Nidhan
పాపులర్ ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. ఆ టీమ్‌కు ఒక మ్యాచ్ విన్నర్ దూరమయ్యాడు.
పాపులర్ ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. ఆ టీమ్‌కు ఒక మ్యాచ్ విన్నర్ దూరమయ్యాడు.
Nidhan
ముంబై ఇండియన్స్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోని టాప్ ఫ్రాంచైజీల్లో ఒకటి. ఐదుసార్లు ట్రోఫీ ఎగరేసుకుపోయిన ఈ టీమ్ మీద ఎప్పుడూ భారీ అంచనాలు ఉంటాయి. అందుకు తగ్గట్లే ముంబై కూడా సత్తా చాటుతూ వస్తోంది. స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉండటం.. సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ఇషాన్ కిషన్ లాంటి టీమిండియా ప్లేయర్లు జట్టులో ఉండటంతో ముంబైకి ఫుల్ క్రేజ్ వచ్చింది. ఎంఐకి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఇటీవల కాలంలో ఈ ఫ్రాంచైజీ తరచూ వార్తల్లో నిలుస్తోంది. రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించడం, గుజరాత్ సారథిగా ఉన్న హార్దిక్ పాండ్యాను తీసుకొచ్చి జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. అయితే గాయంతో బాధపడుతున్న హార్దిక్ ఇంకా కోలుకోకపోవడంతో ఎంఐ టెన్షన్లో ఉంది. ఈ తరుణంలో ఆ జట్టుకు మరో బిగ్ షాక్ తగిలింది.
చీలమండ గాయం కారణంగా బాధపడుతున్న ముంబై స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఇంకొన్నాళ్ల పాటు క్రికెట్‌కు దూరం కానున్నాడు. ఈ మిస్టర్ 360 ప్లేయర్‌ను మరో హెల్త్ ఇష్యూ కూడా వేధిస్తున్నట్లు తెలుస్తోంది. స్పోర్ట్స్ హెర్నియా వల్ల సూర్యకుమార్ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ డాషింగ్ బ్యాట్స్‌మన్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. మరో మూడ్రోజుల్లో సర్జరీ కోసం జర్మనీలోని మ్యూనిచ్కు అతడు పయనమవుతాడు. కాబట్టి రంజీ ట్రోఫీ-2024తో పాటు ఐపీఎల్-2024 స్టార్టింగ్ మ్యాచులకు సూర్య దూరంగా ఉంటాడు. ఇప్పటికే హార్దిక్ పాండ్యా చీలమండ నొప్పితో గేమ్‌కు దూరంగా ఉన్నాడు. అతడు ఎప్పుడు ముంబై ఇండియన్స్‌తో చేరతాడనే దానిపై క్లారిటీ లేదు.
హార్దిక్ విషయంలో క్లారిటీ రాకపోగా.. ఇప్పుడు సూర్య కూడా దూరమవడంతో ఇద్దరు కీలక ప్లేయర్లు, మ్యాచ్ విన్నర్స్ లేకుండా ఎంఐ వచ్చే ఐపీఎల్ సీజన్‌ను స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. స్పోర్ట్స్ హెర్నియాతో బాధపడుతున్న సూర్య పూర్తిగా కోలుకునేందుకు 8 నుంచి 9 వారాలు పట్టే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఈ ఏడాది జూన్‌లో టీ20 వరల్డ్ కప్ ఉంది. గతేడాది జరిగిన వన్డే వరల్డ్ కప్‌ను భారత్ తృటిలో మిస్సయింది. ఫైనల్ వరకు వచ్చి ట్రోఫీని చేజార్చుకుంది. కాబట్టి ఈసారి ప్రపంచ కప్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోవద్దని టీమిండియా భావిస్తోంది. అందుకోసం ఐపీఎల్‌ను పక్కనపెట్టి పూర్తిగా కోలుకునేందుకు సూర్యకు మరింత రెస్ట్ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో బీసీసీఐ ఎలా వ్యవహరిస్తుందో చూడాలి. మరి.. సూర్య రూపంలో ముంబైకి బిగ్ షాక్ తగలడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: ఓవరాక్షన్ స్టార్ ఇది టెస్ట్ అని మరిచావా? ఆ కొట్టుడేంది? రియాన్ పరాగ్ విధ్వంసకర శతకం!
Suryakumar Yadav will need upto nine weeks post hernia operation 👀#INDvsAFG #IndianCricketTeam #BCCI #SuryakumarYadav #IPL2024 #CricketTwitter pic.twitter.com/eVSst9duKP
— InsideSport (@InsideSportIND) January 8, 2024