RCB ఓపెనింగ్ జోడీలో మార్పు! ఏకంగా కోహ్లీ ఆర్డర్ మార్చేశారు!

డబ్ల్యూపీఎల్ టైటిల్ సొంతమవడంతో ఆర్సీబీ ఫుల్ జోష్​లో ఉంది. ఇదే ఊపులో పురుషుల జట్టు ఐపీఎల్ ట్రోఫీని కొడితే బాగుండని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో క్యాష్ రిచ్ లీగ్​కు రెడీ అవుతున్న బెంగళూరు.. ఈసారి ఏకంగా విరాట్ కోహ్లీ ఆర్డర్ మార్చేసింది.

డబ్ల్యూపీఎల్ టైటిల్ సొంతమవడంతో ఆర్సీబీ ఫుల్ జోష్​లో ఉంది. ఇదే ఊపులో పురుషుల జట్టు ఐపీఎల్ ట్రోఫీని కొడితే బాగుండని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో క్యాష్ రిచ్ లీగ్​కు రెడీ అవుతున్న బెంగళూరు.. ఈసారి ఏకంగా విరాట్ కోహ్లీ ఆర్డర్ మార్చేసింది.

విమెన్స్ ప్రీమియర్ లీగ్-2024 ముగిసింది. ఈసారి ట్రోఫీని అనూహ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎగరేసుకుపోయింది. ఫైనల్ మ్యాచ్​లో ఢిల్లీ క్యాపిటల్స్​ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసిన స్మృతి సేన.. కొత్త ఛాంపియన్​గా అవతరించింది. ఆర్సీబీ ఫ్రాంచైజీని ఊరిస్తున్న టైటిల్​ను ఎట్టకేలకు అందించింది మహిళల టీమ్. అయితే ఇదే స్ఫూర్తిగా ఇప్పుడు పురుషుల టీమ్ ఐపీఎల్​లో చెలరేగాలని చూస్తోంది. క్యాష్ రిచ్ లీగ్ కొత్త సీజన్​కు మరో నాల్రోజుల సమయమే మిగిలి ఉంది. దీంతో బెంగళూరు జట్టు ప్రాక్టీస్​లో మునిగిపోయింది. ఆ టీమ్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా లండన్ నుంచి వచ్చేశాడు. మహిళల్లాలే పురుషుల టీమ్ కూడా కప్పు కల నిజం చేసుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ ఓపెనింగ్ జోడీ సహా టీమ్ కాంబినేషన్​లో పలు మార్పులు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

ఐపీఎల్-2024 ఫస్ట్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్​కు ఆర్సీబీకి మధ్య జరగనుంది. ఈ మ్యాచ్​ ఇరు జట్లకు మొదటిది కానుంది. దీంతో దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈ మ్యాచ్​లో ఓపెనింగ్ జోడీతో పాటు బౌలింగ్ యూనిట్​లోనూ పలు కీలక మార్పులు చేయనుందట బెంగళూరు. గత సీజన్​లో కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్​తో కలసి సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేశాడు. ఈ జోడీ సూపర్బ్ స్టార్ట్స్ ఇస్తూ భారీ స్కోర్లకు పునాదులు వేసింది. అయితే ఈసారి కోహ్లీ-డుప్లెసిస్ ఓపెనింగ్ చేయరని తెలుస్తోంది. స్టార్ ఆల్​రౌండర్ కామెరాన్ గ్రీన్​తో కలసి ఫాఫ్ ఇన్నింగ్స్​ను స్టార్ట్ చేస్తాడని వినికిడి. ఆ తర్వాత ఫస్ట్ డౌన్​లో కోహ్లీ, సెకండ్ డౌన్​లో రజత్ పాటిదార్ వస్తారని క్రికెట్ వర్గాల సమాచారం. 5వ స్థానంలో గ్లెన్ మాక్స్​వెల్, అనంతరం ఫినిషర్లుగా మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్ ఆడతారని టాక్ నడుస్తోంది.

ఆర్సీబీ పేస్ బౌలింగ్ యూనిట్​ను స్టార్ స్పీడ్​స్టర్ మహ్మద్ సిరాజ్ ముందుండి నడిపించనున్నాడు. అతడితో పాటు ఇంగ్లండ్​ సిరీస్​లో అదరగొట్టిన ఆకాశ్ దీప్, అల్జారీ జోసెఫ్ పేస్ బాధ్యతల్ని పంచుకుంటారు. ఫస్ట్ ఛాయిస్ స్పిన్నర్​గా కర్ణ్ శర్మ ఉంటాడు. ఫినిషర్ రోల్ నిర్వహించే డీకే.. వికెట్ కీపింగ్ రెస్పాన్సిబిలీటీ కూడా చూసుకుంటాడు. అయితే కోహ్లీ ఓపెనింగ్ పొజిషన్ నుంచి ఫస్ట్ డౌన్​కు రానున్నాడనేది చర్చనీయాంశంగా మారింది. దీనికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. జూన్​లో టీ20 వరల్డ్ కప్​ జరగనుంది. మెగాటోర్నీలో ఎలాగూ ఫస్ట్ డౌన్​లోనే ఆడతాడు విరాట్. కాబట్టి ఇక్కడ కూడా అదే పొజిషన్​లో ఆడుతూ ప్రపంచ కప్ స్టార్ట్ అయ్యే వరకు మంచి ఊపులోకి రావాలనేది అతడి ప్లాన్ అని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు.

ఓపెనర్​గా ఆడితే ఫ్రాంచైజీకి ప్లస్ అవుతుంది. కానీ ఫస్ట్ డౌన్​లో ఆడితే టీమిండియాకు పెద్ద బెనిఫిట్ అవుతుంది. కాబట్టి ఓపెనింగ్​ పొజిషన్​ను విరాట్ త్యాగం చేశాడని వినిపిస్తోంది. అయితే గ్రీన్ ఓపెనర్​గా రాణిస్తుండటం, ఫామ్​లో ఉండటంతో అతడి కోసమే కోహ్లీని బ్యాటింగ్ ఆర్డర్​లో కిందకు దించారని రూమర్స్ వస్తున్నాయి. అయితే కోహ్లీ ఎగ్జాక్ట్​గా ఏ ప్లేస్​లో బ్యాటింగ్​కు దిగుతాడనేది మాత్రం సీఎస్​కే మ్యాచ్​తోనే స్పష్టత రానుంది. మరి.. విరాట్ ఏ పొజిషన్​లో బ్యాటింగ్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: RCB పేరు మార్పు? IPL 2024 ప్రారంభానికి ముందు..

Show comments