iDreamPost
android-app
ios-app

MS Dhoni: టీమ్​లోకి రావాలంటే 20 కిలోలు తగ్గాల్సిందే.. ధోని రూల్​కు షాకైన ఆఫ్ఘాన్ క్రికెటర్!

  • Author singhj Published - 06:06 PM, Sat - 9 December 23

ఫిట్​నెస్​కు ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చే భారత మాజీ కెప్టెన్ ధోని ఒక ప్లేయర్​కు వింత రూల్ వేశాడట. 20 కిలోలు తగ్గితేనే టీమ్​లోకి తీసుకుంటాడనని అన్నాడట.

ఫిట్​నెస్​కు ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చే భారత మాజీ కెప్టెన్ ధోని ఒక ప్లేయర్​కు వింత రూల్ వేశాడట. 20 కిలోలు తగ్గితేనే టీమ్​లోకి తీసుకుంటాడనని అన్నాడట.

  • Author singhj Published - 06:06 PM, Sat - 9 December 23
MS Dhoni: టీమ్​లోకి రావాలంటే 20 కిలోలు తగ్గాల్సిందే.. ధోని రూల్​కు షాకైన ఆఫ్ఘాన్ క్రికెటర్!

మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరు తెలియని క్రికెట్ అభిమాని ఉండడని అనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. 22 గజాల పిచ్ మీద ఈ ప్లేయర్ చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. డాషింగ్ బ్యాటింగ్​తో, అద్భుతమైన కెప్టెన్సీ స్కిల్స్​తో వరల్డ్ క్రికెట్ మీద తనదైన ముద్ర వేశాడు మాహీ. కెరీర్ మొదట్లో పించ్ హిట్టింగ్​తో బౌండరీలు, సిక్సులు కొడుతూ అలరించేవాడు ధోని. ఆ తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోవడంతో దూకుడు తగ్గించాడు. సిచ్యువేషన్​కు తగ్గట్లు ఆడుతూ టీమ్​కు సింగిల్ హ్యాండ్​తో ఎన్నో విజయాలు అందించాడు. ఇటు టీమిండియాను సక్సెస్​ఫుల్​గా నడిపిస్తూనే అటు ఇండియన్ ప్రీమియర్ లీగ్​లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టునూ విజయపథంలో ముందుకు తీసుకెళ్లాడు. భారత జట్టుకు ఐసీసీ ట్రోఫీలు అందించాడు. అదే టైమ్​లో ఐపీఎల్​లో సీఎస్​కేనూ పలుమార్లు విజేతగా నిలిపాడు.

ఐపీఎల్​లో చెన్నై సూపర్ కింగ్స్ సక్సెస్ వెనుక ఉన్న ప్రధాన కారణాల్లో ఎంఎస్ ధోని ఒకడు. బ్యాటింగ్​లో అదరగొడుతూనే అద్భుతమైన కెప్టెన్సీతో లీగ్​లో మిగతా టీమ్స్ కంటే సీఎస్​కేను ముందంజలో నిలిపాడు. స్టార్ ప్లేయర్లు ఉంటేనే జట్టు గెలుస్తుందనే రూల్స్​ను అతడు బ్రేక్ చేశాడు. పెద్దగా క్రేజ్, పేరు లేని ఆటగాళ్లను ఆడిస్తూ టీమ్​కు పలుమార్లు టైటిల్స్ అందించాడు. ఏ ప్లేయర్​లో ఏ టాలెంట్ ఉంది? ఎవర్ని ఎప్పుడు ఆడించాలి? ఎవరి దగ్గరి నుంచి పెర్ఫార్మెన్స్​ను ఎలా రాబట్టుకోవాలి? అనేది బహుశా ధోనీకి తెలిసినంత బాగా క్రికెట్​లో మరొకరికి తెలియదనే చెప్పాలి. గతేడాది కూడా స్టార్లు లేకపోయినా.. యువకులు, కొందరు సీనియర్లతో నిండిన టీమ్​ను సక్సెస్​ఫుల్​గా నడిపిస్తూ మరో ఐపీఎల్ ట్రోఫీ అందించాడు.

గత ఐపీఎల్​లో గాయపడిన ధోని వచ్చే సీజన్​లో ఆడతాడో లేదో అనే అనుమానాలు ఏర్పడ్డాయి. కానీ ఇంజ్యురీ నుంచి వేగంగా కోలుకుంటున్న మాహీ.. ఫిట్​నెస్​ మీద ఫోకస్ చేస్తున్నాడని తెలుస్తోంది. అతడు నెక్స్ట్ ఐపీఎల్​లో ఆడటం దాదాపుగా ఖాయమైంది. దీంతో అతడి ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. ఇక, టాలెంట్ ఉన్న యంగ్​స్టర్స్​ను ఎంకరేజ్ చేయడంలో ధోని ముందుంటాడనేది తెలిసిందే. ప్రతిభ ఉన్న వాళ్లు కనిపిస్తే చాలు.. వారిని పిలిచి మరీ అవకాశాలు ఇస్తాడని అతడికి పేరుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి ఐపీఎల్ వరకు మాహీ ఎంతో మందికి ఛాన్సులు ఇచ్చి ప్రోత్సహిచంచిన దాఖలాలు ఉన్నాయి. ఇలాగే ఓ క్రికెటర్​కు అవకాశం ఇవ్వాలని అనుకున్నాడట.

మంచి బ్యాటర్​గా, వికెట్ కీపర్​గా పేరు తెచ్చుకున్న ఆఫ్ఘానిస్థాన్ క్రికెటర్ షెహజాద్​ను టీమ్​లోకి తీసుకోవాలని ధోని అనుకున్నాడట. అయితే అధిక బరువుతో ఉన్న షెహజాద్​ను ఏకంగా 20 కిలోలు వెయిట్ తగ్గాలని సూచించడంతో అతడు షాకయ్యాడట. ఈ విషయాన్ని మరో ఆఫ్ఘాన్ ప్లేయర్ అస్ఘర్ అఫ్ఘాన్ రివీల్ చేశాడు. ‘20 కిలోలు తగ్గితే ఐపీఎల్​ టీమ్​లోకి తీసుకుంటానని షెహజాద్​కు ధోని చెప్పాడు. కానీ వెయిట్ తగ్గకపోగా మరో 5 కిలోలు బరువు పెరిగాడు షెహజాద్’ అని అస్ఘర్ చెప్పాడు. ఇది తెలిసిన నెటిజన్స్ నవ్వుకుంటున్నారు. అతడు మంచి ఛాన్స్ మిస్సయ్యాడని అంటున్నారు. బరువు తగ్గితే అవకాశం వస్తుందని తెలిసినా ఇంకా వెయిట్ పెరగడం ఏంటని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. 20 కిలోలు తగ్గితేనే టీమ్​లోకి తీసుకుంటానంటూ ధోని రూల్ విధించడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Hardik Pandya: హార్దిక్​ పాండ్యా ప్లేస్​లో యంగ్ ఆల్​రౌండర్.. ఎవరీ అర్షిన్ కులకర్ణి?