iDreamPost
android-app
ios-app

SRHపై దారుణ ఓటమి.. లక్నో పోస్ట్ వైరల్! ఇది అస్సలు ఊహించి ఉండరు!

  • Published May 09, 2024 | 2:55 PM Updated Updated May 09, 2024 | 2:55 PM

SRHతో జరిగిన మ్యాచ్ లో దారుణ ఓటమి తర్వాత లక్నో తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ను షేర్ చేసింది. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఆ పోస్ట్ లో ఏముంది? ఆ వివరాల్లోకి వెళితే..

SRHతో జరిగిన మ్యాచ్ లో దారుణ ఓటమి తర్వాత లక్నో తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ను షేర్ చేసింది. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఆ పోస్ట్ లో ఏముంది? ఆ వివరాల్లోకి వెళితే..

SRHపై దారుణ ఓటమి.. లక్నో పోస్ట్ వైరల్! ఇది అస్సలు ఊహించి ఉండరు!

ప్లే ఆఫ్స్ కు వెళ్లాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో జూలు విదిల్చింది సన్ రైజర్స్ హైదరాబాద్. లక్నో సూపర్ జెయింట్స్ ను ఏకంగా 10 వికెట్ల తేడాతో మట్టికరిపించి.. తన పే ఆఫ్స్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. ఉప్పల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించింది SRH. లక్నో విధించిన 166 పరుగులు టార్గెట్ ను కేవలం 9.4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా ఊదిపడేసింది. ఇక ఈ మ్యాచ్ లో దారుణ ఓటమి తర్వాత లక్నో తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ను షేర్ చేసింది. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

లక్నోపై సన్ రైజర్స్ గెలిచిన తీరుకు ప్రపంచ క్రికెట్ ఆశ్చర్యపోతోంది. టార్గెట్ 166 కాబట్టి సరిపోయింది.. లేకుంటే మెుదట బ్యాటింగ్ చేసుంటే.. ఈజీగా 300 కొట్టేవారు అంటూ క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ చేసిన ట్విట్ ను రీట్విట్ చేసింది సన్ రైజర్స్ యాజమాన్యం. ఇక ఈ విజయంపై టాలీవుడ్ నటుడు విక్టరీ వెంకటేష్ కూడా తన సంతోషాన్ని పంచుకున్నాడు. “ఆరెంజ్ ఆర్మీ అంటే సునామీ, అంతా ఓ మెరుపులా జరిగిపోయింది. సన్ రైజర్స్ ఈ మ్యాచ్ లో అద్భుతంగా గెలిచింది” అంటూ రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ ను సైతం రీపోస్ట్ చేసింది SRH యాజమాన్యం.

ఇదంతా కాసేపుపక్కన పెడితే.. తమ ఓటమి తర్వాత లక్నో చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. మీమ్ గాడ్ బ్రహ్మానందం గోడకు ఆనుకుని దిగాలుగా కూర్చున్న పిక్ ను షేర్ చేస్తూ.. ఒకే బై అంటూ రెండు చేతులు జోడించి దండం పెట్టే ఎమోజీని క్యాప్షన్ గా రాసుకొచ్చింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విసయం ఏంటంటే? గెలిచిన తర్వాత సన్ రైజర్స్ చేసిన పోస్ట్ ల కంటే ఎక్కువ రీచ్ లక్నో చేసిన పోస్ట్ కు వచ్చింది. లక్నో చేసిన పోస్ట్ కు 15 లక్షలకు పైగా రీచ్ రాగా.. 65 వేల మందికిపైగా లైక్స్ చేయగా.. 4.3 వేల మంది రీ పోస్ట్ చేశారు. ఇక లక్నో పోస్ట్ కు సన్ రైజర్స్ ఫ్యాన్స్ బైబై అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొందరు ఈ పేజ్ అడ్మిన్ తెలుగు వ్యక్తా? అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఓడిపోయిన తర్వాత లక్నో పెట్టిన ఈ పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.