Somesekhar
రాజస్తాన్ రాయల్స్ పై ఆర్సీబీ ఓటమికి కారణం విరాట్ కోహ్లీ స్లో బ్యాటింగ్, బట్లర్ సెంచరీ చేయడమని అందరూ అనుకుంటున్నారు. కానీ ఈ ఓటమికి కారణం వీరు కాదని, కేవలం అతడి వల్లే ఓడిపోయామని కెప్టెన్ డుప్లెసిస్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
రాజస్తాన్ రాయల్స్ పై ఆర్సీబీ ఓటమికి కారణం విరాట్ కోహ్లీ స్లో బ్యాటింగ్, బట్లర్ సెంచరీ చేయడమని అందరూ అనుకుంటున్నారు. కానీ ఈ ఓటమికి కారణం వీరు కాదని, కేవలం అతడి వల్లే ఓడిపోయామని కెప్టెన్ డుప్లెసిస్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
Somesekhar
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ను 6 వికెట్ల తేడాతో ఓడించింది రాజస్తాన్ రాయల్స్. ఆర్సీబీ నిర్ధేశించిన 184 పరుగుల లక్ష్యాన్ని మరో 5 బంతులు ఉండగానే కొట్టేసింది రాజస్తాన్ టీమ్. ఇక ఈ మ్యాచ్ లో రెండు సెంచరీలు నమోదు కాగా.. ఒకటి విరాట్ కోహ్లీ, మరోటి జోస్ బట్లర్ బాదాడు. అయితే ఆర్సీబీ ఓటమికి అందరూ బట్లర్ కారణమని అనుకుంటున్నారు. కానీ తమ ఓటమికి అతడు కారణం కాదని, మా టీమ్ లోని ఓ ప్లేయరే మా పరాజయానికి కారణమైయ్యాడని షాకింగ్ కామెంట్స్ చేశాడు కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్.
రాజస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ ఓటమికి చాలా మంది విరాట్ కోహ్లీ స్లో బ్యాటింగ్, బట్లర్ సెంచరీ కారణమని అనుకుంటున్నారు. కానీ ఈ మ్యాచ్ లో మా పరాజయానికి కారణం అతడే అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు కెప్టెన్ డుప్లెసిస్. ఓటమిపై నోరు తెరిచిన డుప్లెసిస్ ఏమన్నాడంటే? ” ఈ పిచ్ పై 190కి పైగా స్కోర్ చేస్తే బాగుంటుందని అనుకున్నాం. కానీ తొలి ఇన్నింగ్స్ లో పిచ్ బ్యాటింగ్ కు పూర్తిగా అనుకూలించలేదు. పైగా మేం కనీసం ఇంకో 15 రన్స్ చేస్తే ఫలితం వేరే విధంగా ఉండేదేమో. ఇక మా ఓటమికి ప్రధాన కారణం ఆరో ఓవర్లో 20 పరుగులు ఇచ్చుకోవడమే. తొలి నాలుగు ఓవర్లు మేం అద్బుతంగా కట్టడి చేశాం. కానీ 6వ ఓవర్ తర్వాత మ్యాచ్ పూర్తిగా మారిపోయింది. మా ఫీల్డింగ్ కూడా నామమాత్రంగానే ఉంది. నెక్ట్స్ మ్యాచ్ లో పుంజుకోవడానికి ప్రయత్నిస్తాం” అని చెప్పుకొచ్చాడు డుప్లెసిస్.
కాగా.. ఈ మ్యాచ్ లో 6వ ఓవర్ వేసింది మయాంక్ దాగర్. ఈ ఓవర్లో 20 పరుగులు పిండుకున్నారు రాజస్తాన్ బ్యాటర్లు. దీంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయిందని పేర్కొన్నాడు డుప్లెసిస్. ఇక ఇక్కడి నుంచి రెచ్చిపోయిన ఆర్ఆర్ బ్యాటర్లను ఏ దశలోనూ ఆపలేకపోయామని తెలిపాడు. ఎక్కువ మంది కుడిచేతి వాటం బ్యాటర్లు ఉండటంతోనే మాక్స్ వెల్ తో బౌలింగ్ వేయించలేదని ఆర్సీబీ కెప్టెన్ తెలిపాడు. మరి మయాంక్ దాగర్ వేసిన ఓవర్ వల్లే మ్యాచ్ లో ఓడిపోయామని చెప్పిన డుప్లెసిస్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.