SRH vs RR: రాజస్తాన్ తో మ్యాచ్.. SRHను భయపెడుతున్న ఆ రికార్డ్స్!

SRH vs RR: రాజస్తాన్ తో మ్యాచ్.. SRHను భయపెడుతున్న ఆ రికార్డ్స్!

క్వాలిఫయర్ 2లో భాగంగా రాజస్తాన్ ను ఢీకొనబోతోంది సన్ రైజర్స్ హైదరాబాద్. అయితే ఈ మ్యాచ్ కు ముందు SRH ను, ఫ్యాన్స్ ను ఓ భయం పట్టుకుంది. ఆ భయం ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..

క్వాలిఫయర్ 2లో భాగంగా రాజస్తాన్ ను ఢీకొనబోతోంది సన్ రైజర్స్ హైదరాబాద్. అయితే ఈ మ్యాచ్ కు ముందు SRH ను, ఫ్యాన్స్ ను ఓ భయం పట్టుకుంది. ఆ భయం ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..

ఐపీఎల్ 2024 ముగింపు దశకు చేరుకుంది. ఈ సీజన్ లో ఇంకా రెండు మ్యాచ్ లే మిగిలి ఉన్నాయి. అందులో భాగంగా క్వాలిఫయర్ 2లో రాజస్తాన్ రాయల్స్ ను ఢీ కొనేందుకు సిద్దమైంది సన్ రైజర్స్ హైదరాబాద్. ఇక ఈ మ్యాచ్ లో గెలిచి.. ఫైనల్లోకి ప్రవేశించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో SRH టీమ్ ను ఓ భయం పట్టుకుంది. దాంతో హైదరాబాద్ ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మరి ఇంతకీ సన్ రైజర్స్ ను భయపెడుతున్న ఆ భయం ఏంటి? తెలుసుకుందాం పదండి.

ఐపీఎల్ లో మరో కీలక మ్యాచ్ కు రంగం సిద్దమైంది. క్వాలిఫయర్ 2 మ్యాచ్ లో ఫైనల్లోకి అడుగుపెట్టేందుకు అమీతుమీ తేల్చుకోనున్నాయి రాజస్తాన్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్స్. ఎలాగైనా ఈ మ్యాచ్ లో గెలిచి.. ఫైనల్ కు చేరాలని ఇరు జట్లు ఆరాటపడుతున్నాయి. ఈ క్రమంలో SRH ఫ్యాన్స్ ను చెపాక్ రికార్డ్స్ కలవరపెడుతున్నాయి. దాంతో ఈ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు ఇక గెలిచినట్లే అంటూ నిట్టూరుస్తున్నారు హైదరాబాద్ ఫ్యాన్స్. ఇంతకీ ఆ రికార్డ్స్ ఏంటంటే?

చెన్నై చెపాక్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కు ఘోరమైన రికార్డ్స్ ఉన్నాయి. ఈ గ్రౌండ్ లో ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్ ల్లో కేవలం ఒకే ఒక్క మ్యాచ్ గెలిచింది. ఎనిమిది మ్యాచ్ ల్లో ఓడి.. ఓ మ్యాచ్ ను టై చేసుకుంది. ఈ గణాంకాలే ఇప్పుడు హైదరాబాద్ ఫ్యాన్స్ ను కలవరపెడుతున్నాయి. అదీకాక చెపాక్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. కానీ SRHకు స్టార్ స్పిన్నర్ లేకపోవడం పెద్ద లోపంగా మారింది. వానిందు హసరంగా ప్లేస్ లో వచ్చిన విజయ్ కాంత్ విస్కాంత్ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. మరోవైపు రాజస్తాన్ జట్టులో రవిచంద్రన్ అశ్విన్, యజ్వేంద్ర చాహల్ లాంటి వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు ఉండటంతో హైదరాబాద్ కు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments