iDreamPost

SRH vs RR: మరోసారి అంబటి రాయుడు నోటిదురుసు.. ఫైర్ అవుతున్న SRH ఫ్యాన్స్!

సన్ రైజర్స్ పై తన కోపాన్ని బయటపెట్టాడు టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు. దాంతో SRH ఫ్యాన్స్ రాయుడుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరిగిందంటే?

సన్ రైజర్స్ పై తన కోపాన్ని బయటపెట్టాడు టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు. దాంతో SRH ఫ్యాన్స్ రాయుడుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరిగిందంటే?

SRH vs RR: మరోసారి అంబటి రాయుడు నోటిదురుసు.. ఫైర్ అవుతున్న SRH ఫ్యాన్స్!

అంబటి రాయుడు.. గత కొన్ని రోజులుగా తరచుగా వార్తల్లో నిలుస్తున్నాడు. ఆర్సీబీపై, విరాట్ కోహ్లీపై తన అక్కసును వెళ్లగక్కుతూ.. వివాదాస్పద కామెంట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. సీఎస్కేను ఓడించినంత మాత్రానా ఐపీఎల్ టైటిల్ గెలిచినట్లు కాదు, వేడుకల కోసం, అగ్రెషన్ తో ట్రోఫీలు గెలవలేరు అంటూ కోహ్లీని టార్గెట్ చేసి రాయులు పెద్ద వివాదానికి తెరలేపాడు. ఇక ఇప్పుడు సన్ రైజర్స్ పై తన కోపాన్ని బయటపెట్టాడు. దాంతో SRH ఫ్యాన్స్ రాయుడుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరిగిందంటే?

ఐపీఎల్ 2024లో భాగంగా శుక్రవారం(మే 24)న క్వాలిఫయర్ 2లో రాజస్తాన్ రాయల్స్ తో అమీతుమీ తేల్చుకోనుంది సన్ రైజర్స్ హైదరాబాద్. ఆర్ఆర్ ను ఓడించి ఫైనల్ కు చేరాలని SRH భావిస్తున్న తరుణంలో టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. అతడి వ్యాఖ్యలపై సన్ రైజర్స్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. RR vs SRH మ్యాచ్ సందర్భంగా అంబటి రాయుడు మాట్లాడుతూ..

“క్వాలిఫయర్ 2 మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కంటే రాజస్తాన్ హాట్ ఫేవరెట్ గా కనిపిస్తోంది. వాళ్లు ఇక్కడి దాకా వచ్చిన తీరు అద్భుతం. పైగా చెన్నై పిచ్ రాజస్తాన్ స్పిన్నర్లకు బాగా అనుకూలిస్తుంది. కాబట్టి హైదరాబాద్ బ్యాటర్లు తమ బుర్రలకు పదును బాగా పెట్టి బ్యాటింగ్ చేయాలి. అది మీ హోం గ్రౌండ్ కాదు.. మీరు వికెట్లు తీయలేరు. అందుకే బ్యాటింగ్ పై దృష్టి పెట్టి భారీ స్కోర్ సాధించాలి. ఇక చివరిగా ఈ మ్యాచ్ లో హైదరాబాద్ కంటే రాజస్తాన్ కే ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయి” అంటూ చెప్పుకొచ్చాడు అంబటి రాయుడు.

ప్రస్తుతం రాయుడు చేసిన కామెంట్స్ వైరల్ కావడంతో.. సన్ రైజర్స్ ఫ్యాన్స్ అతడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక తెలుగు వాడివి అయ్యుండి సొంత టీమ్ కు సపోర్ట్ చేయకుండా.. రాజస్తాన్ గెలుస్తుందని ఎలా చెబుతావు అంటూ ఫైర్ అవుతున్నారు. హైదరాబాద్ ప్లేయర్లను తక్కువ చేసి మాట్లాడటం సరికాదు అంటూ తిట్టిపోస్తున్నారు. ఆర్ఆర్ కంటే ఎక్కువ దూకుడుతో SRH టీమ్ ఆడుతున్న విషయాన్ని గుర్తు పెట్టుకో అని కౌంటర్లు వేస్తున్నారు. మరి రాయుడు వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి