iDreamPost
android-app
ios-app

RCB పేరు మార్పు? IPL 2024 ప్రారంభానికి ముందు..

  • Published Mar 18, 2024 | 1:33 PM Updated Updated Mar 18, 2024 | 1:33 PM

RCB, IPL 2024: ఐపీఎల్‌ 2024 సీజన్‌ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే.. ఈ సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు పేరు మార్పుతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. అందుకు ఒక వీడియో కూడా రిలీజ్‌ చేశారు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

RCB, IPL 2024: ఐపీఎల్‌ 2024 సీజన్‌ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే.. ఈ సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు పేరు మార్పుతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. అందుకు ఒక వీడియో కూడా రిలీజ్‌ చేశారు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 18, 2024 | 1:33 PMUpdated Mar 18, 2024 | 1:33 PM
RCB పేరు మార్పు? IPL 2024 ప్రారంభానికి ముందు..

ఐపీఎల్‌ 17వ సీజన్‌ కోసం క్రికెట్‌ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 22 నుంచి ఐపీఎల్‌ 2024 సీజన్‌ ప్రారంభం కానుంది. మరో నాలుగు రోజుల్లో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తొలి మ్యాచ్‌లో పోటీ పడనుంది. ఇప్పటికే ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఆర్సీబీ టీమ్‌ కప్పు కొట్టడంతో ఆర్సీబీ ఫ్యాన్స్‌ అంతా ఫుల్‌ ఖుషీగా ఉన్నారు. అయితే.. ఐపీఎల్‌ 2024కి ముందు ఆర్సీబీ ఊహించని నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదేంటంటే.. రాబోయే సీజన్‌లో పేరు మార్చుకుని ఆర్సీబీ బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్‌ 2024 సీజన్‌ కోసం అన్ని జట్లు సంసిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే చాలా టీమ్స్‌ తమ కొత్త జెర్సీలను సైతం రివీల్‌ చేశాయి. అయితే.. అన్ని టీమ్స్‌ కంటే ఎక్కువ క్రేజ్‌ ఉన్న ఆర్సీబీ ఈ నెల 19న అన్‌బాక్స్‌ కార్యక్రమం నిర్వహించనుంది. అయితే.. ఈ కార్యక్రమానికి ముందు ఆర్సీబీ ఒక వీడియోను రిలీజ్‌ చేసింది. ఆ వీడియోలో ప్రముఖ హీరోయిన్‌ రష్మికా మంధాన కనిపిస్తూ.. క్యారవాన్‌లోకి వెక్కి.. అద్దంపై రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు అని రాసి ఉంటే అందులో.. బెంగళూరు అనే పదాన్ని నోటితో ఊది చెరిపేసింది.

రష్మికా అలా ఎందుకు చేసిందో చెప్పాలంటూ కూడా ఆర్సీబీ తమ అభిమానులను కోరింది. అయితే.. దీనిపై క్రికెట్‌ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ రాయల్‌ చాలెంజర్స్‌ పేరులో బెంగళూరు అనే పదం తొలగిస్తున్నారా? లేక అసలు పూర్తిగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు పేరును మార్చేసి.. కొత్త పేరుతో బరిలోకి దిగుతున్నారా? అనే అనుమానాలు అభిమానుల్లో వ్యక్తం అవుతున్నాయి. అయితే.. ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం మంగళవారం జరిగే అన్‌బాక్స్‌ ప్రొగ్రామ్‌తో దొరకనుంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet