Nidhan
టీమిండియా మాజీ క్రికెటర్ నవ్‌జోత్ సింగ్ సిద్ధూ గుడ్ న్యూస్ చెప్పాడు. అతడి రాక కోసం ఎదురు చూస్తున్న క్రికెట్ అభిమానులకు ఇది కిక్కెక్కించే వార్త అనే చెప్పాలి.
టీమిండియా మాజీ క్రికెటర్ నవ్‌జోత్ సింగ్ సిద్ధూ గుడ్ న్యూస్ చెప్పాడు. అతడి రాక కోసం ఎదురు చూస్తున్న క్రికెట్ అభిమానులకు ఇది కిక్కెక్కించే వార్త అనే చెప్పాలి.
Nidhan
నవ్‌జోత్ సింగ్ సిద్ధూ.. ఈ పేరు వింటే వెంటనే అందరికీ కామెంట్రీనే గుర్తుకొస్తుంది. టీమిండియా తరఫున సిద్ధూ ఎన్నో సంచలన ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ.. బ్యాటర్‌గా కంటే కామెంటేటర్‌గానే ఆయనకు ఎక్కువ గుర్తింపు దక్కింది. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కామెంటేటర్‌గా సెటిల్ అయిపోయాడు సిద్ధూ. హిందీ, పంజాబీ భాషల్ని మిక్స్ చేస్తూ ఆయన చేసే కామెంట్రీకి హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది. మ్యాచ్‌లోని సీరియస్ మూమెంట్స్‌ను ఆయన తన గాత్రంతో వివరిస్తుంటే ఒక్కోసారి గూస్బంప్స్ వచ్చేస్తాయి. అయితే చాన్నాళ్ల పాటు కామెంటేటర్‌గా ఉన్న ఈ సీనియర్ క్రికెటర్.. ఆ తర్వాత పాలిటిక్స్‌లోకి వెళ్లిపోయాడు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పంజాబ్ రాజకీయాల్లో చక్రం తిప్పాడు. అలాంటి సిద్ధూ క్రికెట్ ఫ్యాన్స్‌కు తాజాగా గుడ్ న్యూస్ చెప్పాడు.
సిద్ధూ మళ్లీ వచ్చేస్తున్నాడు. ఔను, క్రియాశీల రాజకీయాల్లో బిజీగా ఉంటూ క్రికెట్‌కు దూరమైన ఈ వెటరన్ క్రికెటర్ రీఎంట్రీ ఇస్తున్నాడు. తన కామెంట్రీ కోసం ఎదురు చూస్తున్న వారికి ఆయన శుభవార్త చెప్పాడు. మరో మూడ్రోజుల్లో మొదలయ్యే ఐపీఎల్-2024తో కామెంట్రీ కెరీర్‌ను తిరిగి స్టార్ట్ చేయనున్నట్లు తెలిపాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మార్చి 22న జరిగే సీజన్ స్టార్టింగ్ మ్యాచ్‌లో సిద్ధూ తన కామెంట్రీని ప్రారంభించనున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఐపీఎల్ బ్రాడ్‌కాస్టర్స్ స్పార్ స్పోర్ట్స్ ట్విట్టర్లో ఓ ప్రకటన చేసింది. గ్రేట్ కామెంటేటర్ సిద్ధూ మళ్లీ వచ్చేస్తున్నాడని వెల్లడించింది.
ఇక, 20 ఏళ్ల నాటి ఓ కేసులో సిద్ధూ కొన్నాళ్ల పాటు జైలు జీవితం గడిపి వచ్చారు. 1988లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్నామ్ సింగ్ అనే వ్యక్తి చనిపోయాడు. ఆ కేసులో సిద్ధూకు కోర్టు ఒక ఏడాది పాటు జైలు శిక్షను విధించింది. పది నెలల పాటు జైలులో శిక్ష అనుభవించి ఇటీవలే విడుదలయ్యాడు నవ్‌జ్యోత్. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్‌ను కలిశాడు. పంజాబ్ పాలిటిక్స్‌లో మళ్లీ ఆయనకు కీలకపాత్ర అప్పగించే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో సిద్ధూ క్రికెట్ వైపు రావాలని నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఐపీఎల్‌కే పరిమితమవుతాడా? లేదా ఆ తర్వాత కూడా సిద్ధూ కామెంట్రీని కంటిన్యూ చేస్తాడా? అనేది మాత్రం క్లారిటీ లేదు. మరి.. సిద్ధూ కమ్‌బ్యాక్‌పై మీ ఒపీనియన్‌ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
A wise man once said, “Hope is the biggest ‘tope’”
And this wise man, the great @sherryontopp himself, has joined our Incredible StarCast! 👏
Don’t miss his incredible commentary (and gajab one-liners) in #IPLOnStar – STARTS MAR 22, 6:30 PM onwards, LIVE on Star Sports Network! pic.twitter.com/BjmFq9OKQ4
— Star Sports (@StarSportsIndia) March 19, 2024