Nidhan
ఐపీఎల్-2024 ఆరంభానికి ముందు తన అభిమానులకు విరాట్ కోహ్లీ ఓ రిక్వెస్ట్ చేశాడు. ఇక మీదట తనను అలా పిలవొద్దని కోరాడు.
ఐపీఎల్-2024 ఆరంభానికి ముందు తన అభిమానులకు విరాట్ కోహ్లీ ఓ రిక్వెస్ట్ చేశాడు. ఇక మీదట తనను అలా పిలవొద్దని కోరాడు.
Nidhan
ఐపీఎల్-2024 సీజన్ ఆరంభానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అన్‌బాక్స్ ఈవెంట్‌ను నిర్వహించింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ అయింది. వేలాది మంది ఆర్సీబీ అభిమానులు మైదానానికి పోటెత్తారు. తమ అభిమాన క్రికెటర్లను చూసేందుకు స్టేడియం బయట కూడా భారీగా జనం క్యూ కట్టారు. స్మృతి సేన విమెన్స్ ప్రీమియర్ లీగ్ టైటిల్ నెగ్గడం, విరాట్ కోహ్లీ చాన్నాళ్ల తర్వాత దర్శనమివ్వడంతో ఆర్సీబీ అన్‌బాక్స్ ఈవెంట్‌కు ఎప్పుడూ లేనంత హైప్ నెలకొంది. ఈ కార్యక్రమంలో కొత్త జెర్సీని ఆవిష్కరించడంతో పాటు జట్టుకు కొత్త పేరును కూడా ప్రకటించారు. అలాగే డబ్ల్యూపీఎల్ కప్పు కొట్టిన విమెన్స్ టీమ్‌ను సత్కరించారు. అయితే ఈ ప్రోగ్రామ్‌లో మాట్లాడుతూ విరాట్ కోహ్లీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
దయచేసి తనను అలా పిలవొద్దంటూ కోహ్లీ అభిమానులకు రిక్వెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అసలు విరాట్ ఏమని పిలవొద్దన్నాడో ఇప్పుడు చూద్దాం.. ఆర్సీబీ అన్‌బాక్స్ ఈవెంట్లో కోహ్లీ న్యూ లుక్‌లో మెస్మరైజ్ చేశాడు. కొత్త హెయిర్‌స్టైల్‌లో అచ్చం హాలీవుడ్ హీరోలా ఎంట్రీ ఇచ్చాడు. కప్పు కొట్టిన స్మృతి సేనకు గ్రాండ్‌గా గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చాడు. ఆ తర్వాత సహచర ఆటగాళ్లతో కలసి నవ్వుతూ, ముచ్చటిస్తూ సందడి చేశాడు. జెర్సీ ఆవిష్కరణ సమయంలో అతడ్ని వేదిక మీదకు పిలిచారు. అక్కడికి వచ్చిన విరాట్ అభిమానులకు స్పెషల్ రిక్వెస్ట్ చేశాడు. తనను కింగ్ అని పిలవొద్దని వాళ్లను కోరాడు. జస్ట్ విరాట్ అని పిలిస్తే చాలు అని చెప్పాడు.
స్టేజీ మీదకు వచ్చిన కోహ్లీకి ఓ ప్రశ్న ఎదురైంది. కింగ్‌లా ఉండటం ఎలా అనిపిస్తోంది అని యాంకర్ అడిగారు. దీంతో స్టేడియంలోని ఫ్యాన్స్ అంతా ‘కోహ్లీ.. కోహ్లీ’ అంటూ గట్టిగా అరిచారు. దీనికి అతడు రియాక్ట్ అయ్యాడు. ‘ఆడియెన్స్ అంతా కాస్త నిశ్శబ్దంగా ఉండాలి. మేం ఇక్కడి నుంచి త్వరగా చెన్నైకి బయల్దేరాలి. నన్ను మీరంతా కింగ్ అని పిలిచినప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. దయచేసి నన్ను విరాట్ అని పిలవండి’ అని కోహ్లీ కోరాడు. అయితే కింగ్ అని పిలవొద్దని అతడు సీరియస్‌గా అనలేదు. ఫ్యాన్స్ నొచ్చుకుంటారనే ఉద్దేశంతో కూల్‌గా, నవ్వుతూ చెప్పాడు. విరాట్ అనే పిలుపు తనకు ఇష్టమని వాళ్లకు అర్థమయ్యేలా పేర్కొన్నాడు. కోహ్లీ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీన్ని చూసిన నెటిజన్స్.. ఇక మీదట విరాట్ అనే పిలుస్తామని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. తనను కింగ్ అని పిలవకండి అంటూ కోహ్లీ చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్‌ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Question – how’s the King feeling?
– The crowd erupts and chants ‘Kohli, Kohli’.
Virat Kohli – guys, you all need to calm, we’ve to get to Chennai pretty quickly (smiles). I feel embarrassed when you refer me as the king, just tell me Virat. pic.twitter.com/GBA2B75mwe
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 19, 2024