. టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్​తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీని కూడా భారత్​కు అందించాడు మాహీ. అతడి సారథ్యంలో టీ20లు, వన్డేలతో పాటు టెస్టుల్లోనూ టీమిండియా నంబర్ వన్​గా చాన్నాళ్ల పాటు తిరుగులేని ఆధిపత్యం నడిపించింది. ఇప్పుడు సూపర్ స్టార్లుగా చలామణి అవుతున్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు ధోని సారథ్యంలో ఎదిగిన వారే. ఫెయిలైనా వాళ్లలోని టాలెంట్​ను గుర్తించి వరుస అవకాశాలు ఇచ్చాడు. దీంతో వాళ్లు టీమ్​లో నిలదొక్కుకున్నారు. ఇలా కెప్టెన్​గా టీమ్​కు అరుదైన కప్స్ అందించడమే గాక ఫ్యూచర్ స్టార్లను అందించాడు ధోని. అలాంటోడి సక్సెస్ వెనుక ఉన్న ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీని బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ రివీల్ చేశాడు.

ధోని ఈ స్థాయికి ఎదగడం వెనుక ఉన్న రహస్యాన్ని సచిన్ షేర్ చేశాడు. 2007లో భారత క్రికెట్ బోర్డు తనకు కెప్టెన్సీ పోస్ట్​ను ఆఫర్ చేసిందని.. అయితే ఆ టైమ్​లో తన బాడీ సరైన షేప్​లో లేదన్నాడు టెండూల్కర్. అప్పటికి చాలా రోజుల నుంచి తాను ధోనీని గమనిస్తూ వచ్చానని అన్నాడు. ‘2007లో బీసీసీఐ నాకు కెప్టెన్సీ ఆఫర్ చేసింది. కానీ ఆ సమయంలో నేను లావుగా ఉన్నా. నా బాడీ సరైన షేప్​లో లేదు. ధోనీని నేను గమనిస్తూ వస్తున్నా. అతడు చాలా ప్రశాంతంగా ఉండేవాడు. కూల్​గా, కామ్​గా తన పని తాను చేసుకుపోయేవాడు. అతడి మైండ్​ కూడా నిశ్చలంగా ఉండేది. ఆ సమయంలో ఏది అవసరమో దానికి అనుగుణంగా అతడు సరైన నిర్ణయాలు తీసుకునేవాడు. దీంతో కెప్టెన్సీకి అతడ్ని రికమెండ్ చేశా’ అని సచిన్ చెప్పుకొచ్చాడు.

That one word changed Dhoni's career

ధోనీలోని టాలెంట్​, కూల్ యాటిట్యూడ్, కరెక్ట్ డిసిషన్స్ తీసుకునే విధానం నచ్చే అతడ్ని కెప్టెన్​గా రిఫర్ చేశానని సచిన్ తెలిపాడు. అయితే కెప్టెన్ అయిన తర్వాత అతడు తనను తాను నిరూపించుకొని ఈ స్థాయికి చేరుకున్నాడని మాస్టర్ బ్లాస్టర్ చెప్పుకొచ్చాడు. ప్రతిభావంతులకు సరైన సమయంలో అవకాశాలు ఇస్తే చాలని.. వాళ్లు అద్భుతాలు చేయగలరని పేర్కొన్నాడు. తను కెప్టెన్సీకి పర్ఫెక్ట్ ఛాయిస్ అంటూ రికమెండ్ చేసిన టైమ్​లో చెప్పిన ఆ ఒక్క మాట అతడి కెరీర్​ను మార్చేసిందన్నాడు. ఇక, ఐపీఎల్-2024 ఆరంభానికి ఒక్క రోజు ముందు ధోని సీఎస్​కే కెప్టెన్సీకి గుడ్​బై చెప్పాడు. టీమ్ ఫ్యూచర్​ను దృష్టిలో పెట్టుకొని యంగ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్​కు నాయకత్వ బాధ్యతలు అప్పగించాడు. ఇక, టోర్నీ ఫస్ట్ మ్యాచ్​లో ఆర్సీబీని 6 వికెట్ల తేడాతో చెన్నై చిత్తు చేసింది. మరి.. ధోని కెరీర్ గురించి సచిన్ చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.