Somesekhar
బ్యాటింగ్ ఆర్డర్ లో ధోని వెనక్కి రావడంపై ఫ్యాన్స్ నిరాశలో ఉంటే.. కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ధోని ఇలా రావడానికి వెనక బలమైన కారణం ఉంది. ఆ రీజన్ తెలిస్తే.. హ్యాట్సాఫ్ అనాల్సిందే. ఆ వివరాల్లోకి వెళితే..
బ్యాటింగ్ ఆర్డర్ లో ధోని వెనక్కి రావడంపై ఫ్యాన్స్ నిరాశలో ఉంటే.. కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ధోని ఇలా రావడానికి వెనక బలమైన కారణం ఉంది. ఆ రీజన్ తెలిస్తే.. హ్యాట్సాఫ్ అనాల్సిందే. ఆ వివరాల్లోకి వెళితే..
Somesekhar
మహేంద్రసింగ్ ధోనిని పిచ్చిగా అభిమానించే ఫ్యాన్స్.. కొన్ని రోజులుగా అతడిపై కాస్త గుర్రుగా ఉన్నారు. తాము అనుకున్నది జరగకపోతే.. తాము అభిమానించే ఆటగాడిపై కూడా విమర్శలు గుప్పిస్తారు ఫ్యాన్స్. ప్రస్తుతం ధోని విషయంలో కూడా అదే జరుగుతున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని మ్యాచ్ ల్లో ధోని మిడిలార్డర్ నుంచి లోయర్ ఆర్డర్ లోకి తన బ్యాటింగ్ స్థానాన్ని మార్చుకున్నాడు. పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ఏకంగా శార్థూల్ ఠాకూర్ తర్వాత 9వ నెంబర్ లో బ్యాటింగ్ కు వచ్చాడు. దీంతో అభిమానులకు చిర్రెత్తుకొచ్చింది. ఎంతో ప్రేమతో ధోని ఆటను చూద్దామనుకున్న వారికి తీవ్ర నిరాశ ఎదురైంది. అయితే ధోని ఇలా లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు రావడానికి ఓ బలమైన కారణం ఉంది. అది తెలిస్తే.. ఫ్యాన్స్ అందరూ హ్యాట్సాఫ్ అనాల్సిందే.
మహేంద్రసింగ్ ధోని.. ఈ ఐపీఎల్ సీజన్ లో చివర్లో బ్యాటింగ్ కు వచ్చి, తన ధనాధన్ బ్యాటింగ్ తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేస్తూ.. జట్టు విజయాలకు దోహదపడుతున్నాడు. అయితే కొన్ని మ్యాచ్ లుగా ధోని తన బ్యాటింగ్ ఆర్డర్లోల మార్పులు చేసుకుంటూ వస్తున్నాడు. దాంతో అతడి బ్యాటింగ్ చూడాలని ఎంతో ఆశగా స్టేడియానికి వచ్చిన ఫ్యాన్స్ కు నిరాశ తప్పడంలేదు. ఇక ఈ విషయంపై ఫ్యాన్స్ ధోనిపైనే కోపంగా ఉన్నారు ఫ్యాన్స్. ఇక ధోని ఇలా బ్యాటింగ్ ఆర్డర్లో వెనక్కి జరగడంపై టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సైతం ధోనిని ఆడకుండా పక్కన కూర్చోవాలని సూచించాడు.
అయితే ధోని ఇలా బ్యాటింగ్ ఆర్డర్లో వెనక్కి జరగడానికి కారణం ఏంటని? ఓ ఇంగ్లీష్ మీడియా ఆరా తీయగా.. భయంకరమైన నిజం బయటపడింది. ధోని కావాలని కాదు.. తప్పనిసరి పరిస్థితుల్లోనే అలా బ్యాటింగ్ ఆర్డర్ లో వెనక్కి వెళ్లాడు. అసలు విషయం ఏంటంటే? ఈ సీజన్ ప్రారంభం నుంచే తొడ కండర గాయంతో బాధపడుతున్నాడు ధోని. దాంతో ఎక్కువ పరిగెత్తలేడు. అందుకే చివర్లో బ్యాటింగ్ కు వస్తున్నాడు. మోకాలికి అయిన సర్జరీ పూర్తిగా తగ్గినప్పటికీ.. ఈ తొడ కండర గాయం మాత్రం ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉంది. ఒకపక్క ఈ గాయానికి మందులు వాడుతూనే ధోని కీపింగ్ కు దిగుతున్నాడు.
సీఎస్కే రెండో వికెట్ కీపర్ డేవాన్ కాన్వే గాయం కారణంగా సీజన్ కు దూరం కావడంతో.. మిస్టర్ కూల్ పైనే మెుత్తం భారం పడింది. దాంతో చేసేదేమీ లేక గాయం ఇబ్బంది పెడుతున్నా.. జట్టు కోసం దాన్ని పంటి బిగువన దిగమింగుకుని బరిలోకి దిగుతున్నాడు. వాస్తవానికి ధోనిని ఎక్కువ గా పరిగెత్తకూడదని, రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. కానీ టీమ్ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఎంతో బాధను దిగమింగుకుని ఆడుతున్నాడు ధోని. ఈ విషయం తెలియక ఫ్యాన్స్, నెటిజన్లు ధోనిపై విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికైనా మిస్టర్ కూల్ ను విమర్శించడం మానేయాలని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి టీమ్ కోసం ఇంత బాధను దిగమింగుకుంటూ బరిలోకి దిగుతున్న ధోనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.