iDreamPost

RCB vs RR మ్యాచ్ లో అశ్విన్ ను ఆట పట్టించిన విరాట్.. కోహ్లీ టీజింగ్ నెక్ట్స్ లెవల్..

రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ తనలో ఉన్న హాస్యచతురతను మరోసారి బయటపెట్టాడు. రవిచంద్రన్ అశ్విన్ ను నెక్ట్స్ లెవల్లో టీజ్ చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ తనలో ఉన్న హాస్యచతురతను మరోసారి బయటపెట్టాడు. రవిచంద్రన్ అశ్విన్ ను నెక్ట్స్ లెవల్లో టీజ్ చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

RCB vs RR మ్యాచ్ లో అశ్విన్ ను ఆట పట్టించిన విరాట్.. కోహ్లీ టీజింగ్ నెక్ట్స్ లెవల్..

ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తూ దూసుకెళ్తోంది ఐపీఎల్ 2024 సీజన్. మ్యాచ్ జరుగుతున్న కొద్ది టోర్నీ రసవత్తరంగా మారుతూ వస్తోంది. అయితే మ్యాచ్ లు జరిగే సమయంలో కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ జరుగుతూ ఉంటాయి. వాటిని మనం చూసినప్పుడు పెద్దగా పట్టించుకోం. ఆ తర్వాత అవే దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటాయి. తాజాగా ఆర్సీబీ-ఆర్ఆర్ మ్యాచ్ లో కూడా ఇలాంటి ఓ ఫన్నీ ఇన్సిడెంటే జరిగింది. రాజస్తాన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ను ఆటపట్టించాడు కింగ్ కోహ్లీ. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

విరాట్ కోహ్లీ.. గ్రౌండ్ లో ఎంత అగ్రెసివ్ గా ఉంటాడో, అంతే ఫన్నీగా ఉంటాడు. ఇక జూనియర్లను ఓ రేంజ్ లో టీజ్ చేస్తూ నవ్వులు పూయిస్తుంటాడు రన్ మెషిన్. తన సహచర క్రికెటర్లను ఇమిటేట్ చేస్తూ.. గ్రౌండ్ లో కామెడీ చేస్తుంటాడు. తాజాగా రాజస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో సైతం రవిచంద్రన్ అశ్విన్ నెక్ట్స్ లెవల్లో టీజ్ చేశాడు. అసలేం జరిగిందంటే? ఈ మ్యాచ్ లో ఇన్నింగ్స్ 7వ ఓవర్ వేయడానికి వచ్చాడు అశ్విన్. ఈ ఓవర్ లో రెండో బంతిని అశ్విన్ లెగ్ సైడ్ వైపు వైడ్ గా వేశాడు. అయితే వెంటనే కోహ్లీ కాస్త వంగినట్లు చేశాడు.

కాగా.. గతంలో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో పాక్ బౌలర్ కూడా ఇలాగే వైడ్ వేస్తే.. అశ్విన్ అలాగే నిలబడ్డాడు. ఈ మ్యాచ్ లో అతడి బౌలింగ్ లోనే అచ్చం అలాగే విరాట్ కోహ్లీ కూడా చేసి.. అశ్విన్ ను నెక్ట్స్ లెవల్లో టీజ్ చేశాడు. ఈ సీన్ కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కోహ్లీ కామెడీ టైమింగ్ కు ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. విరాట్ భాయ్ ఇన్ని ఎలా గుర్తుపెట్టుకుంటావ్ అని సరదాగా ప్రశ్నిస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆర్సీబీ నిర్దేశించిన 184 పరుగుల టార్గెట్ ను మరో 5 బంతులు ఉండగానే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. జోస్ బట్లర్ వీరోచిత శతకంతో రాజస్తాన్ కు అద్భుత విజయాన్ని అందించాడు. మరి అశ్విన్ ను కోహ్లీ టీజ్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Middle stump Cricket (@middle.stump.cric)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి