iDreamPost
android-app
ios-app

GT vs RCB: బుమ్రాను మరిపిస్తూ.. సిరాజ్ మైండ్ బ్లోయింగ్ యార్కర్! దెబ్బకు బ్యాటర్ కు కళ్లు బైర్లుకమ్మాయి..

  • Published Apr 28, 2024 | 6:05 PM Updated Updated Apr 28, 2024 | 6:05 PM

గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ బౌలర్ మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాను మరిపిస్తూ.. మైండ్ బ్లోయింగ్ యార్కర్ ను సంధించాడు. ఆ దెబ్బకు షారుఖ్ ఖాన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో నెట్టింట వైరల్ గా మారాయి.

గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ బౌలర్ మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాను మరిపిస్తూ.. మైండ్ బ్లోయింగ్ యార్కర్ ను సంధించాడు. ఆ దెబ్బకు షారుఖ్ ఖాన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో నెట్టింట వైరల్ గా మారాయి.

GT vs RCB: బుమ్రాను మరిపిస్తూ.. సిరాజ్ మైండ్ బ్లోయింగ్ యార్కర్! దెబ్బకు బ్యాటర్ కు కళ్లు బైర్లుకమ్మాయి..

ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసి గుజరాత్ టీమ్ 3 వికెట్ల నష్టానికి 200 పరుగుల భారీ స్కోర్ చేసింది. జట్టులో సాయి సుదర్శన్ 49 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక అతడికి తోడు షారుఖ్ ఖాన్ 30 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 58 రన్స్ చేశాడు. కాగా.. ఈ మ్యాచ్ లో బుమ్రాను మరిపిస్తూ.. మైండ్ బ్లోయింగ్ యార్కర్ తో షారుఖ్ ను అవుట్ చేశాడు మహ్మద్ సిరాజ్.

క్రికెట్ చరిత్రలో యార్కర్ల కింగ్ గా పేరుగాంచాడు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా. తన పదునైన యార్కర్లతో ప్రత్యర్థి బ్యాటర్లను పల్టీలు కొట్టించడంలో బుమ్రా సిద్దహస్తుడు. అయితే బుమ్రాను మరిపించే యార్కర్ తో గుజరాత్ బ్యాటర్ ను పెవిలియన్ కు పంపాడు ఆర్సీబీ స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్. ఈ మ్యాచ్ లో 30 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 58 రన్స్ చేసి మంచి ఊపుమీదున్నాడు షారుఖ్ ఖాన్. అయితే ఇన్నింగ్స్ 15వ ఓవర్ వేయడానికి వచ్చాడు సిరాజ్. ఈ ఓవర్ తొలి బాల్ నే కళ్లు చెదిరే యార్కర్ గా సంధించాడు.

కాగా.. ఆ యార్కర్ ను ఆడలేకపోయిన షారుఖ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కొద్దిసేపు బ్యాటర్ కు ఏం అర్ధం కాలేదు.. కళ్లు బైర్లుకమ్మాయి. అలాంటి యార్కర్ ను వేశాడు సిరాజ్. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. షారుఖ్ అవుట్ అయిన తర్వాత మరింతగా రెచ్చిపోయి ఆడాడు సాయి సుదర్శన్. దీంతో గుజరాత్ 200 పరుగుల భారీ స్కోర్ ను సాధించగలిగింది. మరి జస్ప్రీత్ బుమ్రాను తలపిస్తూ.. మైండ్ బ్లోయింగ్ యార్కర్ వేసిన మహ్మద్ సిరాజ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.