iDreamPost

Yuzvendra Chahal: చరిత్ర సృష్టించిన చాహల్.. 17 ఏళ్ల IPL చరిత్రలో ఒకే ఒక్కడిగా..!

ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాజస్తాన్ స్టార్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. దీంతో 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన ఒకే ఒక్కడిగా నిలిచాడు.

ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాజస్తాన్ స్టార్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. దీంతో 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన ఒకే ఒక్కడిగా నిలిచాడు.

Yuzvendra Chahal: చరిత్ర సృష్టించిన చాహల్.. 17 ఏళ్ల IPL చరిత్రలో ఒకే ఒక్కడిగా..!

IPL 2024లో భాగంగా తాజాగా సవాయ్ మాన్ సింగ్ స్టేడియం జైపూర్ వేదికగా ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్ తలపడుతున్నాయి. ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబైకి రాజస్తాన్ బౌలర్లు తొలి ఓవర్లోనే షాకిచ్చారు. ఈ ఓవర్లో ట్రెంట్ బౌల్ట్ రోహిత్ శర్మ(6)ను తక్కువ పరుగులకే పెవిలియన్ కు పంపాడు. ఇక ఆ తర్వాత వచ్చిన సందీప్ శర్మ ఎంఐ టీమ్ ను కోలుకోలేని దెబ్బతీశాడు. ప్రస్తుతం జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆర్ఆర్ స్టార్ బౌలర్ యజ్వేంద్ర చాహల్ చరిత్ర సృష్టించాడు. తద్వారా 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన ఒకే ఒక్క ప్లేయర్ గా నిలిచాడు.

జైపూర్ వేదికగా రాజస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పీకల్లోతు కష్టాల్లో పడింది. 54 పరుగులకే 4 కీలక వికెట్లను కోల్పోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ముంబైకి ఊహించని షాకిచ్చారు ఆర్ఆర్ బౌలర్లు. రోహిత్ ను బౌల్ట్ అవుట్ చేస్తే.. ఇషాన్ కిషన్(0), సూర్యకుమార్ యాదవ్(10)లను సందీప్ శర్మ వెనక్కిపంపాడు. అయితే 17 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సుతో 23 పరుగులు చేసిన మహ్మద్ నబి మంచి టచ్ లో ఉన్నట్లు కనిపించాడు. కానీ యజ్వేంద్ర చాహల్ అద్భుతమైన బంతిని నబిని డ్రస్సింగ్ రూమ్ కు పంపాడు.

only one in 17 years of ipl

ఇక ఈ వికెట్ తీసుకోవడం ద్వారా ఐపీఎల్ లో సరికొత్త చరిత్ర నెలకొల్పాడు. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్ గా వరల్డ్ రికార్డు నెలకొల్పాడు చాహల్. ఇప్పటి వరకు ఏ బౌలర్ కూడా ఈ ఘనత సాధించలేదు. 153 ఐపీఎల్ మ్యాచ్ ల్లో 200 వికెట్లు పడగొట్టాడు చాహల్. ఇక ఈ లిస్ట్ లో రెండో ప్లేస్ లో ఉన్నాడు విండీస్ మాజీ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో. అతడు 161 మ్యాచ్ ల్లో 183 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత పియూష్ చావ్లా(181), భువనేశ్వర్ కుమార్(174), అమిత్ మిశ్రా(171) ఉన్నారు. ఇక ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్ ల్లో13 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ హోల్డర్ గా బుమ్రా, హర్షల్ పటేల్ తో నిలిచాడు. మరి చాహల్ సాధించిన ఈ రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి