iDreamPost
android-app
ios-app

కప్పుతో స్మృతి సేన ఎంట్రీ.. గార్డ్ ఆఫ్ హానర్ ఇస్తూ.. కోహ్లీ ఆనందం!

  • Published Mar 19, 2024 | 8:22 PM Updated Updated Mar 19, 2024 | 8:22 PM

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా అన్​బాక్స్​ ఈవెంట్​ను గ్రాండ్​గా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో స్మృతి సేనతో పాటు మెన్స్ టీమ్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచాడు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా అన్​బాక్స్​ ఈవెంట్​ను గ్రాండ్​గా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో స్మృతి సేనతో పాటు మెన్స్ టీమ్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచాడు.

  • Published Mar 19, 2024 | 8:22 PMUpdated Mar 19, 2024 | 8:22 PM
కప్పుతో స్మృతి సేన ఎంట్రీ.. గార్డ్ ఆఫ్ హానర్ ఇస్తూ.. కోహ్లీ ఆనందం!

విమెన్స్ ప్రీమియర్ లీగ్-2024​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాజిక్ చేసింది. డబ్ల్యూపీఎల్ మొదటి సీజన్​లో దారుణంగా ఫెయిలై పాయింట్స్ టేబుల్​లో దిగువన నిలిచింది ఆర్సీబీ. కానీ రెండో సీజన్​లో మాత్రం ఏకంగా కప్పు కొట్టేసింది. దీంతో ఆ టీమ్​ను అందరూ మెచ్చుకుంటున్నారు. కెప్టెన్​గా టీమ్​ను ముందుండి నడిపిన స్మృతి మంధానతో పాటు టోర్నీలో ఆల్​రౌండ్ పెర్ఫార్మెన్స్​తో అదరగొట్టిన ఎలిస్ పెర్రీని అందరూ పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. వాళ్ల వల్లే టీమ్ కప్పు కొట్టిందని అంటున్నారు. అయితే ఆర్సీబీ విమెన్స్ టీమ్​కు ఊహించని స్వాగతం లభించింది. బెంగళూరు ఫ్రాంచైజీ మంగళవారం అన్​బాక్స్ ఈవెంట్ నిర్వహించింది. ఇందులో స్మృతి సేనకు ఆర్సీబీ మెన్స్ టీమ్ గార్డర్ ఆఫ్ హానర్​తో సత్కరించింది.

ఆర్సీబీ అన్​బాక్స్ ఈవెంట్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇవాళ ఘనంగా జరిగింది. వేలాది మంది ప్రేక్షకుల నడుమ ట్రోఫీని చేత పట్టుకొని స్మృతి మంధాన, ఇతర విమెన్స్ టీమ్ మెంబర్స్ అంతా సగర్వంగా గ్రౌండ్​లోకి అడుగుపెట్టారు. ఆ సమయంలో పురుషుల జట్టు సభ్యులు రెండు వైపులా నిలబడి చప్పట్లతో వారికి స్వాగతం పలికారు. విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్​వెల్ కూడా గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చారు. ఆ సమయంలో కోహ్లీ సహచరులతో కలసి నవ్వులు చిందించాడు. ఊహించని విధంగా వెల్​కమ్ ఇవ్వడంతో స్మృతి సేన సంతోషంలో మునిగిపోయింది. ఒకవైపు మెన్స్ టీమ్స్ ప్లేయర్లు గార్డ్ ఆఫ్​ హానర్ ఇవ్వడం, మరోవైపు స్టేడియంలోని ప్రేక్షకులు చప్పట్లు, విజిల్స్​తో సందడి చేయడంతో వాళ్ల ఆనందానికి హద్దే లేకుండా పోయింది.

RCB

అన్​బాక్స్ ఈవెంట్​కు విమెన్స్ టీమ్ ప్లేయర్స్ అంతా బ్లాక్ కలర్ ప్యాంట్, టీ షర్ట్​లో దర్శనమిచ్చారు. స్మృతి మంధాన కప్పు పట్టుకొని గ్రౌండ్​లోకి ఎంట్రీ ఇవ్వగా.. మిగిలిన సభ్యులంతా ఆమెను ఫాలో అయ్యారు. మెన్స్ క్రికెటర్లు కొత్త జెర్సీని ధరించి స్టేడియానికి వచ్చారు. కొడుకు పుట్టడంతో కొన్నాళ్లుగా లండన్​లోనే ఉంటూ క్రికెట్​కు దూరంగా ఉండిపోయిన కోహ్లీ.. చాన్నాళ్ల తర్వాత గ్రౌండ్​లో కనిపించడంతో ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. కోహ్లీ.. కోహ్లీ అంటూ గట్టిగా అరుస్తూ అతడ్ని ఎంకరేజ్ చేశారు. అన్​బాక్స్ ఈవెంట్ మొత్తం విరాట్ నవ్వుతూ, టీమ్​మేట్స్​తో ఫన్నీగా ఉంటూ ఆహ్లాదంగా కనిపించాడు. దీంతో కోహ్లీ ఈజ్ బ్యాక్.. ఈ సీజన్​లో ప్రత్యర్థులకు ఇచ్చి పడేస్తాడు అని ఫ్యాన్స్ అంటున్నారు. మరి.. ఆర్సీబీ విమెన్స్ టీమ్​కు డుప్లెసిస్ సేన గార్డ్ ఆఫ్​ హానర్ ఇవ్వడంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: హార్దిక్ పాండ్యా పరువు తీసేలా నెహ్రా కామెంట్స్! బాగా కసిగా ఉన్నాడు!