RR vs MI: రాజస్తాన్ బౌలర్లను బెంబేలెత్తించిన నేహల్ వాధేర! కేవలం 24 బంతుల్లో..

జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో 23 ఏళ్ల యువ ముంబై బ్యాటర్ నేహల్ వాధేర చెలరేగాడు. ఈ సీజన్ లో ఆడుతుంది తొలి మ్యాచే అయినప్పటికీ.. ఎలాంటి భయం లేకుండా ప్రత్యర్థి బౌలర్లను బెంబేలెత్తించాడు.

జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో 23 ఏళ్ల యువ ముంబై బ్యాటర్ నేహల్ వాధేర చెలరేగాడు. ఈ సీజన్ లో ఆడుతుంది తొలి మ్యాచే అయినప్పటికీ.. ఎలాంటి భయం లేకుండా ప్రత్యర్థి బౌలర్లను బెంబేలెత్తించాడు.

రాజస్తాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ యంగ్ బ్యాటర్ చిచ్చరపిడుగులా చెలరేగాడు. తొలుత ఆర్ఆర్ నిప్పులు చెరిగే బంతులతో ముంబై బ్యాటర్లను పెవిలియన్ కు క్యూ కట్టించారు. ఒకవైపు బౌల్ట్, మరోవైపు సందీప్ శర్మ ముంబైని ఆదిలోనే కష్టాల్లోకి నెట్టారు. వీరిద్దరి ధాటికి ఒక దశలో 52 రన్స్ కే 4 కీలక వికెట్లు కోల్పోయింది. ఇలాంటి టైమ్ లో ఒకడొచ్చాడు క్రీజ్ లోకి. అతడే నేహల్ వాధేర. ఈ ఐపీఎల్ సీజన్ లో అతడికి ఇదే తొలి మ్యాచ్. కానీ వాధేర చెలరేగిన తీరు చూస్తే అలా అనిపించలేదు. ఫోర్లు, సిక్సర్లతో రాజస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.

రాజస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో 23 ఏళ్ల ముంబై బ్యాటర్ నేహల్ వాధేర మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 52 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో బ్యాటింగ్ కు వచ్చాడు వాధేర. అప్పటికే క్రీజ్ లో అర్ధసెంచరీతో ఆడుతున్న తిలక్ వర్మకు జత కలిశాడు. వీరిద్దరు 5వ వికెట్ కు 99 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో ముంబై ఓ మోస్తార్ స్కోర్ ను సాధించగలిగింది. మరీ ముఖ్యంగా వాధేర బ్యాటింగ్ చేసిన తీరు అద్భుతమనేచెప్పాలి. కేవలం 24 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 49 పరుగులు చేసి.. ఒక్క రన్ తో ఫిఫ్టీ మిస్ చేసుకున్నాడు.

ఈ సీజన్ లో వాధేరకి ఇదే తొలి మ్యాచ్ కావడం గమనార్హం. అలాంటి మెుదటి మ్యాచ్ లోనే 200కు పైగా స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు వాధేర. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా.. ఓ సీనియర్ ప్లేయర్ ఆడినట్లు ఆడాడు. దీంతో ముంబై నిర్ణీత20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 179 పరగులు చేసింది. తిలక్ వర్మ 45 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులతో 65 పరుగులు చేశాడు. రాజస్తాన్ బౌలర్లలో సందీప్ శర్మ 5 వికెట్లతో చెలరేగాడు. మరి ఈ సీజన్ లో ఆడుతున్న తొలి మ్యాచ్ లోనే 49 రన్స్ తో చెలరేగిన నేహల్ వాధేర బ్యాటింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments